EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / Technology / మొబైల్ ఫోన్ ని రాత్రంతా చార్జింగ్ పెడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త!!!

మొబైల్ ఫోన్ ని రాత్రంతా చార్జింగ్ పెడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త!!!

Author:

రోజు రోజుకి కొత్తపుంతలు తొక్కుతున్న డిజిటల్ ప్రపంచం లో హై ఫై టెక్నాలజీతో బతుకుతున్న మనం చేతిలో మొబైల్ లేకపోతే ఇంకే పనీ చేయలేని స్థితికొచ్చాం. డే అంతా ఆఫీసుల్లో, ఇంటికి రాగానే పిల్లలు, ఫ్యామిలీ తో గడిపే సమయంలో కూడా ఒక చేతిలో మొబైల్ ఉండాల్సిందే. షాపింగ్ నుంచి బ్యాంకింగ్ పనులు, క్రెడిట్, డెబిట్ కార్డ్ ఒకటేమిటి సర్వం మొబైల్ మయం అయిపొయింది. తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా మొబైల్ లేకపోతె ఏ పనీ సక్రమంగా జరగదు. మరి ఆ మొబైల్స్ లో బాటరీ చార్జింగ్ లేకపోతే ఎంత అసహనానికి లొనవుతామో మనకు తెలుసు. అందుకే మొబైల్ ని ఎల్లప్పుడూ ఆక్టివ్ మోడ్ లో ఉంచడానికి ఎప్పటికప్పుడు చార్జింగ్ చేయడంకాని, పవర్ బ్యాంక్స్ వాడటం కాని చేస్తుంటాం. అయితే దాదాపు 20 శాతం మంది మాత్రం పడుకునే ముందు మొబైల్ ని చార్జింగ్ పెట్టేసి ఉదయం లేచాక మాత్రమే తీస్తున్నారు అంటే మొబైల్ ని ఫుల్ నైట్ చార్జింగ్ పెట్టేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమని ఎన్ని సార్లు ఎంతమంది హెచ్చరించినా వీరు మారడం లేదు.

phone charging problems

అయితే రీసెంట్ గా జరిగిన కొన్ని పరిశోధనల్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. నిజానికి ఈరోజుల్లో మనం వాడుతున్న ఫోన్లు రెండు గంటల్లోనే ఫుల్ చార్జింగ్ అవుతాయి. దానికి కూడా 4 వాట్ల కరెంట్ ఖర్చవుతుంది. కాని మనం ఫుల్ నైట్ చార్జింగ్ పెట్టడం వల్ల దాదాపుగా 8 గంటల పాటు చార్జింగ్ అవడం వల్ల 24 వాట్ల కరెంట్ ఖర్చవుతుంది. అంటే దాదాపు 20 వాట్ల కరెంటు వృధా. ఒక్క మొబైల్ ఫోన్ వల్లే ఇంత వృధా అయితే ఇంకా మన దేశంలో మొత్తం కొన్ని కోట్ల మంది రాత్రి ఫుల్లుగా చార్జింగ్ పెట్టడం వల్ల ఎంత వృధా అవుతుందో గెస్ చేయండి.

మన దేశంలో దాదాపు 80 కోట్ల మంది మొబైల్స్ వాడుతున్నరనుకుందం. వారిలో 10 శాతం మంది మొబైల్స్ ని రాత్రి మొత్తం చార్జింగ్ పెడితే మొత్తం 19.2 లక్షల కిలో వాట్ల కరెంటు వృధాగా ఖర్చయిపోతుంది. అంటే 1920 మెగా వాట్స్ అన్నమాట. ఒక మెగా వాట్ కరెంట్ తయారికి ప్రభుత్వానికి దాదాపు 5 కోట్ల ఖర్చవుతుంది . ఈ లెక్కన 1920 మెగా వాట్ల తయారికి దాదాపు 10 వేల కోట్ల ఖర్చవుతుంది.. అంటే మనం ఒక్క రాత్రి చేసే చార్జింగ్ నిర్లక్షం వల్ల 10వేల కోట్ల దుబారా ఐనట్టే. అంతే కాకుండా ఎక్కువ సేపు చార్జింగ్ పెట్టడం వలన బాటరీ తొందరగా పాడయ్యే, ప్రమాదాలకు గురయ్యె అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇకనైనా మనం మేలుకుని మొబైల్ చార్జింగ్ ఎంత అవసరమో అంతే చేసుకుంటే ప్రజలని, ప్రభుత్వాన్ని, కరెంటుని కూడా కాపాడినవాళ్ళం అవుదాం.

Comments

comments