Video: హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో ఫైర్ ఆక్సిడెంట్.

Author:

హైదరాబాద్ మెట్రో రైల్వే స్టేషన్ లో జరిగిన ఫైర్ ఆక్సిడెంట్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది, మాదాపూర్ మెట్రో స్టేషన్ లో సోమవారం (Feb 5th ) రోజు సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది, ఈ మెట్రో స్టేషన్ లో వెల్డింగ్ పనులు జరుగుతున్నాయి..ఆ సమయంలో నిప్పురవ్వలు ఎగిరి పడి మంటలు చెలరేగాయి, మంటలని వెంటనే అదుపులోకి తెచ్చినట్లు మెట్రో అధికారులు తెలిపారు.

ఈ స్టేషన్ ప్రయాణికులకి ఇంకా అందుబాటులోకి రాలేదు, అగ్నిప్రమాద సమయంలో అక్కడ పనిచేస్తున్న కొంతమందికి స్వల్పగాయాలు అయ్యాయి, వారిని వెంటనే హాస్పిటల్ కి తరలించారు , మెట్రో స్టేషన్ లో ఉన్న అత్యాధునిక అగ్నిప్రమాద పరికరాల వల్ల వెంటనే మంటలని అదుపులోకి తెచ్చినట్లు మెట్రో అధికారులు తెలిపారు, మెట్రో స్టేషన్ లో మంటలు చెలరేగిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

(Visited 540 times, 562 visits today)