ఇక బస్టాండ్ లలో కూడా ఫ్లాట్‌ఫాం టికెట్ కొనాల్సిందే…!

Author:

రైల్వే స్టేషన్ కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫ్లాట్ ఫారం తీసుకుంటేనే స్టేషన్ లోపలకి వెళ్లగలుగుతాం, ఇక మీదట బస్టాండ్ లలోకి వెళ్లాలంటే కూడా ఫ్లాట్ ఫారం టికెట్ తీసుకోవాల్సిందే, తెలంగాణలో ఇక బస్టాండ్ లలో రైల్వే స్టేషన్ తరహాలో ఫ్లాట్ ఫారం టికెట్లని ప్రవేశపెట్టెలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.

flat-farm-ticket-in-telangana-bus-stand

తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు నుండే నష్టాలలో ఉన్న ఆర్టీసీని లాభాల రూట్ లోకి ఎక్కించాలని ఎన్ని ప్రయత్నాలు చేసిన నష్టాలు తప్పట్లేవు, ప్రయాణికులపై అధికభారం మోపి టికెట్ రేట్లు పెంచిన కూడా నష్టాలే వస్తుడటంతో ఆర్టీసీ అధికారులు ఆదాయం తెచ్చిపెట్టే ఇతర మార్గాలపై దృష్టిపెట్టారు. టికెట్ రేట్లు పెంచితే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉనందున ఫ్లాట్ ఫారం టికెట్ ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు, దీనికి ప్రభుత్వం నుండి కూడా సానుకూలత వచ్చింది., తొలుత ఎంజీబీఎస్‌, జేబీఎస్ (హైదరాబాద్‌) సహా కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో ఉన్న పెద్ద బస్టాండ్లలో ఫ్లాట్‌ఫాం టికెట్లను ప్రయోగాత్మకంగా అమలు చేసి.. ఫలితాల్ని పరిశీలించిన తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నఅన్ని జిల్లాల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు, వచ్చే జనవరి 1వ తేదీ నుండి అమలు చేయాలనీ ప్రణాళికల్ని రూపొందిస్తున్నారు.ఈ నిర్ణయం అమలులోకి వస్తే దేశంలో ఏ రాష్టంలో లేని ఈ సరికొత్త బాదుడుని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించినట్లు అవుతుంది, కొత్త సంవత్సరంలో కొత్త రకం బాదుడుకి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉండాలి.

Also Read: మీకు 10 సంవత్సరాల లోపు అమ్మాయి ఉందా? అయితే మీకో శుభవార్త.

(Visited 1,650 times, 14 visits today)

Comments

comments