Home / Entertainment / అడవి పందులని హడలెత్తిస్తున్న హనీ సింగ్.

అడవి పందులని హడలెత్తిస్తున్న హనీ సింగ్.

Author:

Honey-Singh

అన్నాకే జైసే చష్మాలగాకే….కోకో నట్టు మే లస్సీ మిలాకే…., చార్ బాటిల్ ఓడ్కా కాం మేరా రోజ్ కా.. యో..యో హనీ సింగ్ పాటలతో ఉత్తరాఖండ్ పొలాలు హోరెత్తి పోతున్నాయ్. సాయంత్రం ఆరు గంటలకు మొదలయ్యే హనీసింగ్ పాటల హోరు పొద్దున్న ఆరుగంటల వరకూ సాగుతోంది. హనీ సింగ్ మానియాతో ఉత్తరా ఖండ్ పొలాలన్నీ ఊగిపోతున్నాయ్. అక్కడి నైనిటాల్ జిల్లాలోని రైతులంతా హనీ సింగ్ నామజపమే చేస్తున్నారట. హనీ సింగ్ పుణ్యమా అని తమ పంటలు పచ్చగా ఉంటున్నాయట. ఎలాంటి బాధలు లేకుండా పంట చేతికి వస్తోందంటా.హనీ సింగ్ అంటే అంతే మరి అయ్యనకి దేశమంతా అభిమానులున్నరు కదా… కానీ పంటల విశయమే అర్థం కావట్లేదు అనుకుంటున్నారా?

కొన్ని అటవీ ప్రాంత పొలాల్లో అడవి పందుల బెడద కాస్త ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాటికి మన రైతులు ఏ ఆడియో టేపులనో, లైట్స్ వేయడమో, లేదా రాత్రింబవళ్ళు అక్కడ కాపలా ఉండడమో చేస్తుంటారు.కరెంటు తీగలూ,బాంబులూ పెట్టటం వల్ల చాలా సార్లు గేదెలూ మనుషులూ చని పోతున్న సంఘటనలు ఆ ప్రాంతాల్లో సాధారణమే. ఐతే ఉత్తరాఖండ్ రైతులు దీనికో అద్బుతమైన పరిష్కారం కనుగొన్నారు. ఉత్తరాఖండ్ నైనిటాల్ పరిధిలో అడవిపందుల బెడద ఎక్కువగా ఉంది. వాటిని తరిమేయాలని రైతులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో అక్కడి రైతులు తమ పొలాల వద్ద లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసి భారీ శబ్దంతో యోయో హనీసింగ్ పాటలను ప్లే చేస్తున్నారు. ఆ దెబ్బకు అడవి పందుల బెడద చాలా వరకు తగ్గిందట. హనీసింగ్ పాటలు కాకుండా వేరే పాటలు పెట్టి చూడగా పెద్దగా ప్రభావం చూపలేదట, హనీ సింగ్ పాటల్లొ ఉండే డ్రంస్ శబ్దాలతో పాటు హనీ సింగ్ పాట కూడా అదవి పందులని ఆమడ దూరం లోనే ఆపేస్తోందట. ఐతే మొదట ఈ పద్దతిని మొదలు పెట్టింది మాత్రం బిషన్ అనే ఓ రైతు..

తమకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పందుల పీడను వదిలించుకోవడానికి రైతులు అన్ని ప్రయత్నాలు చేశారు. పొలం చుట్టు కంచె వేయించారు, చీరలు కట్టారు, పెద్ద శబ్దాలు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. కానీ ఏదీ సక్సెస్ కాలేదు. ఇలా ఉండగా, బిషన్ అనే ఓ రైతుకు ఒక ఐడియా వచ్చింది. వెంటనే పొలం చుట్టూ లౌడ్ స్పీకర్లు పెట్టించాడు. అందులో పాప్ సింగర్ హనీ సింగ్ పాడిన పాటలు ప్లే చేయడం ప్రారంభించాడు. మనుషుల శబ్దాలు వింటే అడవి పందులు అటు వైపు రావని అప్పుడెప్పుడో తన పెద్దలు చెప్పారని, ఆ విషయం గుర్తుకు వచ్చి ఇలా లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేశానని బిషన్ తెలిపాడు.ఐతే హనీ సింగ్ పాటల శబ్దాంకి పందులు ప్రాణభయం తో పరుగులు తీస్తున్నాయట. అన్నిటికంటే “లుంగి డాన్స్ పాట వినిపిస్తే చాలు పదుల భయం ఇంకా ఎక్కువవుతోందట”.. ఇప్పుడు బిషన్ నే ఫాలో ఐపోతూ ఆ ప్రాంత రైతులంతా హనీ సింగ్ పాటలు డౌన్లోడ్ కోసం ఎగబడుతున్నారు…

(Visited 322 times, 37 visits today)