Home / health / ఎండ ఉంది కదా అని, ఎక్కడ పడితే అక్కడ జ్యూస్ తాగకండి.

ఎండ ఉంది కదా అని, ఎక్కడ పడితే అక్కడ జ్యూస్ తాగకండి.

Author:

జ్యూస్ అనగానే ముందుగా వెళ్లేది జ్యూస్‌లు తయారుచేసే స్టాల్స్‌కు.. అక్కడ ఫ్రూట్‌ జ్యూస్‌కు ఉపయోగించే పండ్లు తాజావా? కుళ్లినవా? దాంట్లో పోసే నీరు శుభ్రంగా ఉందా? లేదా? వాడే ఐస్ ఎలాంటిది? చేసే ప్రాంతం పరిశుభ్రంగా ఉందా? లేదా? పండ్లపై దోమలు, ఈగలు వాలుతున్నాయా? వాటిపై ఏమైనా కప్పి ఉంచారా? అని మాత్రం ఎవ్వరం చూడం.. చెప్పిన ఐదు నిమిషాలకు సువాసనలు కలిపి అడిగిన జ్యూస్ ఇవ్వగానే తాగేస్తాం.. అంతే మరి దాని ప్రభావం ఎలా ఉంటుందనేది మనం పట్టించుకోం. అందుకే ఇలాంటి జ్యూస్‌లు తాగేవారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని, కుళ్లిన పండ్లపై అత్యంత ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఉంటున్నాయని, కుళ్లిన పండ్లతో తయారు చేసిన జ్యూస్ క్యాన్సర్, జాండిస్, అతిసార లాంటి అత్యంత ప్రమాదకరమైన వ్యాధులకు గురిచేస్తున్నాయని, పండ్ల రసాలు పాయిజన్‌గా మారుతున్నాయని ఇటీవల నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్ సంస్థ చేసిన పరిశోధనలో వెల్లడయింది.

fruit-juice-getting-passionate

సాధారణంగా జ్యూస్‌పాయింట్లలో సపోటా, పైనాపిల్, బత్తాయి.. గ్రేప్, బనానా, మ్యాంగో మొదలైన పండ్ల రసాలు విక్రయిస్తుంటారు. ఇవి ఎక్కడైనా దొరుకుతాయి. అంతేకాదు వీటికి డిమాండ్ కూడా బాగా ఉంటుంది. అందుకే వీటిని ఎక్కువ మొత్తంలో తెచ్చి పండ్ల రసాలు తీస్తారు. ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండడంతో వీటిపై ఈ(ఇశ్చరేషియా) కొలై, షెగెల్లా, సైఫర్‌కోకస్ లాంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు వృద్ధి చెందుతాయి. అంతేకాదు కాదు పండ్లను తాజాగా ఉంచడం కోసం ఇంజక్షన్లను ఉపయోగించడం, సువాసనలకోసం రకరకాల రసాయనాలను వాడడటం, బోరునీళ్లతో ఐస్ తయారు చేయడం, కుళ్లినపండ్లపై దుమ్మూ, ధూళి చేరడం, అపరిశుభ్రమైన చేతులను జ్యూస్‌తయారీకి వాడడం మొదలైనవన్నీ కలిసి రసాయన చర్య జరిగి జ్యూస్ మొత్తం విషంగా మారుతుందని జాతీయ పోషకాహార సంస్థ తన పరిశోధనలో పేర్కొంది..

