Home / Reviews / ఘాజీ రివ్యూ & రేటింగ్.

ఘాజీ రివ్యూ & రేటింగ్.

Alajadi Rating

3.5/5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: రానా, తాప్సి, కె.కె.మీనన్‌, అతుల్‌ కులకర్ణి, నాజర్‌, సత్యదేవ్‌, తదితరులు

Directed by: సంకల్ప్‌ రెడ్డి

Produced by: పీవీపీ సినిమా, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌

Banner: పీవీపీ సినిమా, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌

Music Composed by: కె

ప్రజలందరిని కదిలించి, ఒక్కతాటిపైకి తెచ్చే ముఖ్యమైన అంశాలలో దేశభక్తి ఒకటి. భారత ప్రజలు ప్రాంతాలు, మతాలు, కులాలుగా విడిపోయినా కాని దేశానికి ఎమైనా ఐతే అందరూ కలిసికట్టుగా పోరాడుతారు. అలాంటి దేశభక్తి, దేశ రక్షణ వృత్తాంతంతో, చరిత్రకెక్కని భారత్, పాకిస్తాన్ ల మధ్య జరిగిన ఒక అండర్ వాటర్ సబ్ మెరీన్ యుద్ధాన్ని “ఘాజీ” గా మలిచారు కొత్త దర్శకుడు సంకల్ప్ రెడ్డి. పీవీపీ సినిమా, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు కలిసి నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది, మరి ఆ సినిమా ఏలా ఉందో ఒకసారి చదివేయండి.

కథ:

1971 సంవత్సరంలో పాకిస్తాన్ పాలనలో ఉన్న బంగ్లాదేశ్ స్వాతంత్రం కొరకు పాకిస్తాన్ పై తిరగబడుతుంది, తమ సైన్యానికి సహాయం చేయడం కొరకు ఘాజీ అనే ఒక అండర్ వాటర్  సబ్ మెరైన్ ను కరాచీ నుండి బంగ్లాదేశ్ తీరానికి పంపుతుంది పాకిస్తాన్ నేవీ. కాని భారత జలాలను కాపల కాస్తున్న భారత యుద్ధ వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ని చిత్తు చేయకుండా బంగ్లాదేశ్ తీరం చేరడం కుదరదని భావించిన ఘాజీ  సబ్ మెరైన్ భారత యుద్ధ వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ తో పాటు వైజాగ్ ఓడరేవును కూడా పేల్చేయాలని కుట్ర పన్నుతుంది. కాని ఇంటెలిజెన్స్ ద్వారా ముందే ఈ సమాచారం తెలుసుకొన్న భారతీయ నేవీ, ఘాజీ ని ఎదుర్కొనడానికి భారతీయ  సబ్ మెరైన్ ఎస్21 ను సముద్రంలోకి పంపుతుంది. 18 రోజుల పాటు నీటిలో జరిపిన పోరాటంలో భారతీయ సబ్ మెరైన్ ఎస్21  పాక్‌  సబ్ మెరైన్ ఘాజీని ఎలా ఒడించి, విశాఖపట్నం తీరాన్ని ఎలా కాపాడింది అనేదే కథ.

అలజడి విశ్లేషణ:

భారత్, పాక్ మధ్య యుద్ధం అనగానే భావోద్వేగాలకు పెద్ద పీట ఉంటుంది వాటిని అందుకోవడంలో మరియు చరిత్ర లో పెద్దగా చెప్పుకోనీ కథను ఎంచుకొని దానిని విజయతీరాలకు చేరచడంలో కొత్త దర్శకుడు సంకల్ప్ విజయం సాధించాడనే చెప్పాలి. భారత్, పాక్ మధ్య జరిగిన  యుద్ధాల గురించి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో మొదలైన సినిమా,  మొదటి అర్ధ భాగంలో పాత్రలను పరిచయం చేసే క్రమంలో కెప్టెన్‌ రణ్‌ విజయ్‌సింగ్‌ (కె.కె.మీనన్‌), లెఫ్టినెంట్‌ కమాండర్‌ అర్జున్‌ (రానా) మధ్య జరిగే సంఘటనలు ఆకట్టుకుంటాయి. ప్రారంభం తప్పితే మిగతా 90% సినిమా నీటిలోపల సబ్ మెరీన్ లోనే సాగుతుంది. సబ్ మెరైన్ లోపలి సెట్టింగ్ తో పాటు, సబ్ మెరైన్ అంతర్భాగాన్ని, దాని పని తీరు, అందులోని పాత్రల పని తీరును ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రీకరించారు. కొంచెం నెమ్మదిగా సాగుతున్న కథ రెండవ అర్ధ భాగంలో ఊపందుకుంటుంది. ఘాజీ, ఎస్21 ల మధ్య యుద్ధ విన్యాసాలు అలరిస్తాయి. కమర్షియల్ హంగులు లేకపోయినా కూడా ఫర్ఫెక్ట్ స్క్రీన్‌ప్లేతో, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో రెండు గంటలు ప్రేక్షకులను ఇంకో లోకం లోకి తీసుకెళ్ళి ప్రేక్షకుల భావోద్వేగాలను రగిలించడంలో ఘాజీ విజయవంతం అయ్యింది.

నటీనటుల పనితీరు:

రానా: కమాండర్ అర్జున్ పాత్రలో రానా పరిణితి చెందిన నటనతో ఆకట్టుకున్నాడు. కొత్త దర్శకుడితో ఇలాంటి చాలెంజింగ్ సబ్జెక్ట్ ను ఎంపిక చేసుకున్నందుకు ముందుగా రానా ను అభినందించాలి.

కె.కె మీనన్: కె.కె మీనన్ కీలకమైన కెప్టెన్ రాణ్ విజయ్ సింగ్ పాత్రలో అధ్బుతంగా నటించాడు.. మొదటి భాగంలో తన వెర్సటైల్ పర్ఫార్మెన్స్ తో సినిమాకు ప్లస్ అయ్యాడు.

తాప్సీ: తాప్సీకి సినిమాలో పెద్దగా ఇంపార్టెన్స్ ఏమి లేదు.

ఇంకా ఈ చిత్రంలో నటించిన అతుల్ కులకర్ణి, సత్యదేవ, రవివర్మ, భరత్ రెడ్డి, ప్రియదర్శి లు తమ పాత్రలకు న్యాయం చేశారు.

ప్లస్ పాయింట్స్:

  • కథ(ఎవరికీ తెలియని చరిత్ర)
  • సబ్ మెరైన్ సెట్టింగ్స్
  • రానా నటన
  • యుద్ధ సన్నివేశాలు
  • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

  • అర్ధం కానీ టెక్నికల్ అంశాలు
  • నెమ్మదిగా సాగే ఫస్టాఫ్
  • యుద్ధ సన్నివేశాలు భారీగా లేకపోవటం

పంచ్ లైన్: తెలుగు సినిమా చరిత్రలో మరో అధ్యయనం ఈ ఘాజీ

(Visited 2,209 times, 59 visits today)