ఏ ఏ వస్తువులపై ట్యాక్స్ ఉండదో తెలుసా…!?

Author:

దేశమంతా ఒకే పన్ను విధానంలోకి తీసుకొస్తూ జూలై 1 నుంచి జీఎస్టీని అమల్లోకి తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఏయే వస్తువులపై ఎంత పన్ను విధించానున్నారో విధివిధానాలు రెడీ అయ్యాయి. అయితే జీఎస్టీ అమలుతో ప్రస్తుతం కంటే 4 నుంచి 5 శాతం ధరలు తగ్గుతాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.  జులై 1 నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానున్న నేపథ్యంలో, జీఎస్టీ పన్ను పరిధిలో లేని వస్తువుల జాబితాను కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ విడుదల చేసింది. బ్రాండెడ్ ఆహారపదార్థాలపై 5 శాతం మాత్రమే పన్ను విధించనున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటనలో తెలిపింది.

వీటిపై జీఎస్టీ ట్యాక్స్ ఉండదు

జీఎస్టీ పన్ను లేని వస్తువులు:

తాజా మాంసం, చికెన్, గుడ్లు, పాలు, పెరుగు, సహజంగా దొరికే తేనె, తాజా కూరగాయలు, పండ్లు, రకరకాల పిండి, ఉప్పు, పప్పు దినుసులు, తృణధాన్యాలు, గోధుమలు, మైదా, శనగపిండి, ఉడికించిన బియ్యం, బ్రెడ్, బిందీ, సిందూర్, స్టాంపు, జ్యుడిషియల్ పేపర్స్, ప్రింటెడ్ బుక్స్, వార్తాపత్రికలు, గాజులు, పశువుల దాణా, సేంద్రీయ ఆహారపదార్థాలు, ముడి సిల్కు, ముడి ఉన్ని, జనపనార వస్తువులు, చేనేత వస్త్రాలు, చేతి వృత్తుల ద్వారా తయారవుతున్న వ్యవసాయ సామాగ్రి కి పన్ను మినహాయింపు ఉన్నట్టు మంత్రిత్వశాఖ తెలిపింది.

అంతేకాదు, విద్య, వైద్య రంగాలను జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ప్రకటించారు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ. జీఎస్టీతో ధరలేమీ పెరగవని.. ఉన్న ధరలే కొనసాగుతాయి లేదా ఇంకా తగ్గుతాయన్నారు. నియోగదారులకు మరింత అనుకూలంగా ఉంటుందన్నారు.

(Visited 3,604 times, 78 visits today)