ఇంట్లో ఈ ప్రదేశాలలో చెప్పులు ధరిస్తే అశుభం.

Author:

జనరల్ గా మనం గుడికి గాని పవిత్ర స్థలాలకు గానీ వెళ్ళినపుడు లోపలకు ప్రవేశించే ముందు మన పాదరక్షలు లేదా చెప్పులని బయటే వదిలేసి వెళ్తాం. ఇది మనం తరతరాలుగా ఆచరిస్తున్నదే. ఇంకా మన ఇంటిలోపల కూడా పూజ గదిలోకి చెప్పులేసుకుని వెళ్ళే ధైర్యం చేయం. ఎందుకంటే దేవుడి పూజ గది పవిత్రమైనదై కాబట్టి. అయితే మన ఇంట్లో పూజ గదే కాదు మరి కొన్ని ప్లేసుల్లో కూడా చెప్పులేసుకుని వెళ్లొద్దట..కాదు అని పాదరక్షలటో వెళ్తే ఇంటికి చాలా అశుభకరమట.

ముఖ్యంగా మన ఇంటి పూజ గదే కాకుండా నిత్యావసరాలు నిలువ చేసే స్టోర్ రూమ్, బంగారం దాచి ఉంచే ఇనప్పెట్టె, బీరువాలు ఉండే ప్రాంతాలలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పులు ధరించి వెళ్లొద్దు. వంట గదిలోనూ ఆహారం తయారు చేసుకుంటాం పైగా నిప్పును మనం పవిత్రంగా భావిస్తాం కాబట్టి మనం కిచెన్ లోకి కూడా చెప్పులతో వెళ్ళరాదు. ఇక డబ్బులు, దానం, బంగారం అంటేనే సాక్షాత్తు లక్ష్మీ దేవితో సమానం కాబట్టి డబ్బు ఉంచే ప్లేసుల్లో చెప్పులతో తిరగరాదు. అయితే ఈ రోజుల్లో మనం శుభ్రం పేరుతోనో, నొప్పుల నుండి ఉపశమనం కోసమో ఇంట్లో కూడా ఒక సేపరేట్ జత చెప్పులేసుకుంటుంటాం, అయితే పైన చెప్పిన ప్లేసుల్లోకి మాత్రం చెప్పులేసుకుని వెళితే మనకే అశుభం అంటున్నారు పండితులు.

dont use chappals in this places

ఇక పుణ్య నదులైన గంగ, కృష్ణ, గోదావరి లను మనం పూజిస్తాం. పుష్కరాలు గట్రా చేసుకుంటాం కాబట్టి నదుల్లోకి చెప్పులతో ప్రవేశించరాదు. వినాయకుడు, దుర్గా ఇలా విగ్రహాలు ప్రతిష్టించి మనం వేడుకలు చేసే చోట్లకు కూడా చెప్పులు వేసుకెల్లకూడదు. అందుకే కాబోలు మన పూర్వీకులు అసలు దాదాపుగా పాదరక్షలు లేకుండానే జీవితం గడిపేవారు. ఏది ఏమైనా ఒక మంచి మాట, మంచి అలవాటు, మంచి ఆచారం మనకు, మన కుటుంబానికి, మన తోటివారికి కూడా మంచి చేస్తుంది అని తెలిసాకా పాటించడమే మేలు కదా. శుభస్య శీగ్రం…

(Visited 1,973 times, 131 visits today)