మాల్స్,హోటల్స్, థియేటర్స్ ప‌బ్లిక్ టాయిలెట్ల‌లో కింది భాగంలో ఖాళీగా ఎందుకు ఉంచుతారో తెలుసా..?

Author:

షాపింగ్ మాల్స్‌, సినిమా థియేటర్స్‌, రైల్వే స్టేష‌న్లు, బ‌స్టాండ్లు, ఎయిర్‌పోర్టులు.. ఇలా చాలా వ‌ర‌కు ప‌బ్లిక్ ప్లేసెస్‌లో టాయిలెట్లు ఉంటాయి క‌దా. వాటిలో వెస్ట‌ర్న్ టైప్‌లో ఉండే టాయిలెట్ల‌ను మీరు గ‌మ‌నించే ఉంటారు, అయితే వాటి వ‌ల్ల మ‌న‌కు ఒక విష‌యం తెలుస్తుంది. వాటికి డోర్స్ ఉంటాయి కానీ, కింది భాగంలో కొంచెం ఓపెన్ ఉంటుంది చూశారు క‌దా, ఆ.. అదే.. క‌రెక్టే.. చూశారు క‌దా. అయితే అస‌లు టాయిలెట్స్ కింది భాగంలో ఓపెన్ గా ఎందుకు ఉంటాయో తెలుసా..? అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి, అవి ఏంటంటే…!

ever-wondered-why-public-toilet-doors-have-some-space-in-the-bottom

1. ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా దేశాలలో ఇలాంటి వెస్ట‌ర్న్ త‌ర‌హా ప‌బ్లిక్ టాయిలెట్ల‌లో శృంగార‌ కార్య‌క‌లాపాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట,డోర్ పెద్దగా ఉండే వెస్టర్న్ టాయిలెట్లు క‌నిపిస్తే చాలు కొన్ని జంట‌లు రెచ్చిపోయి ప్ర‌వ‌ర్తిస్తాయ‌ట‌. అందుకనే అలాంటి వారిని క‌ట్ట‌డి చేసేందుకు, అలాంటి కార్య‌క‌లాపాలు జ‌ర‌గ‌కుండా చూసేందుకు ఆ టాయిలెట్ల కింది భాగంలో అలా ఖాళీ కొంచెం ఖాళీ ఉండేలా డిజైన్ చేసారు.

2. కేవ‌లం శృంగార కార్య‌క‌లాపాలే కాదు, ఈ త‌ర‌హా టాయిలెట్ల‌లో డ్ర‌గ్స్ తీసుకోవ‌డం, మ‌ద్యం సేవించ‌డం వంటి ప‌నులు కూడా చేస్తార‌ట‌. క‌నుక‌నే కింది భాగంలో ఆ టాయిలెట్ల‌ను ఓపెన్ ఉంచుతారు.

westren-toilet-doors

3. వెస్ట‌ర్న్ త‌ర‌హాలో ఉండే ప‌బ్లిక్ టాయిలెట్ల‌ను అలా కింది భాగంలో ఖాళీ ఉంచ‌డానికి గ‌ల మ‌రో కార‌ణం..చిన్న పిల్ల‌లు ఎవ‌రైనా అలాంటి టాయిలెట్ల‌లోకి వెళ్లిన‌ప్పుడు అనుకోకుండా లాక్ ప‌డితే వాళ్ల‌ను బ‌య‌ట‌కు తీయడం చాలా ఈజీ అయిపోతుంది. అందుక‌నే అలా ఖాళీ ఉంచుతారు.

4. కేవ‌లం పిల్ల‌లు మాత్ర‌మే కాదు ఒక‌వేళ పెద్ద‌లు ఎవ‌రైనా టాయిలెట్‌లో స్పృహ కోల్పోతే వారిని తీయ‌డం సుల‌భంగా ఉంటుంది. అందుకనే ఆ త‌ర‌హా టాయిలెట్ల‌కు కింది భాగంలో ఖాళీ ఉంచుతారు.

(Visited 2,510 times, 2,531 visits today)