ఇక వాట్సాప్ లో డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు.

Author:

ప్రప్రంచంలోనే ఎక్కువ మంది ఉపయోగిస్తున్న సోషల్ మీడియా యాప్ గా రికార్డు సృష్టించిన వాట్సాప్.. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటూనే ఉంది, ఇప్పటివరకు కేవలం మెస్సేజింగ్ యాప్ గానే ఉన్న వాట్సాప్ కొత్త వాట్సాప్ బిజినెస్ యాప్ ని విడుదల చేసింది, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలకి, చిన్న చిన్న స్టార్ట్అప్ కంపెనీలకి ఉపయోగపడేలా ఈ వాట్సాప్ బిజినెస్ యాప్ ని మార్కెట్ లోకి ప్రవేశపెట్టారు.

వాట్సాప్ బిజినెస్ యాప్‌లో మాములుగా వాట్సాప్ యాప్‌లో ఉండే అన్ని ఫీచర్లు ఉన్నాయి. ఈ బిజినెస్ యాప్ లో వ్యాపారులు తమ బిజినెస్ కి సంబంధించిన ప్రొఫైల్స్‌ను పెట్టుకోవచ్చు. తమ వ్యాపారం, ప్రొడక్ట్స్ గురించిన సమాచారం, ఈ-మెయిల్ అడ్రస్‌లు, ఫోన్ నెంబర్ లు, స్టోర్ అడ్రస్, వెబ్‌సైట్ వివరాలను, రేట్లు అందరికి కనిపించేలా పెట్టుకోవచ్చు. కస్టమర్లకు మెసేజ్‌ లు, వారికి గ్రీటింగ్స్, ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్ సందేశాలు పంపవచ్చు. కస్టమర్లు అడిగే ప్రశ్నలకు రిప్లై ఇవ్వవచ్చు. కస్టమర్ లతో వాట్సాప్ కాల్ కూడా మాట్లాడవచ్చు, కస్టమర్లకి ప్రొడక్ట్స్ ఫోటోలు పంపి వాట్సాప్ ద్వారానే ఆర్డర్ తీసుకోని త్వరలో రాబోతున్న Whatsapp Pay పేమెంట్ సిస్టమ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు.

వాట్సాప్ బిజినెస్ యాప్

ఈ వాట్సాప్ బిజినెస్ యాప్ చిన్న చిన్న వ్యాపార సంస్థలకి ఎంతగానే ఉపయోగపడుతుంది, ముఖ్యంగా హోటల్స్, సూపర్ మర్కెట్స్, బట్టల షాపుల వాళ్ళు ఈ వాట్సాప్ బిజినెస్ యాప్ ద్వారా కస్టమర్లని సులభంగా ఆకట్టుకోవచ్చు, ప్రస్తుతం ఈ వాట్సాప్ బిజినెస్ యాప్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై గూగుల్ ప్లే స్టోర్‌లో లభిస్తున్నది. త్వరలోనే ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై దీన్ని లాంచ్ చేయనున్నారు. ప్రస్తుతం ఇండోనేషియా, ఇటలీ, మెక్సికో, యూకే, యూఎస్ దేశాల్లో ఈ యాప్ లభిస్తుండగా, త్వరలో భారత్‌లోనూ వాట్సాప్ బిజినెస్ యాప్ వ్యాపారులకు అందుబాటులోకి రానుంది.

Also Read: అమ్మాయి ప్రాణాలు తీసిన వాట్సాప్ మెసేజ్..!

(Visited 1,304 times, 1,324 visits today)

Comments

comments