EDITION English తెలుగు
Home / health / హార్ట్ ఎటాక్ కి ముందు కనిపించే లక్షణాలు తెలుసుకోండి..!

హార్ట్ ఎటాక్ కి ముందు కనిపించే లక్షణాలు తెలుసుకోండి..!

Author:

హార్ట్ ఎటాక్.. ఈ మాట వింటేనే గుండె నొప్పి వచ్చినంత పనవుతుంది. అయితే ఈ మధ్య గుండె సంబంధిత జబ్బులు, గుండె నొప్పులు ఎక్కువగా అటాక్ చేస్తున్న విషయం విదితమే. ఒక‌ప్పుడు ఎక్కువగా వృద్దుల్లో మాత్రమే క‌నిపించే గుండె జ‌బ్బులు, హార్ట్ ఎటాక్ లు ఇప్పుడు యంగ్ ఏజ్ వారినీ ఎటాక్ చేస్తున్నాయి. ఒక్కోసారి ఇంత చిన్న వయసులో పాపం గుండె నొప్పి వచ్చిందట అని బాధపడుతుండటం గమనిస్తూనే ఉన్నాం.

చూడడానికి గుప్పెడంతే ఉంటుంది కానీ మనిషి ప్రాణానికే ఆయువు పట్టు గుండె. అయితే ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఉద్యోగం, సంపాదన, పెళ్ళాం పిల్లలు, వారి భవిష్యత్తు అనే ఒక నిర్దిష్ట లక్షాల వెనక పరిగెడుతూ ఆరోగ్యాన్ని లెక్కచేయట్లేదు. సింపుల్ గా చెప్పాలంటే జేబులు నింపుకునే ప్రయత్నంలో ఆ జేబు వెనకాలే ఉన్న చిన్ని గుండెని నిర్లక్ష్యం చేస్తున్నారు. కార‌ణాలు ఏవైనా ఇవాల్టి రోజుల్లో గుండె నొప్పి భాదితులు ఎక్కువయ్యారు. అయితే ఈ గుండె నొప్పి వచ్చినప్పటికన్నా దాని గురించి సరైన అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వ‌ల్లే ఎక్కువ నష్టం జరిగిపోతుంది అంటున్నారు డాక్టర్లు. నిజానికి హార్ట్ ఎటాక్ మొద‌టిసారి వ‌చ్చిన‌ప్పుడే జ‌ర‌గాల్సిన న‌ష్టం అంతా జ‌రిగిపోతోంది. అందుకే హార్ట్ ఎటాక్ వ‌చ్చే ముందు ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరికీ ఉండంటున్నారు వైద్య నిపుణులు. గుండె నొప్పి గురించి అవగాహన కలిగి ఉండటం వ‌ల్ల మన ప్రాణాల‌ను కాపాడుకోవడమే కాదు మన మీద ఆధారపడినవారికీ ఒక భరోసా కల్పించే అవకాశమూ ఉంటుంది. హార్ట్ ఎటాక్ కు నెల రోజుల ముందే కనిపించే కొన్నిలక్షణాలు తెలుసుకుంటే మన ప్రాణాలు కాపాడుకోవచ్చు..మరి ఆ లక్షణాలేంటో తెలుసుకుందామా ..

హార్ట్ ఎటాక్ లక్షణాలు.

నోట్ : ఈ క్రింది ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఆలోచించ‌కుండా వెంటనే డాక్టర్ని సంప్ర‌దించి త‌గిన చికిత్స చేయించుకోవాలి. నిర్లక్ష్యం చేసిన ప్రతీసారి మరణానికి ఒక్కోఅడుగు దగ్గర అవుతున్నట్టే అన్న విషయాన్ని గుర్తుంచుకోండి.

