Home / Inspiring Stories / ఇక నుంచీ లైసెన్స్ లేకుంటే నేరుగా జైలుకే.

ఇక నుంచీ లైసెన్స్ లేకుంటే నేరుగా జైలుకే.

Author:

traffic-police-hyderabad

మహానగరం నుంచి విశ్వనగరంగా రూపుదిద్దుకోనున్న హైదరాబాద్ లో వాహనాల సంఖ్య అరకోటికి చేరింది.మొత్తం 50 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం నగరంలో 20 లక్షల వాహనదారులకు లైసెన్సులు లేవని, 10 లక్షల మంది తమ వాహనాలను రిజిసే్ట్రషన్‌ చేయించుకోలేదట. వాహనం నడపటానికి కనీస వయస్సు రాని పాఠశాల స్థాయి పిల్లలూ వాహనాలతో రోడ్లపై కనిపిసున్నారు. ఇక ఇంజనీరింగ్‌, ఫార్మసీ, మెడికల్‌ కళాశాలన్నీ నగర శివారు ప్రాంతాల్లోనే ఉన్నాయి. అక్కడ నుంచి రాకపోకలు సాగించేందుకు విద్యార్థులు బైక్‌లకే ప్రాధాన్యమిస్తున్నారు. అయితే ఈ యువకులంతా మితిమీరిన వేగం తో వాహనాలు నడుపుతూ తరచూ ప్రమాదాల బారినపడుతున్నారు. వీరిలో దాదాపుగా ఎవరికీ లైసెన్సు లు లేవు. ఇక ముందు ఇటువంటి వాహనాలు పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే నడిపిన వారినే కాదు ఆ వాహనం ఎవరి పేరు మీద ఉందో వారికి కూడా బాధ్యులను చేయనున్నారు.అంటే మీరు మీ ఫ్రెండ్ బైక్ తీసుకొని ఎక్కడికైనా వెళ్తూ ప్రమాదానికి గురయ్యారనుకోండీ అప్పుడు కేసు మీ మీదే కాదు మీ బండి మీకిచ్చిన మీ స్నేహితుని మీద కూడా కేసు బుక్ అవుతుందన్న మాట…

అంతే కాదు డ్రైవింగ్‌ లెసెన్స్‌ లేకుండా వాహనం నడిపితే ఇక జరిమానాలు, ఈ-చలానాలు గట్రా ఏమీవుండవు! మీరు అక్కన్నుంచి నేరుగా వెళ్ళేది జైలుకే!! అవును.. న్యాయస్థానం ఆదేశాల మేరకు నిబంధనల పరంగా ఇక నుంచీ అత్యంత కఠినంగా వ్యవహరించేందుకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ యంత్రాంగం సిద్దమైంది. ఈ మేరకు మార్చి ఒకటో తేదీ నుంచి తనిఖీలు నిర్వహించనున్నారు. లైసెన్సు లేదని గుర్తిస్తేగనక వెంటనే చార్జిషీటు దాఖలు చేస్తారు. తొలిసారి పట్టుబడితే ఒకరోజు జైలు, రెండోసారైతే రెండురోజులు, మూడోసారైతే వారం వరకు జైలుశిక్ష పడుతుందట. ఈ వివరాలను హైదరాబాద్ నగర ట్రాఫిక్‌ డీసీపీ రంగనాథ్‌ స్వయంగా తెలిపారు. వాహన రిజిసే్ట్రషన్‌లో ఉన్న వ్యక్తి పేరు మీదనే కేసులు ఉంటాయని, ఒకవేళ మీరు మీ వాహనాన్ని అమ్మేసినా ఓనర్‌షి్‌పను బదలాయించాలని ఒకవేళ బదలాయింపు జరగనట్టైతే వాహనం ఎవరి పేరు మీద ఉందో వారే బద్యులవాల్సి వసుందని తెలిపారు. తనిఖీల్లో పట్టుబడితే నిబంధనల ప్రకారం కేసు నమోదుచేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరుస్తామన్నారు.ఈ విశయాల్లో ఎటువంటి పలుకుబడులూ, పైరవీలు పనిచేయవని స్పష్టంచేశారు. ఇక బైక్‌ నడిపేవాళ్లకు హెల్మెట్‌ను తప్పనిసరి అయితే వెనుక కూర్చున్నవారికి మాత్రం హెల్మెట్ తప్పని సరి మాత్రం కాదు. హెల్మెట్‌ లేకుండా నడిపితే మొదటిసారి రూ.100, రెండోసారి రూ.200, మూడోసారి రూ.300 జరిమానా ఉంటుందట. హెల్మెట్ విషయంలో కాస్త బానే ఉంది గానీ లైసెన్స్ విషయంలో మాత్రం కాస్త తొందరగా జాగ్రత్త పడండి లేదంటే… ఒకటీ రెండూ మూడూ… అంటూ ఏడు ఊచలూ లెక్కపెట్టాల్సిందే..

(Visited 1,029 times, 23 visits today)