బ్రెడ్ తింటే కాన్సర్ !?

Author:

పొద్దున లేవగానే చాలా మందికి బ్రెడ్ తినడం అలావాటు ఇప్పుడు అలాంటి వారికి పిడుగులాంటి వార్త. బ్రెడ్ తింటే కాన్సర్ వస్తుందని సైంటిస్టులు అంటున్నారు. ఈ విషంయం చెప్పింది ఎవరో కాదు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వినార్ మెంట్ వారు.

eating-bread-may-cause-cancer

మన దేశంలో తయారు చేసే బ్రెడ్ లో ఎక్కువగా పొటాషియం బ్రొమేట్, పొటాషియం ఐయోడేట్ కెమికల్స్ ఉపయోగిస్తున్నాయని తేలింది. వీటి వలన కాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 38 బ్రాండ్లను పరిశీలించగా 84 శాతం బ్రెడ్, బన్, బర్గర్, పిజ్జాల తయారీలో ప్రమాదకరమైన పొటాషియం బ్రొమేట్, పొటాషియం ఐడేట్ వాడుతున్నారని తేలింది. బ్రెడ్, బేకరీ ఐటెమ్స్ మెత్తగా ఉండటం కోసం వీటిని వాడుతున్నారట. దీని కారణంగా కిడ్నీలో ట్యూమర్లు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రిటానియా, హార్వెస్ట్ గోల్డ్, కెఎఫ్‌సి, పిజ్జాహట్,డోమినోస్, మెక్ డోనాల్డ్ వంటి టాప్ మోస్ట్ కంపెనీల బ్రెడ్ శాంపిల్స్‌ను సిఎస్ఈ చెక్ చేసింది. సిఎస్‌ఈ రిపోర్ట్‌తో కలకలం రేగడంతో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసింది. దేశవ్యాప్తంగా బ్రెడ్, బన్, బర్గర్, పిజ్జాల తయారీ కేంద్రాలను వారు తనిఖీ చేయనున్నారు  మార్కెట్ లో ఎక్కువగా లభించే 38 రకాలు బ్రెడ్ లను ల్యాబ్ లో పరీక్షించగా 84 శాతం పాజిటివ్ రిజల్ట్స్ వచ్చిందని సైంటిస్టులు తెలిపారు. 1990 లోనే ఇంటర్నేషనల్ క్యాన్సర్ రీసెర్చ్ ఏజెన్సీ పొటాషియం బ్రొమెట్ ను క్యాన్సర్ కారకంగా గుర్తించిందని ,ఈ కెమికల్స్ ను ఇప్పటికే చాలా దేశాల్లో నిషేదించారంటున్నారు సైంటిస్టులు.

(Visited 1,664 times, 109 visits today)