EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / Latest Alajadi / గుంటూరోడు రివ్యూ & రేటింగ్.

గుంటూరోడు రివ్యూ & రేటింగ్.

gunturodu perfect review and rating

Alajadi Rating

2.25/5

Cast: మంచు మనోజ్‌.. ప్రగ్యాజైశ్వాల్‌.. సంపత్‌.. కోట శ్రీనివాసరావు.. రాజేంద్ర ప్రసాద్‌.. రావు రమేశ్‌ తదితరులు

Directed by: ఎస్‌.కె. సత్య

Produced by: శ్రీవరుణ్ అట్లూరి

Banner: క్లాప్స్‌ అండ్‌ విజిల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌

Music Composed by: డి.జె. వసంత్‌

మంచు మనోజ్‌ వెండితెరపై మాస్‌ అవతారంలో కనిపించుండొచ్చు కానీ.. ఫక్తు మాస్‌ కథతో మాత్రం సినిమా చేయలేదు. అందుకే తనకి కొత్తగా ఉంటుందని ఈసారి ఓ పక్కా వాణిజ్య ప్రధానమైన కథని ఎంచుకొని ‘గుంటూరోడు’ చేశారు. ఈరోజు విడుదల అయిన గుంటూరోడు సినిమా ఎలా ఉందో మీరు తెలుసుకోండి..!

కథ : 

కన్నా (మంచు మనోజ్) మంచి ఎనర్జీతో ఉండే కుర్రాడు. తన ముందు ఎలాంటి అన్యాయం జరిగినా సహించని కన్నా అవతల ఎలాంటి వాడు ఉన్నా సరే తలపడతాడు. ఈ క్రమంలో ఓ పార్టీలో అనుకోకుండా క్రిమియల్ లాయర్ శేషు (సంపత్ రాజ్)తో గొడవపడతాడు. ఈగోయిస్ట్ అయిన శేషు తనను కొట్టిన కన్నాని చంపాలని ప్లాన్ చేస్తాడు. మరో పక్క మొదటి చూపులోనే కన్నా అమృతని చూసి ఇష్టపడతాడు. కన్నా, అమృత ల మధ్య ప్రేమకి శేషు అడ్డుపడతాడు,  ఓ పక్క శేషు ఎమ్మెల్యేగా కావాలని కలలు కంటుంటాడు. కన్నా స్కెచ్ వేసి అతన్ని ఎమ్మెల్యే కాకుండా చేస్తాడు. చివరు శేషు కన్నాల గొడవ ఎలా ముగిసింది..? కన్నా, అమృత ల ప్రేమని శేషు ఎందుకు అడ్డుకున్నాడు..? చివరికి కన్నా, అమృతని పొందడా..? అన్నది అసలు కథ.

అలజడి విశ్లేషణ:

సగటు కమర్షియల్‌ సినిమా ఇది. కథా కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. పాటలు, పోరాటాలు, లవ్‌ట్రాక్‌, హీరో-విలన్‌ మధ్య శత్రుత్వం వంటి అంశాలతో ఒక ఫార్ములా ప్రకారం సినిమా సాగిపోతుంది. కన్నా బాల్యాన్ని పరిచయం చేస్తూ చిరంజీవి వాయిస్ ఓవర్‌తో సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలన్నీ మామూలే. హీరోయిన్‌ని చూసి హీరో ప్రేమ‌లో ప‌డిపోవ‌డం, ఆమె మ‌న‌సులో స్థానం సంపాదించ‌డం కోసం స్నేహితుల‌తో క‌లిసి కొన్ని ఎత్తుగ‌డ‌లు వేయ‌డం, ఇలా ఫస్ట్ హాఫ్ నడిచిపోతుంది.

సెకండ్ హాఫ్ లో విలన్ కి, హీరో కి మధ్యలో వచ్చే సన్నివేశాలు మాస్ ప్రేక్షకులని అలరిస్తాయి, హీరో విల‌న్‌ల ఎత్తులు పైఎత్తుల‌తో క‌థ వేగం పుంజుకొంటుంది కానీ… ఆ స‌న్నివేశాల్లో ఆస‌క్తికరమైన అంశాలేవీ లేక‌పోవ‌డంతో సినిమా చ‌ప్ప‌గా సాగుతున్న‌ట్టు అనిపిస్తుంది. తండ్రి-కొడుకు, అన్నా-చెల్లెలు వంటి బంధాలు.. ఆ నేపథ్యంలో సన్నివేశాలున్నా భావోద్వేగాలు మాత్రం పండవు. కామెడీ కూడా అంతంత మాత్రమే. కాకపోతే మనోజ్‌కే ఈ సినిమా కాస్త కొత్తగా అనిపిస్తుంది. ఆయ‌న క‌నిపించిన విధానం, ఆయ‌న చేసిన పోరాట ఘ‌ట్టాలు మాస్ ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తాయి. క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు చాలా సిల్లీగా అనిపిస్తాయి.

ప్లస్ పాయింట్స్ :

  • మంచు మనోజ్
  • యాక్షన్ ఎపిసోడ్స్
  • ఇంటర్వెల్ కి ముందు సన్నివేశాలు.

మైనస్ పాయింట్స్ :

  • కథ, స్క్రీన్ ప్లే
  • కామెడీ వర్క్ అవుట్ అవ్వలేదు.
  • క్లైమాక్స్

పంచ్ లైన్ : ఈ గుంటూరోడు రొటీన్ కథకి మాస్ మసాలా కలుపుకొని వచ్చాడు..!

Comments

comments