తొందర్లో వాట్సాప్ ద్వారా కూడా గ్యాస్ సిలిండర్ బుక్ చేయొచ్చు

Author:

వాట్సాప్ లేనిదే మనకు రోజు కూడా మొదలవడం లేదు. పొద్దున్న లేవగానే వాట్సాప్ మెసేజులకి రిప్లై ఇచ్చినాకే మంచం దిగే రోజులివి. వాట్సాప్ తో ఎంత దూరం ఉన్నవారి కైనా మెసేజులు, ఫోటోలు, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేయొచ్చు. వాట్సాప్ గనక ఆగిపోతే చాలా కోల్పోయినట్టు ఫీల్ అవుతాం. మరి ఎన్నో సౌకర్యాలు ఉన్న వాట్సాప్ సర్వీస్ లోకి ఇంకో అతి ముఖ్యమైన సర్వీస్ కూడా రాబోతుంది. అదే గ్యాస్ సిలిండర్ బుకింగ్ అది కూడా వాట్సాప్ ద్వారా.. ప్రభుత్వ పథకాలకు కూడా వాట్సాప్ ద్వారా సర్వీస్ ని పొందడం చాలా అదృష్టం. ఉత్తర్ ప్రదేశ్ లోని కొన్ని గ్రామాల్లో ఓ ప్రభుత్వ పథకాన్ని ఇలా వాట్సాప్ ద్వారా అమలు పరచడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీని సంబంధించిన నియమాలు ఇంకా డిజైన్ చేస్తున్నారు. ఒకసారి వాటి నియమ నిభందనలు రూపుదిద్దుకున్నాక దీనిని అమలు పరుస్తారు.

gas booking on whatsapp

కేంద్ర పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ వర్గాలు మాట్లాడుతూ… ఇప్పటికే SMS, ఫోన్ల ద్వారా బుకింగ్స్ చేసుకోవటం కూడా చాలా సౌకర్యంగానే ఉన్నప్పటికీ, ఈ పథకాల రూపకల్పన పూర్తి అయ్యాక వాట్సాప్ ద్వారా ఈ సర్వీస్ ని పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే గ్యాస్ కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయని, అంతా కుదిరాక ఈ పథకాలన్నీ వాట్సాప్ ద్వారా ప్రజలకి అందివ్వాలని, మంత్రిత్వ శాఖలు ముందుకు వచ్చాయి. ఏదైతేనేం ఇలాంటి సౌకర్యాలు ఉంటే ప్రతి పని చాలా సులభం అయిపోతుంది.

(Visited 511 times, 137 visits today)