EDITION English తెలుగు
ఈ రోజు: 18-10-2018 (గురువారం) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?   ఈ రోజు: 18-10-2018 (గురువారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   సుప్రీం మరోకీలక నిర్ణయం: వెంటనే డైవర్స్ తీసుకోవచ్చు   రెండు వారాల్లోనే హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ…ఐదుగురు మృతి   ఈ రోజు: 17-10-2018 (బుధవారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   హాస్పిటల్స్‌లో రోగుల ప‌క్క‌నే ఉంచే హార్ట్ బీట్ మెషిన్‌ను ఏమ‌ని పిలుస్తారో, అందులో రీడింగ్స్‌ను ఎలా చ‌ద‌వాలో తెలుసా..?   ఆరోగ్యం,భోజ‌నం, చ‌దువు, అంతా…..ఈ వాత్స‌ల్యం సంస్థే అండ‌గా నిల‌బ‌డ‌తుది   'తిత్లీ' బాధితులకు సంపూర్ణేష్ బాబు, విజయ్ దేవరకొండ, తారక్‌, కల్యాణ్‌రామ్‌ సాయం   మనుషుల్లో మానవత్వం గురించి అబ్దుల్ కలాం చివరిసారి చెప్పిన కథ.... తప్పక చదవండి.   కొన్ని యూట్యూబ్‌ చానెళ్లపై గీతామాధురి సీరియస్‌ వార్నింగ్‌

నాన్నా..! తాగుడు మానవా?: కన్నీళ్లు పెట్టించిన చిన్నారి ఆఖరి కోరిక.

Author:

మధ్యం ప్రపంచమంతా ఉన్న్నదే అయినా మనలాంటి అభివృద్ది చెందుతున్న దేశాలకి ఈ అలవాటు ప్రమాదకరమైందే. ఖజానాలకోసం ప్రభుత్వాలూ, ల్కాభాల కోసం కంపెనీలూ కారణాలు ఏవైతేనేం ఇక్కడ ఒక విధంగా మనుషుల ప్రాణాలమీదా, వారి ఆర్థిక వనరులమీదా లిక్కర్ వ్యాపారం నిలబడుతోంది. మధ్య తరగతి, దిగువమధ్య తరగతి వర్గాలే మన దేశ లిక్కర్ సంస్థల టార్గెట్ అన్నది నమ్మలేని చేదునిజం, 90% మధ్యం వాడుతున్నది ఈ వర్గాలే. అలా ఇంత గొప్ప చరిత్ర ఉన్న భారత దేశంలో రోజుకి లక్షల లీటర్ల విషాన్ని చిమ్ముతూనే ఉన్నారు.

తండ్రితో తాగుడు మాంపించాలనుకున్న ఒక చిన్నారి ఏం చేసిందో తెలుసా..? సాక్షాత్తూ తన ప్రాణాన్నే తీసుకుంది.. అవును ఇంతకీ ఏం జరిగిందంటే….. కుటుంబసభ్యుల కథనం ప్రకారం, చిత్తూరుజిల్లా తిరుపతి రూరల్‌ మండలం రజక కాలనీకి చెందిన సరస్వతి, శ్రీనివాస్‌ దంపతుల కుమార్తె భార్గవి. సరస్వతి స్విమ్స్‌ ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేస్తుండగా, శ్రీనివాస్‌ ఫొటోగ్రాఫర్‌. తాగుడుకు బానిసయి, తరచూ భార్యతో గొడవపడేవాడు. ఇదంతా చూస్తూ, పెరిగిన భార్గవి మద్యం అంటే ద్వేషం పెంచుకుంది. మద్యం మానాలని తండ్రికి పదేపదే నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఈ సమస్యపై ‘ఐద్వా’ అనే మహిళా సంఘం ప్రదర్శిస్తున్న వీధి నాటకాల్లో తానూ పాత్రధారి అయింది . సెలవుల్లో, ఖాళీ రోజుల్లో ఆ సంస్థ తరఫున రాష్ట్రమంతా తిరిగి ప్రదర్శనలు ఇచ్చేది. గత నెల జనవరి 31వ తేదీన మరోసారి తండ్రి తాగిరావటం తో మళ్ళీ తండ్రితో మధ్యం మానేయమని అడిగింది. అయినా అతను అంగీకరించకపోవటం తో.. బెదిరిద్దామనుకుందో…నిజంగానే జీవితం మీద అసహ్యం వేసిందో గానీ తన ప్రాణాలు తీసుకునంది.
20180203_151551

‘ నువ్వు తాగుడు మానతావా లేక నన్ను ఈ ఎలుకలమందు తిని చావమంటావా’ అని నిలదీసింది. ఇంతలో అక్కడికొచ్చిన తల్లి.. భార్గవి చేతిలోని ఎలుకలమందుని లాగి, కింద పడేసింది. అయితే, బెదిరింపులో భాగంగా అప్పటికే కొంత ఎలుకలమందుని భార్గవి నోట్లో పెట్టుకొంది. ఆ మందు ప్రభావంతో కొద్దిగా తాను స్పృహ తప్పుతానని, దీంతో తన తండ్రి భయపడిపోయి, ఇకముందు తాగబోనని హామీ ఇస్తాడని అనుకొంది. అయితే, ఈ ఆలోచనే ఆమెను ఆపదలో పడేసింది. తాను మందు తిన్న విషయం వెంటనే చెప్పకపోడంతో, తల్లిదండ్రులూ సకాలంలో స్పందించలేకపోయారు. దీంతో భార్గవి తీవ్ర అనారోగ్యానికి గురయింది. మూడురోజులు స్విమ్స్‌లో చికిత్స అందించినా, లాభం లేకపోయింది. తనకుటుంబాన్ని విషాదంలో ముంచి, అర్ధంతరంగా చనిపోయింది. మద్యం అలవాటు మానుకోకపోతే, చనిపోతానని తండ్రిని బెదిరించింది. దానికోసమని కొద్దిగా ఎలుకలమందు తిన్నది. అది వికటించడంతో, మూడురోజులు మృత్యువుతో పోరాడి శుక్రవారం కన్నుమూసింది. ఇంట్లో తండ్రిపై మద్యం వ్యతిరేక ఉద్యమం మొదలుపెట్టి, సమాజాన్నీ కదిలించే స్థాయికి చేరుకొన్న 15 సంవత్స్రాల భార్గవి పోరాటం, చివరకు విషాదాంతంగా ముగిసింది.
ఇప్పుడు భార్గవి ఘటన తరువాత అయినా…. మార్పు వస్తుందా? కనీసం ఆమె తండ్రిలో అయినా… ఒక్కరిలో అయినా?? మరో భార్గవి తండ్రి అయినా మారతాడా? అంటే… ఈ ప్రశ్నకి సమాధానం, పరిష్కారం మనందరికీ తెలిసిందే.. మరి ఏమవుతుందో చూద్దాం.

(Visited 269 times, 300 visits today)