EDITION English తెలుగు
డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.   జెడి (ఎస్) నాయకుడు హెచ్డి కుమారస్వామి కర్నాటకలో 24 వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

ఫ్యాష‌న్ డిజైన‌ర్ సన్నాఫ్ లేడీస్ టైల‌ర్‌ రివ్యూ & రేటింగ్.

Fashion Designer son of Ladies Tailor Movie Review

Alajadi Rating

2.5/5.0

Cast: సుమంత్ అశ్విన్‌, అనీషా ఆంబ్రోస్‌, మ‌నాలి రాథోడ్‌, మాన‌స హిమ‌వ‌ర్ష‌, కృష్ణ భ‌గ‌వాన్ త‌దిత‌రులు

Directed by: వ‌ంశీ

Produced by: మ‌ధుర శ్రీధ‌ర్‌రెడ్డి

Banner: మ‌ధుర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌

Music Composed by: మ‌ణిశ‌ర్మ‌

లేడీస్ టైలర్ ..ఈ పేరుకి తెలుగు రాష్ట్రాల్లో ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఒక రేంజు హిట్టు సినిమా. ఈ సినిమా పేరు వినగానే టక్కున గుర్తొచ్చేది.. డైరెక్టర్ వంశీ, హీరో రాజేంద్రప్రసాద్ లే కాదు. బట్టల సత్యం గా మల్లికార్జున రావ్. తనికెల్ల భరణి రచయితగా మాటలు రాసిన వంశీ మార్కు చిత్రమది. ఈ సినిమాలో మరో విశేషం జ భాష. జమ జచ్చ అని అప్పట్లో ఎంత పాపులరో చెప్పక్కర్లేదు. మరి ౩౦ ఏళ్ళ తర్వాత ఆ లేడిస్ టైలర్ కి సీక్వెల్ గా ఒక సినిమా రాబోతుందంటే ఎంత క్రేజుండాలో అంతకాన్నే ఎక్కువే ఉంది .ఎందుకంటే అదే డైరెక్టర్ వంశీ మళ్ళి తన స్టైల్ లో ఫ్యాష‌న్ డిజైన‌ర్ స‌న్నాఫ్ లేడీస్ టైల‌ర్‌ అనే పేరు తో.. ఈ సీక్వెల్ సినిమాకు ముహూర్తం పెట్టినప్పుడే క్రేజ్ మొదలైంది. ఎందుకంటే ఇవ్వాల్టికీ లేడిస్ టైలర్ సినిమా టీవీ లో వచ్చినా అందరూ టీవీ లకు అటుక్కుపోవాల్సిందే. మరి ఇవాళ రిలీజయిన ఈ సీక్వెల్ సినిమా ఎలా ఉంది? పాత లేడిస్ టైలర్ మార్కు కామెడి, థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ తో అంచనాలు అందుకుందా ?  గోదావరి అందాలతో పాటు వంశీ తన మార్కు కామెడి, మ్యూజిక్, పిక్చరైజేషన్  చూపించాడా లేదా చూద్దాం.

కథ:

లేడిస్ టైలర్ సుందరం కొడుకు గోపాళం(సుమంత్ అశ్విన్) కథ ఈ సినిమా. అచ్చం తండ్రి లాగే ఆడాళ్ళ డ్రెస్సులు కుట్టడం లో స్పెషలిస్టు. బట్టలు కుట్టడం లోనే కాదు, మిగతా ఆలోచనలు, ఆశలూ కూడా తండ్రిలాగే అచ్చు గుద్దినట్టు ఉంటాయి గోపాళంకు. ఇలా ఊళ్ళోనే బట్టలు కుడుతూ పొతే తండ్రిలా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అని ఫిక్సయిన గోపాలం ఎలాగైనా ఎదగాలనే ఆశతో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. నర్సాపురం లో ఓ షాపు పెట్టుకొని ఫేషన్ డిజైనర్ అన్పించుకోవాలన్నది తన ప్లాన్.కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కవుటు కాకపోవడం తో ఒక జ్యోతిష్కుడిని కలుస్తాడు.ఇక్కడే కథ టర్నవుతుంది. నీ చేతిలో మన్మథ రేఖ ఉంది.ఎలాంటి అమ్మయినా పడిపోవాల్సిందే అని జ్యోతిష్కుడు చెప్పడం తో ..బాగా డబ్బున్న అమ్మాయిని పడేసి అమాంతం ధనవంతుడ వ్వాలని ప్లాన్ వేస్తాడు. దాంతో ముందు ఊళ్ళో ఉన్న డబ్బున్న అమ్మాయి గేదెల రాణి (మానస హిమవర్శిని)ని లైన్లో పెడతాడు. ఇంతలో ఊరి పెద్ద గవర్రాజు మేనకోడలు అమ్ములు(మనాలి రాథోడ్) కనబడుతుంది. అంతే ఇంక అమ్ములుని ప్రేమలోకి దింపుతాడు. ఇంతలో అమెరికా నుంచి మహాలక్ష్మి(అనీషా అంబ్రోస్) ఊళ్లోకి దిగుతుంది. ఇలా డబ్బు ఎవరికీ ఎక్కువుందని తెలుస్తే వారి వెంట పడే ప్రయత్నంలో అసలెవరి మనసు దోచుకుంటాడు, ఎవరిని పెళ్ళాడుతాడు ? తనెవరిని మనస్పూర్తిగా ప్రేమిస్తాడు? తను అనుకున్నట్టుగా ఫేషన్ డిజైనర్ అవుతాడా ? అనేవి సినిమా థియేటర్ లోనే చూడాలి. ఈ ముగ్గురి ప్రేమ కథల మధ్య సడన్ గా గోపాళం మీద ఓ హత్యా నేరం మోపబడుతుంది. మరి నిజంగా హత్య చేసిందెవరు? గోపాలం బయట పడతాడా లేదా అనేది తెర పైన చూస్తేనే బావుంటుంది.

