ప్లాస్టిక్ బాక్సులను ఉపయోగిస్తున్నారా? మీరు చాలా ప్రమాదంలో ఉన్నట్లే…

Author:

ఉద్యోగాలకు, చిన్న పిల్లలకు బాక్సుల్లో స్నాకులు, ఆహారాన్ని నింపేవారు ఇకపై వాటిని నిలిపివేయటం మంచిదని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. రోజూ కార్యాలయాలకు ప్లాస్టిక్‌ డబ్బాల్లో ఆహారాన్ని తీసుకువెళ్లి తినేవారికి జుట్టు వూడిపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నట్లు ఇటీవల నిర్వహించిన అధ్యయనాల్లో తేలింది. అంతేగాకుండా, స్కూళ్లకు వెళ్లే పిల్లలకు ప్లాస్టిక్‌ బాక్సుల్లో ఆహారాన్ని పెట్టి ఇవ్వడం వల్ల చిన్నవయసులోనే వారు పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చాలా రకాల సర్వేల్లో తేలింది. కార్యాలయాల్లో ప్లాస్టిక్‌ కప్పుల వాడకం వల్ల క్యాన్సర్‌ కారకాలు వ్యాపిస్తున్నట్లు తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. అంతేగాకుండా, ప్లాస్టిక్ డబ్బాల్లో వేడి వేడి అన్నాన్ని నింపడం ద్వారా కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తేలింది.

food-in-plastic-box-is- very dangerous

హాట్ సూప్‌లు వంటివి ప్లాస్టిక్ కంటైనర్లలో నింపడం ద్వారా అందులో యాసిడిక్ పదార్థాలు ఉత్పత్తి అయ్యి, తద్వారా కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తేందుకు కారకమవుతాయి. ఈ సమస్య చిన్నాపెద్దా అని వయస్సు నిమిత్తం లేకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ ప్లేట్ల ద్వారా ఆహారాన్ని తీసుకునే వారిలో కిడ్నీ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా వాడే అలవాటు ఉన్నవారు ఇకనుండి అయినా, ప్లాస్టిక్ వస్తువులకు స్వస్తి చెప్పి ఆరోగ్యాన్ని కాపాడుకోవటంపై దృష్టిపెట్టండి.

(Visited 1,727 times, 113 visits today)