Home / Political / అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోనున్న డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోనున్న డొనాల్డ్ ట్రంప్

Author:

అమెరికా దేశ 45 వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు, ప్రపంచ పెద్దన్నగా చెలామణి అవుతున్న అమెరికాలో అధ్యక్షుడి ఎన్నికల అంశం ముగిసింది, సంవత్సర కాలముగా వార్తల్లో నిలిచిన ఈ అంశం రిపబ్లికన్ పార్టి అభ్యర్ది డొనాల్డ్ ట్రంప్ విజయంతో ముగిసింది. హోరాహోరీగా జరిగిన పోటీలో హిల్లరీ పై ట్రంప్ దేపై చెయ్యి అయ్యింది. విజయానికి కావాల్సిన 270 ఎలక్టోరల్ కాలేజ్ వోట్లు సాధించి డొనాల్డ్ ట్రంప్ విజేతగా నిలిచారు.

donald-trump-became-us-president

నిన్న జరిగిన ఎన్నికలలో ట్రంప్ కి 48% శాతం వోట్లు రాగ, హిల్లరీ కి 47% శాతం వోట్లు లభించాయి. అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటివ్స్ ను మరియు స్టేట్ సెనేట్ ని కూడా రిపబ్లికన్ పార్టి మెజారిటితో కైవసం చేసుకుంది. ఈ పరిణామంతో ఆసియాలోని అన్ని స్టాకు మార్కెట్లు నష్టాలలో కొనసాగుతున్నాయి. మీడియా సంస్థలు, వివిధ దేశాల వారు హిల్లరీ గెలవాలని కోరుకున్నా విజయం మాత్రం ట్రంప్ నే వరించింది.

(Visited 1,716 times, 8 visits today)