కుళ్లిన పండ్లపై 96.6% వ్యాధికారక బ్యాక్టీరియాలు ఉంటాయని, 77% మలిన పదార్థాలు ఉంటాయిని చెప్పింది.. కాదు ఈవిధంగా తయారు చేసిన పండ్ల రసాన్ని సేవించడం వల్ల అది శరీరంలో స్లోపాయిజన్‌గా మారి క్యాన్సర్‌ను, డయేరియాను కూడా కలిగించవచ్చని పేర్కొంది..అసలే ఇప్పుడు పండ్లన్నీ వివిధ రకాల కృత్రిమ పద్ధతుల్లో ఉత్పత్తి చేస్తున్నారు. వాటిని పండించేందుకు వివిధ రకాల రసాయనాలు ఉపయోగిస్తున్నారు. అవి త్వరగా పక్వానికి రావడానికి ఎన్నో రకాల ఇంజక్షన్లు, రసాయన పదార్థాలను ఉపయోగించి నిగనిగలాడే విధంగా చేస్తున్నారు. ఇలా చేయడం అతి ప్రమాదకరమని, ఆరోగ్యం కోసం పండ్లు తినేవారికి అవి శాపంగా మారుతున్నాయని ఎన్నో పరిశోధనలు తేల్చి చెప్పాయి. వారికి వెంటనే కాకాపోయినా సమీప భవిష్యత్‌లో దీర్ఘకాలిక ప్రభావం పడుతోందని నొక్కి వక్కానించాయి. ఈ కృత్రిమ పండ్లకు తోడు జ్యూస్ పాయింట్ల వారు పండ్లు తాజాగా ఉండేందుకు కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఎక్కువ కాలం నిల్వ ఉంచిన పండ్లు పాడవకుండా, కుళ్లిపోకుండా, అవి తాజాగా కనపడేందుకు వివిధ రకాల ఇంజక్షన్లు చేస్తున్నారు. వివిధ రకాల రసాయనాలు ఉపయోగించి వాటికి తాజా పండ్లలా కలరింగ్ ఇస్తున్నారు.. తద్వారా వీటినుంచి తీసిన జ్యూస్ క్రమేణా స్లో పాయిజన్‌గా మారి క్యాన్సర్, అతి ప్రమాదకరమైన ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.

సాధారణంగా ఎండాకాలంలో ఐస్‌కు డిమాండ్ బాగానే ఉంటుంది. జ్యూస్‌పాయింట్లు, ఐస్‌పాయింట్లు, చెరకురసం పాయింట్లలో బాగానే వాడతారు. ఎండాకాలం డిమాండ్ దృష్ట్యా ఐస్‌ను మంచి, పరిశుభ్రమైన నీటితో కాకుండా అత్యంత కలుషిత నీటితో తయారు చేస్తున్నారు. కొన్నిచోట్ల బోర్‌వాటర్‌తో కూడా ఐస్‌ను తయారుచేసి జూస్‌పాయింట్లకు విక్రయిస్తున్నారు. ఇలా తయారుచేసిన ఐస్‌లలో కూడా అత్యంత చల్లదనాన్ని తట్టుకునే కొన్ని రకాల నూక్ష్మజీవులు ఉంటున్నాయి. జాండిస్, అమీబియాసిస్, క్యాన్సర్‌ను కలిగించే వ్యాధికారక బ్యాక్టీరియాలు ఉంటాయి. వీటిని పండ్లరసాల తయారీలో ఉపయోగించడం వల్ల అన్నింటికితోడు ఇవి కూడా కలిసి జూస్‌ను విషపూరితం చేయడంలో తోడ్పడుతున్నాయి. చల్లదనం కోసం చెరుకు, పండ్ల రసాలలో వేసే ఐస్‌ అనారోగ్యానికి కారణమవుతుందని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంట్యూ మెడిసిన్‌(ఐబిఎం) ఆహార కల్తీ నిరోధక విభాగం నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాణ్యతను ఏమాత్రం పాటించని ఐస్‌ను వినియోగించడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొంటున్నారు. ఐస్‌ తయారీకి పరిశుభ్రమైన తాగునీటిని వినియోగించాలి. అందుకు అవసరమైన నాణ్యత ప్రమాణాలను పాటించాలి. ఐస్‌ తయారీకి వినియోగిస్తున్న నీటిని ప్రభుత్వ సంస్థ ఐబిఎంలోని నీటి పరీక్ష విభాగంలో లేక ప్రైవేటు సంస్థల్లో పరీక్షలు చేయించుకోవాలి. నీటిలో ఎలాంటి బ్యాక్టీరియా వైరస్‌లు లేవని, స్వచ్ఛమైన క్లోరినేషన్‌ చేసిన నీటిని వినియోగిస్తున్నట్లు దృవీకరణ పొందాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మార్కెట్ లో దొరికే ఐస్ ఉత్పత్తి సంస్థలు ఏవీ కూడా ఈ నిబందనలని పాటించటం లేదు,కావున మీరే పండ్లని తెచ్చుకొని స్వయంగా ఇంట్లోనే జ్యూస్ ని  తయారుచేసుకోవడం మంచిది.

Must Read:ఒక్క అమ్మాయి కోసం ట్రైన్ ని నడిపిస్తున్న రైల్వే అధికారులు.

(Visited 2,526 times, 83 visits today)