హార్ట్ ఎటాక్ వచ్చేముందు కనిపించే లక్షణాలు:

  • శ్వాస పీల్చుకోవ‌డంలో త‌ర‌చూ ఇబ్బందులు ఎదురైనా కూడా హార్ట్ ఎటాక్ ల‌క్ష‌ణంగా అనుమానించాలి.
  • ఛాతిలో అసౌక‌ర్యంగా ఉన్నా, ఛాతి మొత్తం బ‌రువుగా అనిపిస్తున్నా కూడా హార్ట్ ఎటాక్‌కు సూచ‌నే అని గుర్తుంచుకోవాలి
  • తల, మెడ నుంచి ఎడ‌మ చేతి కిందిగా నొప్పివ‌స్తుంటే హార్ట్ ఎటాక్ కు దారి తీసే అవకాశం ఉంది. ద‌వ‌డ‌ల్లో, గొంతులో నొప్పిఅనిపించినా నిర్లక్షం చేయరాదు.
  • జ‌లుబు, ఫ్లూ జ్వ‌రం త‌ర‌చుగా వ‌స్తున్నా, ఓ ప‌ట్టాన త‌గ్గ‌క పోయినా అనుమానించాల్సిందే. ఎందుకంటే అవి హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌న‌డానికి ముందస్తు ప్రమాద హెచ్చరికల్లాంటివి. జలుబు తో పాటూ ద‌గ్గు తగ్గకుండా ఎక్కువైతే హార్ట్ ఎటాక్‌కు సంకేతంగా అనుమానించాలి.
  • ఆహారం సరిగా జీర్ణ‌మ‌వ‌క‌ పోయినా, గ్యాస్‌, అసిడిటీ బాధలతో పాటూ క‌డుపు నొప్పి వంటివి త‌ర‌చూ వ‌స్తున్నా అశ్రద్ధ చేయకూడదు. ఇవన్నీ హార్ట్ ఎటాక్ వ‌చ్చేముందు ల‌క్ష‌ణాలే. చాలా మంది గుండె నొప్పి వచ్చినప్పుడు ఛాతీ నొప్పిగా పొరపడి నిర్లక్షం చేసి ప్రాణాలమీదకు తెచ్చుకున్నారనేది వైద్యుల పరిశోదనలో తేలింది.
  • ఎక్కువగా పని చేయకుండానే విప‌రీతంగా అల‌సిపోవ‌డంతో పాటూ ఒళ్లంతా ఒకటే నొప్పులుగా అనిపిoచినా గుండె నొప్పి రాబోతుoది అనడానికి సూచనే.
  • ఎప్పుడూ మగతగా అనిపించినా, మ‌త్తుగా నిద్ర వ‌చ్చిన‌ట్టు ఉంటున్నా, ఒళ్ళంతా చెమ‌ట‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నా.. అవి గుండె నొప్పి ల‌క్ష‌ణాలు అయ్యే అవ‌కాశం ఉంది.
  • కంటి చివ‌ర ఏవైనా కురుపుల వంటివి కనిపించినా గుండె నొప్పి ల‌క్ష‌ణాలుగా పరిగణించాలి.
  • కాళ్లు, పాదాలు, మ‌డిమ‌లు ఉబ్బిపోతున్నా హార్ట్ ఎటాక్‌కు ముందస్తు సూచ‌నే.
  • హార్ట్ బీట్‌ లో తీవ్రమైన మార్పు కనబడ్డా జాగ్రత్త పడాలి. గుండెకి సంబంధించిన ఏ స‌మ‌స్య‌ ఉన్నా గుండె కొట్టుకోవ‌డంలో మార్పు స్పష్టంగా కనబడుతుంది. హార్ట్ బీట్ తేడా అనిపిస్తే కూడా వెంట‌నే వైద్యున్ని సంప్ర‌దించాలి.

ఈ 10 లక్షణాల్లో ఏ ఒక్కటి కనబడినా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది. అయితే ఎలాంటి కంగారు పడకుండా కూల్ గా ఈ లక్షణాలు అనిపిస్తే దగ్గరలోని వైద్యున్ని సంప్రదించి అనుమానాలు పటాపంచలు చేస్కోవడం మంచిది. ఎందుకంటే ఎన్ని కోట్లు పెట్టినా ఆరోగ్యాన్ని కొనుక్కోలేము. ఆరోగ్యమే మహాభాగ్యం కదా.

(Visited 1,754 times, 258 visits today)