Home / Latest Alajadi / డిసెంబర్ 1 వరకు టోల్ టాక్స్ రద్దు..!

డిసెంబర్ 1 వరకు టోల్ టాక్స్ రద్దు..!

Author:

పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకి ఎదురైనా చిల్లర కష్టాలు రెండు వారాలు అయిన తీరలేదు, నోట్లని రద్దు చేసిన వెంటనే 2000 నోటుని ప్రవేశపెట్టడంతో ఆ నోటుకి చిల్లర దొరకక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు, 3 రోజుల నుండి కొత్త 500 నోటు చలామణిలోకి వచ్చింది, 500 నోటు దేశంలో కొన్ని ప్రాంతాలలో మాత్రమే అందుబాటులోకి రావడంతో ప్రజల చిల్లర కష్టాలు తగ్గడానికి మరికొన్ని రోజులు పట్టె ఆవకాశం ఉంది.

toll-tax

పెట్రోల్ బంక్ లలో, ఆసుపత్రులలో, రైల్వే స్టేషన్ లలో, ఎయిర్ పోర్ట్, ఆర్టీసీ బస్సులలో ఈరోజు రాత్రి 12 గంటల తరువాత పాత నోట్లని తీసుకోరు, ఈ ప్రాంతాలలో పాత నోట్ల చెల్లుబాటు గడువుని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా పెంచే ఆవకాశం ఉంది, టోల్ టాక్స్ విషయంలో గడువుని డిసెంబర్ 1 వరకు గడువు పెంచారు, దేశంలో ఉన్న అన్ని టోల్ టాక్స్ కేంద్రాలలో డిసెంబర్ 1 వరకు టోల్ టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు.

(Visited 198 times, 6 visits today)