Home / Inspiring Stories / చీకటిని తరిమే పండుగే దీపావళి.

చీకటిని తరిమే పండుగే దీపావళి.

Author:

deepavali-celebrations-1

దీపావళంటే ఇప్పుడు ధన్…ధన్..ధనాదన్ మనే మోతలేమో గానీ చిన్నప్పుడు ఊర్లో మరోలా ఉండేది… దీపావళికి రెండ్రోజుల ముందే సైకిల్ షాప్ దగ్గరికి వెళ్ళి రెండు పాత బోల్ట్ లూ ఒక సైకిల్ ట్యూబ్ ముక్కా తెచ్చుకొని రెండు బోల్టులనీ దగ్గరగా భిగించి కట్టి రెండిటి మధ్యా రీలు మందు(బొట్టు బిళ్ళ సైజులో కూడా వచ్చేవి) పెట్టి గోడకి కొడితే “ఠా…ప్” ఆనందం వెలుగు లా విచ్చుకునేది..

deepavali-celebrations-2

కొన్నాళ్ళకి తుపాకులువచ్చాయి రీలు మొత్తాన్నీ లోడ్ చేసి రెండు గ్రూపులుగా విడి పోయి ఉత్తుత్తి కాల్పులతో వీధి పోరాటాలు కొన్ని ఙ్ఞాపకాలలా మిగిలిపోతాయ్… ఇప్పుడు రకరకాల బాణా సంచా పొగా,సౌండూ దద్దరిల్లే శబ్దాలూ.. తపాసుల స్థానం లోకి బాంబులూ,దీపాల స్తానం లోకి ఎలక్ట్రిక్ బల్బులూ వచ్చాయి..

deepavali-celebrations-3

పండగ ఆనందం డబ్బులతో కొని తెచ్చుకునే కాలుష్యం కారణం గా పూర్తిగా హరించుకుపోతోంది. దీపావళి సమయంలో 6-10 శాతం కాలుష్యస్థాయి పెరుగుతుంది. నైట్రస్‌ ఆక్సైడ్‌, సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ స్థాయి ప్రమాదర స్థాయిలో పెరుగుతుందనేది కాలుష్య నియంత్రణ మండలితో పాటుగా పలు స్వచ్ఛంద సంస్థల నివేదికలు చెబుతున్నాయి. ఇదివరకటి కంటే పెరిగిన టపాకాయల వినియోగం వళ్ళ ఈ రెండు రోజుల్లోనూ విష వాయువులు ప్రమాదకర స్థాయిలో వెలువడుతున్నయి. దీపావళి వేళ కాల్చే మతాబులు వల్ల సల్ఫర్‌ అధిక సంఖ్యలో వాతావరణంలో విడుదలవుతుంది. బాంబులు వల్ల ధ్వని కాలుష్యం పెరుగుతుంది. సైలెంట్‌గా మనం ఈ పండుగ ఎందుకు చేసుకోలేం.?

deepavali-celebrations-4

‘‘దీపావళి వేళ కాల్చే మందులు వల్ల ఆస్తమా లాంటి రోగాలు బారిన పడే అవకాశం చిన్నారులకు అధికంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలపై కూడా ఇది తీవ్ర ప్రభావమే చూపుతుంది’’ సంప్రదాయ రీతిలో దీపాలు వెలిగించి, స్వీటులు పంచుకోవటం వరకూ ఓకే కానీ అధిక శబ్దాలు, కాలుష్యం వెదజల్లే టపాసులు కాల్చటం వల్ల చెవి, గొంతు సమస్యలు రావటంతో పాటుగా హార్ట్‌ పేషంట్లకు బిపీ పెరగటం, టపాసులు కాల్చిన చేతులను పొరపాటున కళ్లలో పెట్టుకోవటం వల్ల కళ్లు దెబ్బతినటం లాంటి సమస్యలెన్నో వస్తాయని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

deepavali-celebrations-5

ఇక సామాజిక కోణం నుంచి చూస్తే టపాసుల పరిశ్రమలో పని చేసే కార్మికుల జీవితాలు అతి దుర్భరమైనవి వీరిలో అధిక శాతం బాల కార్మికుల్కే ప్రతి సంవత్సరం వందలాది మంది బాలకార్మికుల్ని పొట్టన పెట్టుకుంటున్న మతాబుల వెనుక మతలబులు చాలానే ఉన్నాయి. ఆర్భాటాలకు, అహంభావాల ప్రదర్శనకు, ఆబగా ఆర్థిక పేరాశలకు కొలబద్ధలుగా ఉన్న మతాబుల పరిశ్రమల్ని కొన్ని దేశాలు నిషేధించాయి.ఐతే మన దేశం లో మాత్రం ఇది మత సంబంద వ్యవహారం కావటం తో అంత సులభమేం కాకపోవచ్చు.. పండగంటే ఆనందం గా ఉండాలి భయం భయంగా కాదు చిన్న వెలుగుల టపాసులతో వచ్చేఆనందం అయితే పెద్ద శబ్దాల టపాసులని పేల్చటం అనేది శాడిజం కిందకే వస్తుంది. సంస్కృతీ సాంప్రదాయం అంటే నూనె దీపాలు వెలిగించి, వెలుగుల పండగ చేయటం కానీ పెడ్డ పెద్ద శబ్దాలతో మన ఆరోగ్యాన్ని పాడు చేయటం కాదు… సో…! ఈ దీపావళి ఎకో ఫ్రెండ్లీ దీపావళి గా చేద్దాం… హ్యాపీ గ్రీన్ దివాలి టూ ఆల్

(Visited 307 times, 50 visits today)