EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / Political / వాట్సాప్ లో షేర్ చేసిన తప్పుడు సమాచారం వలన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

వాట్సాప్ లో షేర్ చేసిన తప్పుడు సమాచారం వలన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

Author:

స్మార్ట్ ఫోన్ వాడుతున్న అందరికి వాట్సాప్ సుపరిచితమే. వాట్సాప్ గ్రూపుల ద్వారా చిన్నప్పటి స్నేహితుల నుండి బంధువుల వరకు అందరితో టచ్ లో ఉండటం వీలవుతుంది. వాట్సాప్ గ్రూపులో ఇతరులు ఎదైన విషయాన్ని షేర్ చేస్తే అది చదివి నచ్చితే మనం కూడా ఇతర గ్రూపులలో షేర్ చేస్తాం. కాని కొంత మంది వైరల్ అవడం కొరకు ఎదో తప్పుడు సమాచారం షేర్ చేస్తున్నారు ఆ గ్రూపులోని ఇతర సభ్యులు కూడా అది నిజమా కాదా అలోచించకుండా షేర్ చేస్తుండడంతో ఏదీ నిజమో ఏదీ అబద్దమో నమ్మడం కష్టమవుతోంది. అలా వాట్సాప్ లో షేర్ అయిన తప్పుడు సమాచారం జార్ఖండ్ లో ఏడుగురి ప్రాణాలు తీసింది.

Fake whatsapp news took seven lives in jharkhand

గత వారం రోజులుగా జార్ఖండ్ రాష్ట్రంలో పలు గ్రామాల్లో పిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠాలు తిరుగుతున్నాయని వారు కనపడిన పిల్లల్ని ఎత్తుకుపోయి పిల్లల అవయవాలను అమ్మేస్తున్నారంటూ ఒక వార్త వాట్సప్ గ్రూపులలో విపరీతంగా షేర్ అయ్యింది. అందుకే అందరూ జగ్రత్తగా ఉండాలని అనుమానితులు కనపడితే వదలొద్దని అందరూ వాట్సప్ గ్రూపులలో షేర్ చేసారు. కొంతమంది అత్యుత్సాహంతో ఆ మెసేజ్ కి కొన్ని ఎవో ఫోటొలు జత చేసి వీరే అనుమానితులు అంటూ షేర్ చేసారు. ఈ మెసేజ్ ని సీరియస్ గా తీసుకున్న ప్రజలు తమ గ్రామాలలో అనుమానంగా తిర్గుతున్న వ్యక్తులను పట్టుకొని దాడి చేసి కొట్టి చంపేశారు. ఇప్పటివరకు నాగది గ్రామంలో ముగ్గురు, శోభాపూర్, సోసోమౌలీ అనే గ్రామాల్లో మరో నలుగురిని స్థానికులు చంపేశారు. ఈ ఘోరాలను అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులపైనా దాడి చేసారు స్థానికులు. ఈ కేసును విచారిస్తున్న పోలీసులకు నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. విచారణను ఎదుర్కొంటున్న గ్రామస్తులంతా తాము వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ చూసి వారిపై దాడికి పాల్పడ్డమని వాళ్లెవరో కూడా తమకు తెలియదని పోలీసులకు చెప్పటంలో వారు నివ్వెరపోయారు. ఇటువంటి తప్పుడు సమాచారం మొదటగా షేర్ చేసిన వారి కొసం జార్ఖండ్ పోలీసులు వేట ప్రారంభించారు. అందుకే వాట్సాప్ లో వచ్చే సమాచారంపై అప్రమత్తంగా ఉండి నిజమని నిర్దారించుకున్నాకే ఇతరులకు షేర్ చెయ్యడం ఉత్తమం.

Comments

comments