EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / health / డాక్టర్ దగ్గరకు వెళ్ళగానే నాలుకను చూపించమంటారు..! నాలుకను పరిశీలించడం వలన డాక్టర్లు ఏం తెలుసుకుంటారు..?

డాక్టర్ దగ్గరకు వెళ్ళగానే నాలుకను చూపించమంటారు..! నాలుకను పరిశీలించడం వలన డాక్టర్లు ఏం తెలుసుకుంటారు..?

Author:

హెల్త్ బాగొక హాస్పటల్ కి వెళ్లినప్పుడు డాక్టర్లు నోరు తెరవమని,నాలుక బైటికి తీయమని చెప్తుంటారు.కొద్దిసేపు పరిశీలిస్తారు.కానీ జ్వరం,తలనొప్పి,విరేచనాలు ఇలా ఏ ప్రాబ్లంతో వెళ్లినా కూడా నాలుకనే ఎందుకు చెక్ చేస్తారు అని ఎప్పుడైనా డౌటొచ్చిందా. నాలుకను పరిశీలించడం వలన నాలుక యొక్క లక్షణాలను బట్టి మన ఆరోగ్యానికి సంభందించిన కొన్ని విషయాలు తెలుస్తాయి.

నాలుక ఎర్రబారి మెరవడం, అదే సమయంలో ఒంటి రంగు పాలిపోయి ఉండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం.. ఇవన్నీ ఐరన్‌ లోపం, రక్తహీనత ఉన్నాయని చెప్పే లక్షణాలు.కొందరి నాలుక మీద వెంట్రుకలు మొలిచినట్లుగా నల్లగా కనిపిస్తుంది. విపరీతంగా పొగతాగడం వల్ల లేదంటే శక్తివంతమైన యాంటీబయాటిక్స్‌ వాడటం వల్ల వచ్చే ఫంగస్‌ కారణమై ఉంటుంది.

doctor patient communication with tongue

నాలుక వాపు అనేది ఒక లక్షణం. నాలుక వాచినప్పుడు తినడానికి,మాట్లాడానికి ఇబ్బందిగా ఉంటుంది.నాలుక వాయడంతో పాటు ఒక్కోసారి రంగు కూడా మారుతుంది. శరీరంలో ఇన్‌ఫెక్షన్లు బాగా పెరిగిపోయినప్పుడు కనిపించే లక్షణం.

నాలుక రంగు మారడం అన్నది కొందరిలో కామెర్లు, రక్తహీనత లేదా శరీరానికి సరిపడా ఆక్సిజన్‌ అందకపోవడం వల్ల కూడా కావచ్చు.నాలుకపై తెల్ల మచ్చలు,నల్లమచ్చలుండడాన్ని ఎప్పుడైనా గమనించారా..ఈ తెల్ల మచ్చలకు కారణం ఫంగస్..ఫంగస్ ఇన్ఫెక్షన్ల కారణంగానే ఈ మచ్చలు ఏర్పడతాయి.నాలుక ఒక పక్కకు వాలిపోతే అది పక్షవాత లక్షణంగా పరిగణిస్తారు లేదా కొన్ని రకాల నరాల వ్యాధుల వల్ల గానీ, మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ సమస్య వల్ల గానీ కావచ్చు.ఇప్పుడర్ధమయిందా డాక్టర్ దగ్గరకు వెళ్లగానే ఎందుకు నాలుకను పరీక్షిస్తారో.

(Visited 1 times, 528 visits today)