Home / Latest Alajadi / రైతులకి ఎరువులు ఉచితం, ఎకరాకి రూ.4 వేలు చొప్పున రైతు బ్యాంకు ఖాతాలో డబ్బు జమ.

రైతులకి ఎరువులు ఉచితం, ఎకరాకి రూ.4 వేలు చొప్పున రైతు బ్యాంకు ఖాతాలో డబ్బు జమ.

Author:

దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతులకి వరాలు ఇచ్చేసాడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఈరోజు రైతులతో జనహితలో జరిగిన సమావేశంలో వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి ఎరువులను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించారు. మన రాష్ట్రంలో సంవత్సరానికి దాదాపు 24 మెట్రిక్ టన్నుల ఎరువుల వినియోగం జరుగుతుంది అని, వచ్చే సంవత్సరం నుండి రైతులకి సరిపడా ఎరువులని ప్రభుత్వమే ఉచితంగా అందజేస్తుంది అని హామీ ఇచ్చారు, 55 లక్షల మంది రైతులకు లబ్ది జరుగుతుందన్నారు. గతంలో రైతుల కోసం ఏ ప్రభుత్వం చేయని విధంగా టీఆర్ఎస్ సర్కార్ ఆలోచన చేస్తుందన్నారు. ఎరువులను ఫ్రీగా ఇవ్వటం వల్ల రైతుల్లో ధీమా వస్తుందని.. వ్యవసాయం లాభసాటి అవుతుందన్నారు. ఇక నుంచి రైతులు విత్తనాలు, పురుగు మందులు మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు.

రైతులకి లాభం కలిగేలా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది అని, కొన్ని రోజుల క్రితం ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం రైతులందరి రుణాలు మాఫీ రాష్ట్ర ప్రభుత్వం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది అని తెలిపారు, ఎకరానికి రెండు దుక్కి మందు బస్తాలు, 3 యూరియా బస్తాలు, పొటాష్ వంటి ఎరువులకు నాలుగు వేల రూపాయలు ఖర్చవుతుందని వివరించారు. ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున మే నెల 30వ తేదీలోపు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేస్తామన్నారు.

(Visited 978 times, 36 visits today)