EDITION English తెలుగు
మూవీ రివ్యూ: 'పేట'   మూవీ రివ్యూ:వినయ విధేయ రామ   మూవీ రివ్యూ:యన్.టి.ఆర్‌ -కథానాయకుడు   5 రూపాయలు తీసుకొని అటే ఉడాయించి ఉంటాడు,అనుకున్న వ్యక్తికీ. సార్ మీ ఛాయ్..అన్న పిలుపుతో అతను షాక్ కు గురయ్యాడు.అసలు ఏమైందో తెలుసా..?   ఈ క్యాబ్ డ్రైవ‌ర్ రాత్రి పూట అవ‌స‌రం ఉన్న వారిని ఉచితంగా క్యాబ్‌లో ఇంటి దగ్గ‌ర దింపుతాడు. ఎందుకో తెలుసా..?   మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాటకు కరెక్ట్ అర్థం ఈ జంటే... వీరి కథ వింటే ఆశ్చర్యపోవాల్సిందే. రియల్ స్టోరీ..!   మూవీ రివ్యూ: పడి పడి లేచె మనసు   పొరిగింటి రెండేళ్ల చిన్నారి కోసం...చనిపోతూ ఈ తాత ఇచ్చిన విలువైన బహుమతి ఏంటో తెలుసా..?   కేంద్రం సంచలన నిర్ణయం...! ఇకపై ఆధార్ అడిగితే కోటి జరిమానా...జైలు శిక్ష! వివరాలు ఇవే!   ఎంతపెద్ద జ్వరమైనా ఈ ట్రిక్ పాటిస్తే సింపుల్ గా తగ్గిపోద్ది.! కావాల్సింది పెసరపప్పు ఒక్కటే.!
Home / Inspiring Stories / ఫేస్‌బుక్ వారి ఫ్రీ బేసిక్స్ మన మంచికేనా?

ఫేస్‌బుక్ వారి ఫ్రీ బేసిక్స్ మన మంచికేనా?

Author:

Facebook Free Basics

ఈమధ్య ఏ న్యూస్ పేపర్ చూసిన ఒకటి లేదా రెండు పేజీల నిండా ఫేస్‌బుక్ వారి “ఫ్రీ బేసిక్స్” యాడ్ కనపడుతుంది. అందులో ఫ్రీ బేసిక్స్ వారు అందించే ఉచిత ఇంటెర్నెట్ వలన భారతదేశం కనెక్ట్ అవుతుంది అందరికి ఇంటెర్నెట్ ఫలాలు దక్కుతాయి అని పెద్ద పెద్ద అక్షరాలతో రాయడం చూస్తున్నాం. దానితో పాటు డిజిటల్ ఈక్వాలిటీ(సమానత్వం)ని సపోర్ట్ చేయాలంటే ఇచ్చిన నంబర్ కి మిస్డ్ కాల్ చెయ్యండి అని రాసి ఉంటుంది. కానీ మనలాంటి చాలా మంది ఇది ఫేస్‌బుక్, మన దేశం కోసం చేసే మంచి పని ఏమో అని చెప్పి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. కానీ ఇందులో చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. అది ఏమిటంటే ఈ దేశంలో ఏ కార్పొరేట్ కంపని అయిన తమకు ఎటువంటి ఉపయోగం లేకున్నా మేము మంచి పని చేస్తున్నాం, మాకు సపోర్ట్ చెయ్యండి అని కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి న్యూస్ పేపర్ లలో యాడ్స్ వేయిస్తుందా? అసలు అంత మంచి పని చేసేవాళ్ళు ఈ యాడ్స్ కి ఖర్చు అయ్యే డబ్బులని కూడా ఆ మంచి పని కోసమే ఉపయోగించకుండా ఎందుకు ఇంత పెద్ద యాడ్స్ వేయిస్తున్నారు అని మనకు మనం ప్రశ్నించుకుంటే అందులోనే మనకు సమాధానం దొరుకుతుంది.

ఇంతకుముందు ఇంటెర్నెట్.ఆర్గ్ అనే ప్రోగ్రామ్ తో భారతదేశానికి వచ్చిన ఫేస్‌బుక్, ఆ కుతంత్రం ఫలించకపోవడంతో మళ్లీ ఇప్పుడు ఫ్రీ బేసిక్స్ పేరుతో మరోసారి భారతీయులకీ ఉన్న స్వేచ్ఛ ఇంటెర్నెట్ వాతావరణాన్ని దెబ్బ తీయాలని చూస్తుంది. ఫ్రీ బేసిక్స్ ద్వారా అందరికి ఇంటెర్నెట్ వస్తుంది కానీ అందులో అన్ని వెబ్‌సైట్లు మనం చూడలేము. ఎవరైతే ఫ్రీ బేసిక్స్ ప్రోగ్రామ్ కి మద్దతు తెలిపి, వారి నియమ నిబంధనలు పాటిస్తారో కేవలం వారి వెబ్‌సైట్ లు మాత్రమే కనపడతాయి. అంటే మనం ఎం వెబ్‌సైట్ లు చూడాలో ఫేస్‌బుక్ నిర్నయిస్తుదన్న మాట. అసలు మనమెందుకు వాళ్ళ పోగ్రామ్ కి మద్దతు తెలిపి మన వెబ్‌సైట్ ని ఫ్రీ బేసిక్స్ కి రిజిస్టర్ చెయ్యడం. ఇప్పుడు మన వెబ్‌సైట్ అందరి కంప్యూటర్ లలో ఓపెన్ ఆవతుంది కానీ ఫ్రీ బేసిక్స్ వస్తే మన వెబ్‌సైట్ మనకు చూపించాలా వద్దా అనేది ఫేస్‌బుక్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు జనాలకి ఫ్రీ గా అలవాటు చేసి తర్వాత చాలా మంది దానికి అలవాటు పడిన తర్వాత ఎలాగైనా లాభాలు పోందుతామన్న దుష్ట కార్పొరేట్ ఆలోచనతో మన ముందుకు వస్తున్న ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్ ని మనమందరం తిప్పి కొట్టాలి. దీనికోసం అందరు www.savetheinternet.in ఓపెన్ చేసి ట్రాయ్ కి ఒక ఈమేల్ పంపించండి.

(Visited 194 times, 31 visits today)