EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / Technology / కొత్త రూల్: ఫేస్ బుక్ వాడాలంటే..ఆధార్ లింక్ చేయాల్సిందే..!

కొత్త రూల్: ఫేస్ బుక్ వాడాలంటే..ఆధార్ లింక్ చేయాల్సిందే..!

Author:

ఆధార్ కార్డు వచ్చినప్పటి నుండి ప్రతి దానికి లింక్ చేయాల్సిందే అని ప్రభుత్వాలు ఆదేశాలు ఇస్తూనే ఉన్నాయి, బ్యాంకు అకౌంట్ – మొబైల్ నంబర్లు – పాన్ కార్డు… ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు దేశంలోని ప్రజలు ఆధార్ కార్డును చాలా సేవలకు లింక్ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. కొనసాగుతూనే ఉంది. కొన్ని రోజుల కిందనే ఆధార్ లింక్ చేయడంపై సుప్రీం కోర్టు గడువు కూడా విధించింది, అయితే ఇవే కాకుండా ఇకపై ఫేస్ బుక్ వాడాలన్నా ఆధార్ ఉండాల్సిందేనట. ఏంటీ షాకయ్యారా..? అయినా ఇది నిజమే.

ఫేస్ బుక్ వాడాలన్నా ఆధార్

ఫేస్ బుక్ అంటేనే అది సోషల్ మీడియాలో ఒక మహా ప్రపంచం. స్కూల్ పిల్లల నుండి 90 ఏళ్ళు పైబడిన వారు కూడా ఫేస్ బుక్ ని వాడుతున్నారు, మనదేశంలో దాదాపు 40 కోట్ల ఫేస్ బుక్ అకౌంట్ ఉన్నాయి, ఇందులో ఎంతో మంది తమ రియల్ పేర్లు కాకుండా నకిలీ పేర్లతో పుట్టలు పుట్టలుగా అకౌంట్లు ఓపెన్ చేస్తుంటారు. ఒక్క మన దేశంలోనే దాదాపుగా 6 కోట్ల నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు ఉన్నట్లు ఫేస్ బుక్ గుర్తించింది. ఫేక్ అకౌంట్ ల ద్వారా మోసాలు, విద్రోహ చర్యలు, రెచ్చగొట్టే విషయాలు ఎక్కువ అవుతుండటంతో ఫేస్ బుక్ అకౌంట్లను వాడేవారందరూ తమ తమ అసలైన పేర్లనే వాడేందుకు ఫేస్ బుక్ త్వరలో ఒక కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తేనుంది. దాని పేరే ”Name as per Aadhaar”. ఫేస్ బుక్ ప్రస్తుతం ఈ ఫీచర్ను అంతర్గతంగా టెస్ట్ చేస్తున్నది. ఇప్పటికే పలువురు ఎంపిక చేసిన యూజర్ల ద్వారా ఈ ఫీచర్ ను పరిశీలిస్తోంది. సదరు యూజర్లకు ఈ ఫీచర్ ప్రాంప్ట్ అవగానే వారు తమ ఆధార్ కార్డులో ఉన్న ఫస్ట్ నేమ్ – సర్ నేమ్ లను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఫీచర్ ఆప్షనల్ మాత్రమే. యూజర్లు కచ్చితంగా వివరాలను ఎంటర్ చేయాల్సిన పనిలేదు. తాము ఇప్పటికే కొనసాగిస్తున్న ఫేస్ బుక్ పేర్లను అలాగే వాడుకోవచ్చు. కాకపోతే రియల్ పేర్లను వాడేవారు ఈ ఫీచర్ ను ఉపయోగించుకోవచ్చు. దీంతో ఆధార్ లో ఉన్న పేరును ఫేస్ బుక్ లో వాడుకునేందుకు వీలుంటుంది.

అయితే ఫేస్ బుక్ తీసుకురానున్న ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఆధార్ కార్డులను ఫేస్ బుక్ అకౌంట్ కు లింక్ చేయాల్సిన పనిలేదు. కాకపోతే కార్డులో ఉన్న పేరును అకౌంట్ లో యాడ్ చేస్తే చాలు – మిగిలిన వివరాలను లింక్ చేయాల్సిన పనిలేదు. దీంతో యూజర్ల ఆధార్ సమాచారం ఫేస్ బుక్ కు చేరే అవకాశం ఉండదు. అలా ఆ సమాచారం భద్రంగా ఉంటుంది. దీనిపై ఆందోళన చెందాల్సిన పని ఉండదు. అయితే ఈ ఫీచర్ ను ఎప్పుడు అందుబాటులోకి తెస్తారు అన్న వివరాలను మాత్రం ఫేస్ బుక్ వెల్లడించలేదు. టెస్టింగ్ దశలో ఉన్నందున త్వరలో యూజర్లకు లభ్యమయ్యే అవకాశం ఉంది.

Comments

comments