EDITION English తెలుగు
Home / General / అమ్మాయి ప్రాణాలు తీసిన వాట్సాప్ మెసేజ్..!

అమ్మాయి ప్రాణాలు తీసిన వాట్సాప్ మెసేజ్..!

Author:

ఇద్దరు స్నేహితుల మధ్య వాట్సాప్ లో జరిగిన చాటింగ్ ఒక అమ్మాయి ప్రాణాలు పోయేలా, మరొకరు జైలుపాలైయ్యేలా చేసింది, కర్ణాటకలోని చిక్కమగళూరు సమీపంలోని మూడిగెరె ప్రాంతంలో డిగ్రీ చదువుతోన్న ధన్యశ్రీ(20) అనే యువతి ఓ ముస్లిం యువకుడితో స్నేహంగా ఉండేది. అది నచ్చని ధన్యశ్రీ మరొక స్నేషితుడు భజరంగ్ దళ్ కు చెందిన సంతోష్ అనే యువకుడు…..ఆ ముస్లిం యువకుడితో స్నేహాన్ని మానుకోమని ధన్యశ్రీని వారించాడు. నేను ఒక ముస్లిం యువకుడిని ప్రేమించడం పాపమా ? అంటూ ధన్యశ్రీ ప్రశ్నించింది. వీరిద్దరి మధ్య వాట్సప్ చాటింగ్ లో ఆ చర్చ తారస్థాయికి చేరింది.

girl-sucide-over-whatsapp-messege

హిందువులతోనే స్నేహం చేయాలనీ.. వారినే పెళ్లి చేసుకోవాలని ముస్లింలు లవ్ జిహాద్ పేరుతో హిందువులని ప్రేమలోకి దింపి మోసం చేస్తున్నారని వారి ఉచ్చులో పడకూడదని సంతోష్ ధన్యశ్రీకి వార్నింగ్ ఇచ్చాడు. అతడి మాటలు నచ్చకపోవడంతో…..‘ఐ లవ్ ముస్లిమ్స్’ అని ముస్లిం యువకుడితో కలిసి దిగిన ఫొటో పెట్టి మరీ ధన్యశ్రీ అతనికి రిప్లై ఇచ్చింది. సంతోష్ ఆ ఫోటోని సంఘ్ పరివార్, భజరంగ్ దళ్ గ్రూప్ లకు షేర్ చేసాడు, దీంతో ఆ ఫోటోని చూసిన భజరంగ్ దళ్ నాయకులూ కొంతమంది ధన్యశ్రీ ఇంటికి వెళ్లి మరి ఆ ముస్లిం యువకుడితో స్నేహం చేయవద్దని
ఇంట్లో వాళ్ళని బెదిరించారు.

తన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడం, భజరంగ్ దళ్ నాయకులూ బెదిరింపులతో తీవ్ర మానసిక వేదనకి గురైన ధన్యశ్రీ భజరంగ్ దళ్ కార్యకర్తలు తనను మానసికంగా వేధింపులకు గురి చేశారని సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది, ఈ కేసుకు సంబంధించి ఐదుగురి మీద ఎఫ్ ఐఆర్ నమోదు చేశామని అనీల్ రాజ్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

(Visited 1,194 times, 44 visits today)