ఈ బాలుడు హనుమంతుడి అవతారమా ?

Author:

పంజాబ్‌ చుట్టుపక్కల అంతటా ఇప్పుడు ఒక్కటే వార్త. వాయుపుత్ర హనుమంతుడి ప్రతిరూపంలో ఒక బాలుడు జన్మించాడని. ఇంకేముంది, జనాలు వందల, వేల కిలోమీటర్ల దూరం నుంచి కూడా వచ్చి మరీ… ఈ బాల హనుమంతుడిని దర్శించుకొని ఆశీర్వాదం తీస్కోని మరీ వెళ్తున్నారు. అసలెందుకీ పూజలు పునస్కారాలు అనుకుంటున్నారా… ? దీనంతటికీ కారణం ఒక్కటే. ఈ బాలుడికి ఒక విషయం లో అచ్చు గుద్దినట్టు హనుమంతుడి పోలిక రావడమే.

Eight-year-old hairy Indian boy

అమృత్‌సర్‌లో నివసించే దుల్హా సింగ్‌ అనే ఎనిమిదేళ్ల బాలుడికి వీపు కింది భాగంలో చిన్న తోకలా వెంట్రుకలు ఏర్పడ్డాయి. అయితే అది అచ్చం హనుమంతుడి తోకలా ఉండడంతో ఈ బాలున్ని ప్రజలంతా దైవ స్వరూపంగా భావించడం మొదలుపెట్టారు. దేవుడి అనుగ్రహంతోనే తోక ఏర్పడిందని, చుట్టుపక్కల వారు ఆ బాలుడికి పూజలు చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు ఆ తోకను కత్తిరించే ప్రయత్నం చేసిన దుల్హా తల్లి హఠాత్తుగా మరణించడంతో జనాల్లో ఆ తోక మహిమాన్వితమనే భావన మరింత పెరిగింది. ఈ సంఘటన తరువాత ఈ బాలున్ని హనుమంతుడి ప్రతిరూపంగా, దైవంగా భావించి పూజించే వారి సంఖ్యా బాగా పెరిగిందని సాహిబ్ సింగ్ చెప్పారు. తల్లి మరణించడం తో, ప్రస్తుతం దుల్హా సింగ్‌ మామ అయిన సాహిబ్‌ సింగ్‌ అతని ఆలనా పాలనా చూస్తున్నారు. అయితే దుల్హాను చూడటానికి వస్తే ఇబ్బందేంలేదు గానీ, పూజించడం లాంటివి చేయొద్దని ఎంత చెప్పినా జనాలు వినిపించుకోవడం లేదన్నది సాహిబ్‌ సింగ్‌ ఆవేదన వక్తం చేస్తున్నాడు.

జనాలు, పూజలు ఇవేమీ పట్టని వయసులో ఉన్న దుల్హాని ఇదే విషయమై ప్రశ్నిస్తే, ఈ తోక వల్ల తనకెలాంటి ఇబ్బంది లేదని, పైగా తోక వల్లే తనకో ప్రత్యేకత అంటున్నాడు దుల్హా సింగ్‌. తోక వల్లే తనని అందరూ గౌరవిస్తున్నారని కాబట్టి దీన్ని దేవుడిచ్చిన బహుమతి గా భావిస్తాన౦టున్నాడు. కానీ ఈ జనమంతా వచ్చి తనకు ప్రత్యేకంగా పూజలు చేయడం మాత్రం తనకు అర్థం కావడం లేదని చెబుతున్నాడు. కొంత మంది తనను తోక వల్ల ఎగతాళి చేస్తారని, కానీ నేనేమీ పట్టించుకోనని అంటున్నాడు ఈ హనుమ బాలుడు.

(Visited 223 times, 58 visits today)