అలజడి విశ్లేషణ:

సినిమా ఆద్యంతమూ డైరెక్టర్ వంశీ మార్కు గోదావరి అందాలు, ఫ్రేమింగుతో నిండిపోయింది. సినిమా అంతా పల్లెటూరి వాతావరణంతో ప్రేక్షకుడు గోదావరి తీరంలో కూర్చున్న అనుభూతినిస్తుంది సినిమా ఆయన స్టైల్ కారెక్టర్లు, అవి మాట్లాడే బాష, యాస అన్ని బాగానే ఉన్నప్పటికీ మనం ఊహించ్చుకునే  కామెడి మాత్రం మిస్ అయిందనే చెప్పాలి. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా హీరో ముగ్గురు అమ్మయిలను ప్రేమలో పడేయడంలోనే గడిచిపోతుంది. డైలాగ్స్, పంచులు, ప్రాసలు నవ్విస్తాయి. గోదావరి తో పాటు వంశి స్టైల్ లో అమ్మాయిల అందాలు,పాటలు, డ్యాన్సులు ప్రేక్షకుడిని అలరిస్తాయి. ఒకసారి హీరో ముగ్గురు అమ్మాయిల మధ్యా ఇరుక్కు పోయాక ప్రేక్షకుడికి ఇంకొంచం ఇంట్రస్ట్ పెరుగుతుంది. కానీ మనం ఊహించే వంశీ  స్టైల్ కనబడకపోవడం కొంచం బాధాకరమే. ఎందుకంటే సినిమాకు హైప్ తీస్కోచ్చిందే అతను. సెకండ్ హాఫ్ కొంచం స్లో అయినప్పటికీ క్లై మాక్స్ వచ్చేసరికి మంచి బిగువు తో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ తో ముగుస్తుంది.ఏది ఎమైనా ఈ సినిమాలో వంశీ మార్కు కామెడి మాత్రం కొంచం తగ్గిందనే చెప్పాలి. నిర్మాత మధుర శ్రీధర్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కెమరా వర్కు తో మనకు గోదావరి అందాలు బాగా చూపించాడు కెమరామెన్. చాలా సార్లు ఒక చక్కని పెయింటింగ్ చూసిన అనుభూతినిచ్చింది.  మణిశర్మ మ్యూజిక్, వంశీ స్టైల్ సాంగ్స్ పిక్చరైజేషన్ మనసు దోచుకుంటుంది. డైలాగ్స్ పంచులతో అక్కడక్కడా బాగా పేలాయి. ఓవరాల్ గా ఫేషన్ డిజైనర్ లేడిస్ టైలర్ కొడుకనే అనిపించుకున్నాడు.

నటీనటుల పనితీరు:

హీరోగా చేసిన సుమంత్ అశ్విన్ కి మంచి పాత్ర దొరికింది. పైగా సినిమా మొత్తం చుట్టే తిరగడమే కాకుండా, గోదావరి ప్రాంతపు యాస మాట్లాడాలి. గోపాలం పాత్రలో సుమంత్ అశ్విన్ బాగా చేశాడు. ముగ్గురు హీరోయిన్స్ కి మంచి పాత్రలే దొరికాయి. అందరూ బాగా చేసిన గేదెల రాణి గా చేసిన మానస మంచి పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. మిగతా ఇద్దరూ ఓకే. కృష్ణ భగవాన్ కామెడి ఎప్పటిలానే ఆకట్టుకుంటుంది. బట్టల సత్యం కొడుకు గా గోపాళంకు చేదోడు వాదోడు గా ఉండే కేరక్టర్ చేసిన రాఘవేంద్ర కూడా బాగా చేశాడు. వైజాగ్ సత్యానంద్ గా ఫేమస్ అయిన ఆక్టింగ్ టీచర్ వాళ్ళ అబ్బాయి ఇతను.

ప్లస్ పాయింట్స్ :

  • వంశీ స్టైల్ పల్లెటూరి చిత్రీకరణ
  • ఫోటోగ్రఫీ
  • క్లైమాక్స్

మైనస్ పాయింట్స్:

  • కథనం స్లోగా ఉండడం
  • వంశీ మార్కు కామెడి మిస్సవడం
  • మ్యూజిక్
(Visited 1,006 times, 63 visits today)

Comments

comments