Home / Inspiring Stories / ఈ మెయిల్ వెనక ఉన్నది భారతీయుడే అని తెలుసా.

ఈ మెయిల్ వెనక ఉన్నది భారతీయుడే అని తెలుసా.

Author:

E mail Creator

వి.ఎ. శివ అయ్యదురై ఈ పేరెపుడైనా విన్నారా..? పోనీ ఈ-మెయిల్..!? వినటమేమిటి రోజూ ఈ మెయిల్ మీదే కదా సగం పనులు నడిచేదీ అంటారా.. ఔనూ ఈమెయిల్ కీ ఈ శివ అయ్యదురై అనే వ్యక్తికీ సంబందం ఏమిటో ఎమైనా అర్థమైనట్టు అనిపిస్తోందా…? ఔను మీరూహించింది నిజమే ఈ మెయిల్ ని కనిపెట్టింది ఇతనే భారత దేశానికి చెందిన ఒక యువకుడుడు కాదు కాదు బాలుడు… ఔను ఈ మెయిల్ ని కనిపెట్టే టప్పటికి అయ్యదురై వయస్సు 14 సంవత్సరాలు. ఈమెయిల్‑ను తొలి సారిగా 32 ఏళ్లక్రితం కనుగొన్నారు. అమెరి ప్రభుత్వం కోసం 1982 ఆగస్టు 30వ తేదీన ఆయన తొలిసారి ఎలక్ట్రానిక్ మెయిలింగ్ సిస్ట అనే కంంప్యూటర్ ప్రోగ్రాం ను కనుగొన్నారు.

‘ఇంట్రా ఆఫీస్ మెసేజింగ్ సిస్టం’ ని కనుక్కున్నాడు,అదే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ మెయిల్ కి మూలం. ఇంట్ర ఆఫీస్ మేస్సజింగ్ సిస్టంలో ఇన్ బాక్స్ , అవుట్ బాక్స్ , ఫోల్డర్, మెమో మరియు అటాచ్మెంట్ లాంటి ఫీచర్స్ ఉండేవి. ఇంట్ర ఆఫీస్ మేస్సజింగ్ సిస్టం కోసం అయన 50000 లైన్ ల కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కోడ్ రాసాడట.

E mail creator 1

అప్పట్లో అమెరికాలోనే తన కుటుంబం స్థిరపడ్డంతో న్యూజెర్సీలోని లివింగ్టన్ హైస్కూల్లో చదువుకొంటున్నఅయ్యదురై..అక్కడి యూనివర్సిటీ అడ్మిషన్ కోసం ఈమెయిల్‑ను కనుగొనేందుకు పరిశోధనలు మొదలుపెట్టారు. వాస్తవానికి ఆయన 1978 లోనే కేవలం కార్యాలయంలోనే పంపుకొనే వీలున్న పూర్తిస్థాయి మెయిల్ వ్యవస్థను రూపొందించి, దానికి ‘ఈ–మెయిల్‘ అని పేరు పెట్టారు. అయితే 1982 లోదానికి కాపీరైట్ లభించింది. ఆ సమయంలో కాపీ రైటే పేటెంట్ హక్కుతో సమానం. సాఫ్ట్‑వేర్ ఆవిష్క రణలను రక్షించుకోడానికి అంతకంటే మార్గం ఉండేది కాదు. ఆయన చేసిన పరిశోధనలకు గాను 1981లో అయ్యదురైకి వెస్టింగ్‑హౌస్ సైస్ టాలెంట్ సెర్చ్ అవార్డు లభించింది. అన్ని విషయాల్లో ఆసియన్ల ఆధిక్యాన్ని ఒప్పుకోని యూరోపియన్ రాజకీయాల మూలంగా కంప్యూటర్ చరిత్రలో అయ్యదురై పేరు వెనుక పుటల్లోనే ఉండిపోయింది….

Must Read: ఒక్క మెసేజ్ తో రైలు భోగిని శుభ్రం చేయించుకోవచ్చు.

(Visited 6,151 times, 85 visits today)