ద్వారక రివ్యూ & రేటింగ్.

dwaraka perfect review and rating

Alajadi Rating

2.75/5

Cast: విజయ్ దేవరకొండ, పూజా జవేరి, 30 ఇయర్స్ పృద్వీ, మురళీ శర్మ

Directed by: శ్రీనివాస్ రవీంద్ర

Produced by: చంద్రపతి, గణేష్

Banner: సూపర్ గుడ్ ఫిలింస్, లెజెండ్ సినిమా

Music Composed by: సాయి కార్తీక్

పెళ్లి చూపులు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా ద్వారక, పెళ్లి చూపులు సక్సెస్ తరువాత విజయ్ రేంజ్ కు తగ్గట్టుగా మార్పులు చేసి ఈ సినిమాను రిలీజ్ చేశారు, కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ రవీంద్ర దర్శకత్వం వహించిన ద్వారక ఎలా ఉందో మీరు తెలుసుకోండి..!

కథ:

స్నేహితులతో కలిసి చిల్లర దొంగతనాలు చేస్తూ లైఫ్ సెటిల్ అయ్యేలా ఒక పెద్ద దొంగతనం చెయ్యాలని ఆలోచిస్తుంటాడు ఎర్రశీను (విజయ్), ఆ ప్రయత్నంలోనే ఒక అపార్టుమెంట్ లో ఉన్న ఒక ఆశ్రమానికి చేరుతాడు, అక్కడ ఎర్రశీనుని కృష్ణానంద స్వామి అంటూ బాబాని చేసేస్తారు, ఎర్రశీను గురుంచి తెలుసుకున్న ఒక క్రిమినల్ లాయర్ కోట్లు సంపాదించేలా ప్లాన్ వేస్తాడు, అదే సమయంలో దొంగ బాబాల ఆటకట్టించే హేతువాది చైతన్య( మురళీ శర్మ) దృష్టి కృష్ణానంద స్వామి మీద పడుతుంది, ఎలాగైన కృష్ణనంద ముసుగు వెనక ఉన్న రహస్యం కనిపెట్టాలని ఆశ్రమంలో చేరుతాడు. మరి అనుకున్నట్టుగా చైతన్య కృష్ణానంద గుట్టు బయటపెట్టాడా..? ఎర్ర శీను తనను బెదిరిస్తున్న లాయర్ నుంచి ఎలా బయట పడ్డాడు..? ఎర్ర శీనుకి వసుధ (పూజ జవేరి) అనే అమ్మాయికి మధ్యలో సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ.

అలజడి విశ్లేషణ:

పెళ్లి చూపులు సినిమాలో తన టాలెంట్ తో అందరి చేత ప్రశంసలు పొందిన విజయ్ దేవరకొండ ఈ సినిమాలో కూడా తన టాలెంట్ తో అదరగొట్టాడు, సినిమా స్టోరీ మరి కొత్తది ఏం కాకపోయినా మంచి స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులుకి బోర్ కొట్టకుండా సినిమాని తెరకెక్కించారు, ముఖ్యంగా విజయ్ దేవరకొండ బాబాగా మారిపోయిన తరువాత వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులని ఆహ్లాదపరుస్తాయి.

మూఢ నమ్మకాలతో ప్రజలని మోసం చేస్తున్న దొంగబాబాల చుట్టూ అల్లుకున్న కథ చాలా బాగుంది, కానీ ఆ కథని చెప్పడంలో డైరెక్టర్ పూర్తిగా సక్సెస్ కాలేదు, ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ సన్నివేశాలతో నడిపించిన, సెకండ్ హాఫ్ లో ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అవుతారు, ఇంటర్వెల్ ట్విస్ట్ కొంచెం అలరిస్తుంది, అక్కడక్కడా కామెడీ సన్నివేశాలతో ఆకట్టుకున్న మొత్తంగా పరవాలేదు అనేలా అనిపిస్తుంది సినిమా.

ప్లస్ పాయింట్స్:

  • స్క్రీన్ ప్లే
  • విజయ్ దేవరకొండ, మురళి శర్మ
  • ప్రీ క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

  • స్లో నరేషన్
  • కొన్ని కామెడీ సన్నివేశాలు.

పంచ్ లైన్: రోటీన్ కథకి, మంచి కథకి తేడా తెలుసుకున్నోడే నిలిచిపోతాడు..!

(Visited 1,603 times, 51 visits today)

Comments

comments