EDITION English తెలుగు
Home / Reviews / ఎక్కడికి పోతావు చిన్నవాడా రివ్యూ & రేటింగ్.

ఎక్కడికి పోతావు చిన్నవాడా రివ్యూ & రేటింగ్.

Author:

స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య లాంటి ప్రయోగాత్మకమైన సినిమాలతో మెప్పించి మధ్యలో రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా శంకరాభరణం సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచాడు. మళ్ళీ తనకు అచ్చోచ్చిన ప్రయోగాత్మకమైన సినిమా వైపే మొగ్గు చూపి ఎక్కడికి పోతావు చిన్నవాడా అంటూ మన ముందుకు వస్తున్నాడు.

ekkadiki-pothavu-chinnavada-movie-pergectrat-review-and-rating

కథ:

ఇంజనీర్ స్టూడెంట్ అయిన అర్జున్( నిఖిల్) తన లవర్ నీ పెళ్లిచేసుకునేందుకు రిజిష్టర్ ఆఫీస్ కు వెళ్తాడు. అక్కడ ఎంత సమయం ఉన్న ఆమె రాదు దానితో అమ్మాయి చేతిలో మోసపోయాను అనుకోని ఇక అమ్మాయిలను నమ్మకూడదు అని డిసైడ్ అవుతాడు. జీవితంలో ఎదో ఒకటి సాధించాలి అని కష్టపడి గ్రాఫిక్స్ డిజైనర్ గా సెట్ అయి బాహుబలి 2 సినిమాకి గ్రాఫిక్స్ అందించే స్థాయికి ఎదుగుతాడు. ఆ టైం లోని తన స్నేహితుడు అయిన కిశోర్ ( వెన్నెల కిశోర్) పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. కిశోర్ వైద్యం కోసం కేరళలోని మహిషాసుర మర్థిని ఆలయానికి తీసుకెళతాడు. అక్కడ నిత్యా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. హైదరాబాద్ కి తిరిగొచ్చాక తానూ ప్రేమించింది నిత్యను కాదని అమల అనే ఆత్మని అని తెలిసి షాక్ అవుతాడు. అర్జున్ ఆలా షాక్ లో ఉండగానే అమల అనే ఆత్మ తనని వెతుక్కుంటూ వస్తుంది. అమల ఆత్మగా ఎందుకు మారింది?. అర్జునుని ఎందుకు వెతుక్కుంటూ వచ్చింది? అసలు అర్జున్ ఎవరిని ప్రేమించాడు తెలియాలి అంటే సినిమాని చూడవలసిందే..

అలజడి విశ్లేషణ :

ఈ సినిమాను మొదటి నుండి ఇది ఆత్మల చుట్టూ తిరిగే కథగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు చిత్ర టీం. దానికి తగినట్టుగానే ఈ సినిమాని ఐవి ఆనంద్ ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ ను జోడించి మంచి కథగా మలిచాడు. ప్రతి సన్నివేశాన్ని కథనంలో ఉండే విధంగా చూసుకున్నాడు. ఫస్టాఫ్ ఓపెనింగ్ ఒక ఆసక్తికరమైన సన్నివేశంతో మొదలుపెట్టి సినిమాని మొదట్లోనే ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తిని కలిగించాడు. ఇక ఇంటర్ వెల్ అయితే నెక్స్ట్ ఎదో జరుగుతుంది అనే ఆసక్తిని కలిగించాడు. సెకండాఫ్ లో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళాడు. సెకండాఫ్ లో కథనాన్ని నడిపిన తీరు చాలా బాగుంటుంది. ప్రతి సన్నీవేశాన్ని థ్రిల్ కలిగించేలా వుంటుంది.

మొదటి సన్నివేశం అయిపోగానే మాములుగా కథ నడుస్తుంటుంది అలా ఇంటర్ వెల్ వరకు సాధారణ కథనే నడుస్తుంటుంది. ఈ మధ్యలో వెన్నెల కిశోర్ కామెడీ తప్ప మరొకటి ఉండదు అనే చెప్పాలి. ఇక్కడ దర్శకుడు కొద్దిగా రన్ టైం నీ టైట్ చేస్తే సినిమా మరింత ఆసక్తి కరంగా ఉండేది.అలాగే సెకండాఫ్ లో కథ బాగున్నా కథనం కొద్దిగా లోపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్ రొటీన్ గా చూపించాడు దర్శకుడు. సెకండాఫ్ నడుస్తున్న కొద్దీ క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది అనుకుంటారు కానీ చివరిలో మనకు తెలిసిన విధంగా ముగించాడు.

నటీనటుల పనితీరు:

నిఖిల్ : రొటీన్ కి బిన్నంగా కథలను ఎంచుకునే నిఖిల్ మరో సారి అలాంటి కథనే ఎంచుకొని సక్సస్ సాధించాడు అనే చెప్పాలి. తన నటనలో కాలేజ్ స్టూడెంటా గా, కెరీర్లో సెట్ అయిన వ్యక్తిగా వేరియేషన్ చాలా బాగా చూపించాడు.

నందిత శ్వేత: తొలిసారిగా తెలుగుకు పరిచయం అయిన నందిత మంచి నటనతో కనబరిచింది. హర్రర్ సన్నివేశాలలో తన నటన అద్భుతం.

హేబ్బా పటేల్ మరోసారి తనకు అచ్చోచిన అల్లరి పిల్లగా పర్వాలేదు అనిపించింది. ఇక సినిమాలో అవికాఘోర్ పాత్ర చాలా బాగా హెల్ఫ్ అయింది అనిచెప్పాలి. వెన్నల కిశోర్ హీరో స్నేహితుడి పాత్రలో చాలా బాగా చేసాడు. పిచ్చి పట్టినట్టు నటిస్తూ చాలా బాగా అలరించాడు. సత్య, ప్రవీణ్,తనికెళ్ళ భరణి, వారి పరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం:

టైగర్ సినిమాతో దర్శకుడిగా మారి ఎవరు టచ్ చేయని కథతో సినిమాగా మలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు ఐవి ఆనంద్. ప్రస్తుతం హర్రర్ కామిడి సినిమాలు అలరిస్తున్న అలాంటి కథతో ఎక్కడ ఎలాంటి పొరపాటు చేయకుండా సినిమాని బాగా నడిపించాడు. ఇక ఈ సినిమాకి మేజర్ హైలెట్ సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అని చెప్పాలి. తన కెమెరా పనితనంతో అద్భుతంగా చేశాడు. శేఖర్ చంద్ర సంగీతం బాగుంది. ఆర్ ఆర్ తో సినిమాని మరో మెట్టు ఎక్కించాడు. ఎడిటింగ్ పర్వాలేదు, నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

  • నిఖిల్
  •  నందిత స్వేత
  • కామెడీ
  • స్క్రీన్ప్లే
  • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

  • ఫస్టాఫ్ స్లో నేరేషన్
  • క్లైమాక్స్

అలజడి రేటింగ్: 3.25/5

పంచ్ లైన్ : సస్పెన్స్ లతో, ట్విస్ట్ లతో థ్రిల్లింగ్ కి గురిచేస్తాడు ఈ చిన్నవాడు.

(Visited 2,119 times, 35 visits today)