EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / Entertainment / గౌతమ్ నంద రివ్యూ & రేటింగ్.

గౌతమ్ నంద రివ్యూ & రేటింగ్.

గౌతమ్ నంద రివ్యూ రేటింగ్

Alajadi Rating

2.5/5

Cast: గోపీచంద్‌, హన్సిక, కేథరిన్‌, తనికెళ్ల భరణి, ముఖేష్‌ రుషి తదితరులు

Directed by: సంపత్‌ నంది

Produced by: భగవాన్ - పుల్లారావు

Banner: శ్రీ బాలాజీ సినీ మీడియా

Music Composed by: తమన్‌

లౌక్యం సినిమాని మినహాయిస్తే గత కొన్ని సంవత్సరాల నుండి గోపీచంద్ కు సరైన విజయాల్లేవు. అతను చివరగా చేసిన ‘సౌఖ్యం’ చాలా చేదు అనుభవాన్ని మిగిల్చింది. మరోవైపు ‘రచ్చ’ సినిమాతో సత్తా చాటినప్పటికీ.. ‘బెంగాల్ టైగర్’ ఆశించిన ఫలితాన్నివ్వని నేపథ్యంలో దర్శకుడు సంపత్ నంది కూడా మళ్లీ తనేంటో రుజువు చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులలో వీళ్లిద్దరూ కలిసి చేసిన సినిమా ‘గౌతమ్ నంద’. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘గౌతమ్ నంద’ ఎలా ఉందో మీరు ఓ లుక్కేయండి..

కథ:

గౌతమ్ (గోపీచంద్) ఓ బిలియనీర్. ఐశ్వర్యంలో పుట్టి అందులోనే పెరిగిన అతడికి ఓ దశలో జీవితం మీద విరక్తి పుడుతుంది. నిజమైన ప్రేమకు.. భావోద్వేగాలకు తావు లేని తన జీవితాన్ని చాలించాలనుకుంటాడు. మరోవైపు అచ్చం గౌతమ్ లాగే ఉండే నందకిషోర్ బస్తీలో పుట్టి పెరుగుతాడు. అతడికి అనేక ఆర్థిక సమస్యలుంటాయి. దీంతో అతనూ చనిపోవాలనుకుంటాడు. ఆ సందర్భంలోనే గౌతమ్-నంద ఎదురుపడతారు. ఒకరి గురుంచి మరొకరు తెలుసుకున్నాక వారు ఏమి చేసారు..? ఆ ఇద్దరికీ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. వీళ్ల జీవితాలు ఎలాంటి మలుపు తీసుకున్నాయి అన్నది మిగతా కథ.

అలజడి విశ్లేషణ:

‘‘డబ్బు ముఖ్యమే కానీ అదొక్కటే ముఖ్యం కాదు.. దాని కంటే విలువైన వస్తువులు.. విషయాలు జీవితంలో చాలా ఉంటాయి. వాటికి గౌరవం ఇవ్వాలి. కుటుంబ బంధాలు.. బాంధవ్యాలు నిలబెట్టుకోవాలి’’ అనే విషయాన్ని స్పృశిస్తూ కమర్షియల్‌ కోటింగ్‌ ఇస్తూ గౌతమ్ నంద సినిమా సాగింది, దర్శకుడు మొదటి భాగం వరకు స్టైలిష్ మేకింగ్ తో మొదటి భాగాన్ని బాగానే డీల్ చేసాడు.

ద్వితీయార్థంలో లాజిక్ లన్ని మరిచి రొటీన్ తెలుగు సినిమాలోకి స్క్రీన్ ప్లే ని నడిపించి ఎమోషనల్ గా తీర్చిదిద్దాడు, ఓ దశ వరకు కథను మామూలుగా నడిపించి.. ఉన్నట్లుండి ట్విస్టు ఇచ్చి ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడం టాలీవుడ్లో చాలామంది దర్శకులు వేస్తున్న ఎత్తుగడ. సంపత్ నంది కూడా ‘గౌతమ్ నంద’లో అదే ట్రిక్ ప్లే చేశాడు. కానీ ఆ ట్విస్టు థ్రిల్ ఆ సమయానికి కొంచెం థ్రిల్ చేస్తుంది కానీ.. అది ప్రేక్షకులకు మింగుడుపడదు. ఓ దశ వరకు కథను మామూలుగా నడిపించి.. ఉన్నట్లుండి ట్విస్టు ఇచ్చి ప్రేక్షకుల్ని థ్రిల్ చేఓ దశ దాటాక రిపిటీటివ్ గా అనిపించే సన్నివేశాలు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి.

చివరగా సినిమా మొత్తం రిచ్ గా , గ్లామరస్ , కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉన్నప్పటికీ లాజిక్ లేని కథనంతో ప్రేక్షకులకి యావరేజ్ గా అనిపిస్తుంది.

నటీనటుల పెర్ఫార్మన్స్:

గోపీచంద్ తన కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు, సినిమాలో అతడిది వన్ మ్యాన్ షో. పూర్తి విరుద్ధమైన గౌతమ్-నంద పాత్రల్లో అతను మెప్పించాడు. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్లలో అద్భుతంగా చేసాడు, ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పటికీ వారికి ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ లభించలేదు, క్యాథెరిన్ తెస్రా గ్లామర్ తో ఆకట్టుకుంది, బిత్తిరి సత్తి కొన్ని నవ్వుల్ని పంచాడు. భరణి.. చంద్ర మోహన్‌తో ఇలా అందరూ సీనియర్లే కావటంతో ఎవరి పాత్రకు వాళ్లు న్యాయం చేశారు.

ప్లస్ పాయింట్స్ :

  • గోపీచంద్ నటన
  • మ్యూజిక్
  • డైలాగ్స్

మైనస్ పాయింట్స్ :

  • సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే
  • లాజిక్ లు మిస్సవ్వడం

Comments

comments