Home / Inspiring Stories / సముద్రం లోపలి నుంచి ప్రయాణించనున్న భారత తొలి బుల్లెట్ ట్రైన్

సముద్రం లోపలి నుంచి ప్రయాణించనున్న భారత తొలి బుల్లెట్ ట్రైన్

Author:

underwater-train-india

ఇప్పటి వరకు భూ ఉపరితలం పై వేగంగా పరుగులు పెట్టే రైళ్లను మాత్రమే చూశాం. సముద్రం అడుగు భాగంలో వాయువేగంతో బుల్లెట్ రైలు పరిగెత్తితే ప్రయాణికులకు గొప్ప అనుభూతి కలగడం ఖాయం. జలాంతర మార్గంలో ముంబై, ఆహ్మదాబాద్‌ల మధ్య రివ్వున దూసుకెళ్లే బుల్లెట్ రైళ్లను రైల్వేశాఖ ప్రవేశపెట్టేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ముంబై నుంచి ఆహ్మదాబాద్‌ల మధ్య 508 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి పట్టే సమయం కేవలం రెండు గంటలే. ఈ స్టేషన్ల మధ్య నడిచే హైస్పీడ్ రైలు దురంతో ఎక్స్‌ప్రెస్‌కు ప్రస్తుతం సుమారు ఏడు గంటల సమయం పడుతున్నది.

underwater-train-india

ఈ రైలు ముంబయి-అహమ్మదాబాద్ నగరాల మధ్య థానే ప్రాంతంలో సముద్రం దిగువన కూడా ప్రయాణిస్తూ ప్రయాణికులకు వింత అనుభూతినివ్వబోతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశంలో అమితవేగంతో ప్రయాణిస్తూ సుదూర ప్రాంతాల్లోని గమ్యస్థానాలకు గంటల వ్యవధిలోనే ప్రయాణికులను చేరవేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్లను ప్రవేశపెట్టాలని ఆలోచిస్తోంది. అందులో భాగంగానే ముంబై-అహమ్మదాబాద్ ప్రాజెక్ట్ తెర మీదకు వచ్చింది. మొత్తం 508 కిలోమీటర్ల నిడివిగల ఈ మార్గంలో థానే వద్ద సముద్రం దిగువన 21 కిలోమీటర్ల సొరంగం ఉంటుందని, దాని ద్వారా ట్రైన్ పరుగులు తీయనుందనీ సమాచారం.. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 97,636 కోట్లు. ఈ వ్యయంలో 81 శాతం నిధులను జపాన్ నుంచి సమకూర్చుకునంటున్నట్టు అధికారులు వెల్లడించారు. 15 ఏండ్ల మారటోరియంతో ఏడాదికి 0.1 శాతం వడ్డీని 50 ఏండ్లలో చెల్లించే విధంగా ఈ ఏడాది చివర్లో ఒప్పందం జరుగుతుందని, 2018 నుంచి ప్రాజెక్ట్ పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను దృష్టిలో పెట్టుకొని తొలిసారి నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ)ను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. ఎస్పీవీ కోసం రైల్వేశాఖ రూ.200 కోట్లను కేటాయించింది. ఈ ప్రాజెక్ట్‌లో మహారాష్ట్ర, గుజరాత్‌లకు 25 శాతం చొప్పున ఈక్వీటి, రైల్వేకి 50 శాతం వాటా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కోసం మేనేజింగ్ డైరెక్టర్, ఐదుగురు డైరెక్టర్ల నియామకానికి సెర్చ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.

(Visited 14,427 times, 35 visits today)