Home / Videos / యవ్వనం అనేది షో కేస్ లో బొమ్మ కాదంటున్న గరికపాటి…!

యవ్వనం అనేది షో కేస్ లో బొమ్మ కాదంటున్న గరికపాటి…!

చమత్కార సంభాషణల్లో సహస్రావధాని గరికపాటి నరసింహా రావు గారిది అందె వేసిన చెయ్యి. వెనుకటి కాలం లో ఒక అవ్వను ఏడిపించటానికి ఒక యువకుడు చేసిన ప్రయత్నాన్ని వివరిస్తూ ఆయన విసిరిన సెటైర్ సరిగ్గా …నేటి జనరేషన్ గుండెల్లో గుచ్చుకున్నట్టుగా ఉంది. గూని తో బాధపడుతున్న ఆ ముసలామే నేల మీద దేనికోసం వెతుకుతోందో అంటూ ఓ కుర్రాడు వెటకారంగా అడిగితే, యవ్వనమనే నా ముక్కు పొడక  కింద పడిపోయిందంటూ గడుసుగా ఆమె చెప్పిన సమాధానాన్నిగరికపాటి వివరించిన తీరు నేటి యువతరం ఒక్కసారి చూసి తీరాల్సిందే. వయసు మళ్లిన వాళ్ళ పట్ల అనుచితంగా ప్రవర్తించే కుర్ర కారుకి చెంపపెట్టులా ఉండే ఈ చమత్కార సన్నివేశాన్ని వివరించిన గరికపాటి, ‘ఐ డోంట్ నో….ఐ హ్యావ్ నో ఐడియా’ అనే పదాలు కాకుండా ….పాజిటివ్ వర్డ్ బిల్డింగ్ నేర్చుకొమ్మంటూ సందేశాత్మక చురక అంటించారు. సమాజం లో పెద్దల పట్ల గౌరవం తో నడుచుకోకపోతే, ఎదురయ్యే అనర్ధాలను చక్కగా వివరించిన గరికపాటి… యవ్వనం మీద అంత మోజు పెంచుకోవద్దనీ, అదేమీ శాశ్వతం  గా షో కేసు లో పెట్టుకునే బొమ్మ కాదనీ చెప్పుకొచ్చారు. సో…..కుర్రాళ్లూ……రేపటి కాబోయే ముసలోళ్లు మీరే అని మర్చిపోకండి…..బిహేవ్ వెల్ విత్ ఎల్డర్స్ !

(Visited 125 times, 17 visits today)
[fbcomments url="http://peadig.com/wordpress-plugins/facebook-comments/" width="100%" count="off" num="3" countmsg="wonderful comments!"]