Home / Inspiring Stories / కావలసిందేదైనా మనముందుంచే టాస్క్ మిత్రా

కావలసిందేదైనా మనముందుంచే టాస్క్ మిత్రా

Author:

TaskMitra

మనమొక వస్తువు కొనాలనుకుంటే అదెక్కడ దోరుకుందీ అని వెతికే కస్టమర్ ఆవస్తువుని అమ్మే కంపెనీ రెండూ ఒకే చోట ఉంతే? ఒక సర్వీస్ కోసం ఎదురుయ్ చూసే కస్టమర్ కోసం ఆ స‌ర్వీసులు అందించే సంస్థలు కానీ.. ఫ్రీలాన్సర్లు కానీ కస్టమ‌ర్ల కోసం ఎలాగూ ఎద‌రుచూస్తుంటారు. ఇద్దరినీ ఒకే చోట క‌లిపేస్తే? అద్బుతమైన ఆలోచన కదా..! సరిగ్గా ఇదే కాన్సెప్త్ తో ఒక వెబ్‌సైట్ ఉంటే అన్న ఆలోచననే ఆచరణలో పెట్తేసారు కొందరు యువతీ యువకులు. ఇంతకీ ఆ కాన్సెప్ట్ ఏమిటీ అంటే…

ఇదే టాస్క్ మిత్ర కాన్సెప్ట్‌! మార్చి 2015 లో మొదలయిన ఈ కంపెనీ దగ్గర్లో అన్ని స‌ర్వీసులు ఎవ‌రెవ‌రు అందిస్తున్నారో లిస్ట్ అవుట్ చేస్తుంది. ఆవ‌కాయ పచ్చడి నుంచి ఆడీ కారు దాకా! ఏయే వ‌స్తువు ద‌గ్గర్లో ఎవ‌రెవ‌రు అమ్ముతున్నారో ఈజీగా ఇన్ఫర్మేష‌న్ ఇక్కడ దొరుకుతుంది. బిజినెస్ టు బిజినెస్‌, క‌స్టమ‌ర్ టు క‌స్టమ‌ర్‌, బిజినెస్ టు క‌స్టమ‌ర్‌. ఇలా అంద‌రినీ ఒకేగొడుగు కిందకి తీసుకువ‌చ్చేలా దీన్ని డిజైన్ చేశారు. ఒక అవ‌స‌రాన్ని పోస్ట్ చేయ‌డం, దాన్ని అది చేయ‌గ‌లిగిన వాళ్లు కాంటాక్ట్ చేయ‌డం. క‌స్టమ‌ర్ అవ‌స‌రాన్ని తీర్చడ‌మ‌నే మూడు కాన్సెప్టుల మీద‌నే టాస్క్ మిత్ర ప‌నిచేస్తుందంటారు ఆ కంపెనీ సీటీవో గౌత‌మ్.

భార‌త‌దేశంలో లోక‌ల్‌గా ఇలాంటి స‌ర్వీసులు అందిచే మార్కెట్ విలువ దాదాపుగా రూ.3,31,400 కోట్లు ఉంటుంది. అది కొన్నాళ్ళుగా ప్రతీ సంవత్సం ఎంతోకొంత పెరుగుతూనే ఉంది. అర్బన్ క్లాప్‌, డోర్‌మింట్‌, టైమ్ సేవ‌ర్స్‌, మిస్టర్ రైట్‌, టాస్క్ బాబ్‌, జెప్పర్ లాంటి సంస్థలు ఈపాటికే మార్కెట్లో నిలదొక్కుకొని వేలకొటల లాభాలపై కన్నేసాయి. ఇక జ‌స్ట్ డయల్‌, సులేఖ, యెల్లో పేజెస్ లాంటివి ఆన్‌లైన్‌లో స‌ర్వీస్ లిస్టింగ్ అందిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో డోర్‌మింట్ సంస్థలో హీలియ‌న్ వెంచ‌ర్స్‌, ఓరియోస్ వెంచ‌ర్స్ క‌లిసి దాదాపు 20 కోట్ల రూపాయ‌ల‌ పెట్టుబ‌డి పెట్టాయి. అలాగే అర్బన్ క్లాప్ సంస్థలో కూడా ఐడీజీ వెంచ‌ర్స్‌, ఓమ్‌డియార్ నెట్‌వ‌ర్క్స్‌ 13.5 కోట్ల రూపాయ‌ల‌ డాల‌ర్ల పెట్టుబడులు పెట్టాయి.ఇక కస్టమర్ ని అందిపుచ్చుకునే కంపెనీలకీ తమకి కావలసిన దాన్ని సులభంగా అందుకోవటం జనాలకీ ఇప్పూదు ఈ కంపెనీలు ఒక చక్కని పరిష్కారం.

టాస్క్ మిత్ర అనేది ఎలా పుట్టిందో అని తెలిస్తే వింతగానే అనిపిస్తుంది.ఈ ఆలోచనకి వేదిక ఒక న్యూయియర్ పార్టీ అని చెప్పుకుంటే కాస్త ఆశ్చర్యమే అనిపించక మానదు. న్యూ ఇయ‌ర్ పార్టీలో ఆ చర్చ వాళ్ల జీవితాలనే మారుస్తుందని ఆ స్నేహితులు ఊహించి ఉండరు. ఎలా? అన్న ప్రశ్నతో మొదలుపెట్టి కంపెనీ ఏర్పాటు అన్న దగ్గర ముగించారు. ఏది కావాలి? ఎంత‌లో కావాలి? ఎలా కావాలి? సాధారణంగా వీటన్నిటికీ ఒకే ఆన్సర్ ఇంటిగ్రేడెట్‌గా దొరకడం కష్టం. అయితే అలాంటి సమాధానం మనమే ఇస్తే ఎలా వుంటుంది? అదిగో! సరిగ్గా అదే పాయింట్ మీదే పుట్టింది- టాస్క్ మిత్ర అనే ఐడియా. ఇకనేం మీరూ స్మార్ట్ సేవలకోసం టాస్క్ మిత్రాని ఫాలో ఐపోండి మరి.

(Visited 51 times, 10 visits today)