EDITION English తెలుగు
ఈ రోజు: 22-10-2018 (సోమవారం) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?   23-10-2018 మంగళవారం పంచంగం గ్రహం అనుగ్రహం...   ఈ రోజు: 23-10-2018 (మంగళవారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   రెహానా ఫాతిమానుముస్లిం కమ్యూనిటీనుంచి బహిష్కరిస్తున్నట్టు ఆ మత పెద్దలు ప్రకటించారు.   22-10-2018 సోమవారం పంచంగం గ్రహం అనుగ్రహం...   ఈ రోజు: 22-10-2018 (సోమవారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   ఈ రోజు: 22-10-2018 (సోమవారం) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?   ఈ రోజు: 21-10-2018 (ఆదివారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   పందెం కోడి-2...సినిమా రివ్యూ   హలో గురు ప్రేమకోసమే...సినిమా రివ్యూ

సమాజాన్ని మార్చే మామిడిచెట్టు కథ!

Author:

పిల్లలు తప్పటడుగులు వేస్తుంటే… వారిని గమనించి సరైన దారి చూపేవారు తల్లిదండ్రులు. ప్రస్తుత సమాజంలో కొంతమంది పిల్లలు.. పేరెంట్స్ మాటలు వినకుండా చెడుదారుల్లో పయనిస్తూ… దేశం దృష్టిలో దోషులవుతున్నారు. తల్లిదండ్రుల మాటలు విన్న పిల్లలు, సరైన లక్ష్యలు ఎంచుకున్న పిల్లలు మాత్రం సమాజం మెచ్చుకునేలా జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల ప్రవర్తన, తల్లిదండ్రుల పెంపకం గురించి సోషల్‌మీడియాలో ఓ చిన్న కథ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ సారి చదివేయండి…

Father-Son-Story-about life

సమయం రాత్రి 10 గంటలు !ఇంటికి ఆలస్యంగా వచ్చిన కొడుకుని చదువు మీద ధ్యాస పెట్టమని ,ఇలాంటివి మానుకొమ్మని తల్లిదండ్రులు మందలించారు.

“చిన్నప్పటి నుండి చూస్తున్నాను, నాకు మీరు అస్సలు స్వేచ్చ ఇవ్వడం లేదు. ఎంత సేపు చదువు చదువు అని నా ప్రాణం తోడేస్తున్నారు . నేను మిత్రులతో గడపకూడదా ? సినిమాలకి షికార్ల కి వెళ్లకూడదా ? అందరు వెళ్ళడం లేదా ? మొబైల్ లో ఒక గంట సేపు మాట్లాడితే తప్పా ? ఫేస్బుక్ లో చాటింగ్ తప్పా ? ” అని నిలదీసాడు కొడుకు .

“సరే నీకు కావలసినంత స్వేఛ్చ ఇస్తాను. ఒక్క సారి నా మాట వింటావా ? వచ్చే శుక్రవారం మనం ఒకసారి మన సొంత ఊరికి వెళ్లి వద్దాము . అక్కడ రెండు రోజులు ఉందాము . తిరిగి వొచ్చిన తర్వాత నీ ఇష్టం ” అని తండ్రి బదులిచ్చాడు, కొడుకు సరే అన్నాడు. అనుకున్నట్టు గానే సొంత ఊరికి బయలు దేరారు.

తండ్రి కొడుకుతో కలిసి వారి మామిడి తోటకి తీసుకెళ్ళి “నేను ఇక్కడే కుర్చుంటాను . ఈ తోటలో నువ్వు ఒక గంట సేపు తిరిగిరా అని బదులిచ్చాడు” కొడుకు ఒక గంట తర్వాత తిరిగొచ్చాడు. తోటలో నువ్వు ఏమి చూసావు అని ప్రశ్నించాడు తండ్రి.”అన్ని చెట్లు పెద్దగా బాగానే ఉన్నాయి. కానీ ఒక చెట్టు మాత్రం పొట్టిగా, పురుగులు పట్టి, కాయలు లేకుండా ఉంది. ఆరోగ్యం గా లేదు . మిగిలిన అన్ని చెట్లు బాగున్నాయి. దీనికి కారణం ఏమిటి ? ” అని అడిగాడు.

దానికి తండ్రి “మామిడి చెట్టు పెంచేటప్పుడు కొంత ఎత్తు పెరిగిన తర్వాత అవసరం లేని కొమ్మలను, కిందకు వేలాడే కొమ్మలను కత్తిరిస్తారు. లేదంటే ఈ వేలాడే కొమ్మలకు సూర్య రశ్మి తగలక, పెరుగుదల ఆగిపోయే అవకాశం ఉంది. అంతే కాకుండా పురుగులు చేరే అవకాశం కూడా ఎక్కువ . అన్ని చెట్లకి కొమ్మలు కత్తిరించాము. అందుకే అన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి. కానీ ఆ చెట్టుకి కత్తిరించలేదు. మొదట నాటిన చెట్టు కదా స్వేఛ్చగా పెరగనిద్దాము అని వదిలేసాము” అని బదులిచ్చాడు. కొడుకుకి విషయం అర్ధమయ్యింది.

“అనవసరంగా పెరిగే కొమ్మలు ఎలాగైతే వృక్షాన్ని నాశనం చేస్తాయో .. అదే విధంగా చదువుకునే వయసులో చేసే అనవసరమైన పనులు విద్యార్ధుల జీవితాలను నాశనం చేస్తాయి. మీ నాన్న కేవలం కొమ్మలు కత్తిరించే ప్రయత్నం చేస్తున్నాడు , చెట్టంత కొడుకు చల్లగా ఉండాలని. అంతే కానీ స్వేఛ్చని అడ్డుకోవాలని కాదు ” అని భుజం మీద చెయ్యి వేసి ఇంటికి తీసుకొచ్చాడు .

బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే ప్రతి తల్లి దండ్రుల మనోభావాలను ఈ యువతరం అర్ధంచేసుకోవాలని ఆశిస్తూ………….ఈ చిన్న కథ మీ మనసుని తాకితే నలుగురితో షేర్ చేసుకోగలరు.. పేస్ బుక్ లో వచ్చిన కథ రచయిత ఎవరో తెలియదు.

Must Read: Video: అల్లం నీటిని తాగడం వల్ల సహజంగా బరువి తగ్గవచ్చు.

(Visited 11,560 times, 141 visits today)