అగ్గిపెట్టె తిరిగివ్వకపోతే చర్యలు తీసుకోబడును…!

Author:

ఎవరైనా అగ్గిపెట్టె అడిగితె ఇస్తాం… తిరిగి ఇస్తే తీసుకుంటాం..లేకపోతే లైట్ తీసుకుంటాం కానీ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇంజనీర్‌ లైట్‌ తీసుకోలేదు. తీసుకున్న అగ్గిపెట్టె తిరిగివ్వాలని ఏకంగా ఆఫీస్ స్టాంప్ తో లెటర్ రాశారు. అగ్గిపెట్టె తిరిగివ్వకుంటే చర్యలు తీసుకోబడునని కూడా ఆ లేఖలో పేర్కొన్నాడు. ఇప్పడు ఈ లెటర్‌ సోషల్‌ మీడియాలో వైరల్ గా మారి హల్ చల్ చేస్తుంది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరదాబాద్‌ ఎలక్ట్రిసిటీ అర్భన్‌ డివిజన్‌లో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సుశీల్‌ కుమార్‌ ఆఫీసులో ఓ ఉద్యోగికి అగ్గిపెట్టె ఇచ్చారు. ఆ వ్యక్తి అగ్గిపెట్టె తిరిగివ్వకపోవడంతో ఈ నెల 1న ఓ లేఖ రాశాడు. ” గత జనవరి 23న మీకు ఇచ్చిన అగ్గిపెట్టె తిరిగివ్వకపోవడం “ విషయంగా పేర్కొన్నారు. “ఆఫీస్‌లో దోమల రిఫిలెంట్‌ కాయిల్స్‌ కాల్చేందుకు అగ్గిపెట్టె తీసుకున్నారు. అందులో సుమారు 19 పుల్లలున్నాయి. అగ్గిపెట్టె తీసుకొని వారం గడుస్తున్న మీరు తిరిగివ్వలేదు. దీంతో ఆఫీస్‌లోని ఉద్యోగులకు ఇబ్బంది కలుగుతోంది. ముఖ్యంగా సాయంత్రం వేళలో వారు తెగ ఇబ్బంది పడుతున్నారు. ఈ లేఖ అందిన మూడు రోజుల్లోపు అగ్గిపెట్టెను తిరిగివ్వవలెను. ఒక వేళ ఇవ్వనిచో మీపై చర్యలు తీసుకోబడును” అని ఆఫీస్‌ అధికారిక స్టాంప్‌తో లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను యూపీ ఎస్పీ రాహుల్‌ శ్రీవాత్సవ్‌ ట్వీటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘అగ్గిపెట్టె తిరిగివ్వకుంటే చెప్పండి దర్యాప్తు చేస్తామని’ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.

అయితే సుశీల్‌ కుమార్‌ మాత్రం ఉద్యోగంలో కొత్తగా చేరిన కంప్యూటర్‌ ఆపరేటర్‌కు లెటర్‌ ఫార్మట్‌ తెలియడం కోసం అలా రాసానని తెలిపాడు. సదరు కంప్యూటర్‌ ఆపరేటర్‌ కూడా లెటర్ ఫార్మాట్ కోసం రాసారని పేర్కొన్నాడు. ఆ లెటర్ ఫోటోని తన మిత్రులకి పంపితే అది సోషల్ మీడియాలోకి వచ్చిందని తెలిపాడు.

(Visited 405 times, 428 visits today)