EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

సైకిల్ మెకానిక్ నుండి ఎమ్మెల్యే అయినా ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేదు.

Author:

Egmore MLA Nallathambi

ఒక్కసారి ఎమ్మెల్యే అయితే.. వచ్చే ఎన్నికల్లో పెట్టుబడికి ఢోకా లేకపోవడమే కాదు! భవిష్యత్తుకూ భరోసా ఖాయం! కాంట్రాక్టులు.. కాలేజీలు.. పనుల్లో కమీషన్లు., వసూళ్లు., పార్టీమారినందుకు కోట్లరూపాయల బహుమతులు.. రాజకీయాల్లో “పై సంపదన”కు అలవాటు పడి అసలు జీతం ఎంతోకూడా తెలియని ఎమ్మెల్యేలున్నారు. కానీ, ఓ తమిళ తంబి ఐదేళ్లు ఎమ్మెల్యేగా పని చేశాడు! తనకొచ్చిన జీతభత్యాలను కూడా పార్టీ కార్యక్రమాలకు ఖర్చు చేసేశాడు. ఐదేళ్లు తిరిగిపోయాయి మళ్లీ టికెట్‌ వచ్చింది. కానీ, ఎన్నికల్లో పోటీకి తగినంత డబ్బు లేదు., దాంతో పోటీ నుంచి తప్పుకొన్నాడు. టికెట్‌ వదులుకున్నాడు అధిష్టానం పిలిచి నచ్చచెప్పాలని చూసినా ఇప్పుడు ఖర్చు పెడితే మళ్ళీ ఆడబ్బు కోసం చేసిన అప్పు తీర్చటానికి అవినీతికి పాల్పడాల్సి వస్తుందని,తాను అలా చేయలేననీ అంటూ పక్కకు తప్పుకున్నాడు ఆయనే, ఎగ్మూర్‌ ఎమ్మెల్యే నల్లతంబి!

చెన్నై పురసైవాక్కంలో సైకిల్‌ మరమ్మతుల దుకాణం నడుపుతున్న డీఎండీకే యువజన విభాగం ఉపకార్యదర్శి నల్లతంబి గురించి 2011 శాసనసభ ఎన్నికల వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. నటుడు విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే రాష్ట్ర యువజన విభాగ సహాయ కార్యదర్శిగా వ్యవహరించేవాడు. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమితో కలిసి పోటీ చేసిన డీఎండీకేకు ఎగ్మూర్‌ నియోజకవర్గాన్ని కేటాయించారు. ఆ ఎన్నికల్లో ఆయనకు ఎగ్మోర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అవకాశం లభించింది. డీఎంకే అభ్యర్థి పరిధి ఇళంవళుదిని స్వల్ప ఓట్ల తేడాతో ఓడించడంతో ఒక్కసారిగా నల్లతంబి వెలుగులోకి వచ్చారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మళ్లీ టిక్కెట్‌ ఇస్తామని పార్టీ అధిష్టానం చెప్పినప్పటికీ దాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించారు.

ఐదేళ్లుగా ఎమ్మెల్యేకు ఇచ్చే జీతభత్యాలను పార్టీ కార్యక్రమాలకు, కుటుంబ జీవనానికి నల్లతంబి వినియోగించారు. అయితే, గత ఎన్నికల్లో ఆయనకు ఆర్థిక సాయం చేసిన ఉత్తర చెన్నై పార్టీ కార్యదర్శి యువరాజ్‌ ఇటీవల డీఎంకేలో చేరారు. దాంతో, యువరాజ్‌ పార్టీ కార్యదర్శి పదవిని నల్లతంబికి ఇచ్చారు. కానీ, ఇక్కడే నల్లతంబికి సమస్య వచ్చి పడింది. ఈసారి ఆయనకు ఆర్థిక సాయం చేసేవారు కరువయ్యారు. దాంతో, ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నల్లతంబి నిర్ణయించుకున్నారు. అయితే, ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఆయన.. మళ్లీ సైకిల్‌ దుకాణం నడపలేక, అలాగని ఏం చేయాలో అర్థంగాక విజయకాంత సతీమణి ప్రేమలతకు అంగరక్షకుడిగా మారిపోయారు. ప్రచారానికి వెళ్లేటప్పుడు ప్రేమలత కూడా నల్లతంబినే తీసుకెళుతున్నారు. నిజానికి, పార్టీ అధిష్ఠానం తలచుకుంటే ఎన్నికల ఖర్చును భరించి ఉండేది. కానీ, ఈసారి ఆయన్ని విజయకాంత చిన్నచూపు చూశారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే, తన పార్టీలోకి రాని డీఎండీకే ఎమ్మెల్యేల పనులు ఏవీ జరగకుండా సీఎం జయ పావులు కదిపారని, దాంతో నల్లతంబి కనీసం పార్టీ ఫండ్‌ కూడా సేకరించలేకపోయారని, అందుకే విజయకాంత్ ఆయనను పక్కనబెట్టారని మరో వర్గం చెబుతోంది.

అయితే నల్ల తంబి మాత్రం మరోలా కథని వినిపిస్తున్నారు…
ప్రస్తుతం తనకు ఎమ్మెల్యే వేతనంగా రూ.55 వేలు అందుతోందని… అందులో పీఏ వేతనం, కార్యాలయ నిర్వహణ, రవాణా ఖర్చులు పోనూ మిగతా మొత్తంతో కుటుంబాన్ని పోషిస్తున్నట్టు చెప్పారు. తనపై ఆరు నెలల సస్పెన్షన్‌ ఉన్నప్పుడు కుటుంబ ఖర్చుల కోసం కెప్టెన్‌ ప్రతి నెలా రూ.10 వేలు ఇచ్చారని గుర్తు చేశారు. ఇతర పార్టీలలో చేరితే రూ.5 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు ఇస్తామని బేరాలాడారని, కానీ కెప్టెన్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ ద్రోహం చేయబోనని తెలిపారు. పార్టీ టిక్కెట్‌ మినహా వేరే ఏదైనా పని ఇవ్వాలని కోరడంతో ప్రస్తుతం వదినమ్మ (ప్రేమలత)కు అంగరక్షకుడిగా నియమించి ఆమెతో పాటు తనను ఎన్నికల ప్రచారానికి పంపుతున్నారని గుర్తు చేశారు.

(Visited 630 times, 32 visits today)

Comments

comments