Home / Inspiring Stories / మెదటి సారి రైలు ద్వారా నీటిని సరఫరా చేసి చరిత్ర సృష్టించిన మోడీ ప్రభుత్వం.

మెదటి సారి రైలు ద్వారా నీటిని సరఫరా చేసి చరిత్ర సృష్టించిన మోడీ ప్రభుత్వం.

Author:

water train

కరువు పీడిత ప్రాంతం లాతూర్‌లో ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొంది. అందుకు కారణం అక్కడకు ఒక ప్రత్యేక రైలు రావడమే. 5లక్షల లీటర్ల నీటితో లాతూర్ రైల్వేస్టేషన్‌కు ఆ రైలు చేరింది. మరేక్‌వాడలోని లాతూర్ ప్రాంతం గత కొన్నాళ్లుగా తీవ్ర నీటి ఎద్దడితో సతమతమవుతోంది. గుక్కెడు నీళ్ల కోసం జనం గొంతెండిపోయింది. ఈ నేపథ్యంలో మంచి నీటి తరలింపునకు రైల్వేశాఖ ముందుకు వచ్చింది. ప్రత్యేక రైలు ద్వారా నీటిని తరలిస్తోంది. తొలి నీటి రైలుకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ట్రైన్ డ్రైవర్లను పూలమాలలు వేసి ప్రత్యేకంగా సత్కరించారు. పశ్చిమ మహారాష్ట్రలోని మీరజ్‌లో మొత్తం పది బోగీలలో నీటిని నింపుకుని ఈ ప్రత్యేక రైలు ద్వారా తరలించారు. ఒక్కోబోగీలో 50వేల లీటర్ల నీరు పడుతుంది. నాలుగున్నర లక్షల మందికి తలకు 12 లీటర్ల నీటిని అందజేయడానికి రెండు రైళ్ళు 1200 కిలోమీటర్ల ప్రయాణాన్ని ప్రారంభించాయి. మహారాష్ట్రలోని లాతూర్ లో నీళ్ళకోసం హింసాత్మక సంఘటనలు పెరిగిపోతూండటంతో 144 సెక్షన్ విధించారు. తక్షణ సహాయక చర్యగా రాజస్తాన్ నుంచి నీళ్ళ రైళ్ళు బయలుదేరాయి.

మరట్వాడా ప్రాంతంలోని లాతూరుతో సహా అదే రాష్ట్రంలో బుందేల్ ఖండ్, విదర్భ ప్రాంతాల్లో కూడా తీవ్రమైన నీటి ఎద్దడిని స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సమీక్షించారు. ఫలితంగానే 54 వేల లీటర్ల చొప్పున పట్టే 50 వ్యాగన్లతో రెండు రైళ్ళు రాజస్తాన్ నుంచి లాతూరు ప్రయాణమయ్యాయి. గత కొన్నేళ్లుగా వర్షాలు లేక మరఠ్వాడాలోని జలాశయాలు ఎండిపోయి దుర్భర కరువు పరిస్థితి నెలకొంది. గత రెండు నెలలుగా చాలామంది రైతులు, పేదలు ఊళ్లు వదలి బతుకుతెరువు కోసం ముంబై చేరుకున్నారు. కూలీ పని చేసుకుంటూ కుటుంబాలను సాకుతున్నారు. మరాఠ్వాడాలో కరువు కారణంగా గత ఏడాది 3 వేల 228 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. లాతూర్‌తో పాటు పరిసర గ్రామాలకు నీటిని సప్లయ్‌ చేసే డామ్‌ పూర్తిగా అడుగంటిపోయింది. దీంతో ఇక బావులు, బోరు బావులే జనానికి దిక్కయ్యాయి. ఆ బావుల నుంచి జనానికి సరిపడా నీళ్లు సప్లయ్‌ కావడం లేదు. తాగునీరు కూడా లేని దుర్భిక్షం తీవ్రత ఇది.

ప్రభుత్వాలే వ్యవసాయ అభివృద్ధి క్రతువు మొదలు పెట్టాక, ఒక వాన ఇచ్చిన తేమతోనే విగగకాసిన ఆరుతడి జొన్న ఎన్నినీళ్ళైనా చాలని వరి ముందు ఓడిపోయింది. ప్రాజెక్టుల ముందు చెరువులు మాయమైపోయాయి. బోర్లు వచ్చాక నేల మీద నీరే కనిపించకుండా పోయింది. దాహం తీరని వంగడాలు నేలను పిప్పిగా మార్చేస్తున్నాయి. పురుగుమందులు, రసాయన ఎరువులు భూమిని మందు పాతరగా మార్చేస్తున్నాయి.

(Visited 2,464 times, 37 visits today)