Home / Reviews / గురు రివ్యూ & రేటింగ్.

గురు రివ్యూ & రేటింగ్.

Guru Movie Review

Alajadi Rating

3.25/5.0

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: వెంకటేష్‌, రితికా సింగ్‌, ముంతాజ్‌. నాజర్‌, తనికెళ్ల భరణి, తదితరులు

Directed by: సుధ కొంగర

Produced by: ఎస్‌.శశికాంత్‌

Banner: వై నాట్‌ స్టూడియోస్‌

Music Composed by: సంతోష్‌ నారాయణన్‌

అందరూ సినిమా హీరోల అభిమానులు తమ హీరోతో పాటు సమానంగా ఇష్టపడే హీరోలలో దగ్గుబాటి వెంకటేష్  ముందు వరుసలో ఉంటారు. ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలతో అందరిని అలరించిన వెంకీ తన పంధాకు విభిన్నంగా ఇప్పుడు క్రీడా నేపథ్యంలో సాగే గురు సినిమాలో నటించారు. వై నాట్‌ స్టూడియోస్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు సుధ కొంగర దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌లో మాధవన్ నటించిన సాలా ఖడూస్ కి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా ఏలా ఉందో చదవండి.

కథ:

తన ప్రాణం కన్నా బాక్సింగ్ ను ఎక్కువ ప్రేమిస్తాడు ఆది(వెంకటేష్), అతని టాలెంట్, నిజాయితి, కోపం బాక్సింగ్‌ అకాడమీలోని పెద్దలకు నచ్చదు దానితో అతన్ని ఎలగైనా తొక్కేయాలని నిర్ణయించుకున్న బాక్సింగ్‌ అకాడమీలోని  పెద్దలు ఆదిని విశాఖపట్నంకు ట్రాన్స్ ఫర్ చేసి అక్కడ అమ్మాయిలకు బాక్సింగ్‌ కోచ్‌గా నియమిస్తారు. అలా వైజాగ్ చేరుకున్న ఆదికి అక్కడి బస్తీలో కూరగాయలు అమ్ముకునే రామేశ్వరి (రితికా సింగ్) తెగువ నచ్చి ఆమెకు బాక్సింగ్ నేర్పడం మొదలుపెడుతాడు. ఆదిలోని తపనను అర్ధం చేసుకోలేని రామేశ్వరి కావాలనే మ్యాచ్‌లు ఓడిపోతుంటుంది అంతే కాక బాక్సింగ్ ఫెడరేషన్ లో ఉన్న ఇతరులు కూడా ఆది ప్రయత్నాలకు అడుగడుగునా అడ్డుపడుతుంటారు. ఇన్ని అడ్డంకులు దాటి ఆది రామేశ్వరి ని ఏలా మార్చాడు? ఛాంపియన్‌గా మారడానికి రామేశ్వరి కి ఏలాంటి బాక్సింగ్ నేర్పాడనేదే మిగిలిన కథ.

అలజడి విశ్లేషణ:

తెలుగులో క్రీడా నేపథ్యంలో వచ్చిన చిత్రాలు చాలా తక్కువ. ఒకవేళ వచ్చినా.. క్రీడ ఓ అదనపు అంశంగా ఉంటుందంతే. దాని చుట్టూ ప్రేమ, వినోదం, యాక్షన్‌ అంటూ కమర్షియల్‌ అంశాలన్నీ జోడించేస్తుంటారు. కానీ ‘గురు’ సినిమాలో అలా కాదు సినిమా మొత్తాన్ని బాక్సింగ్ చుట్టూనే నడిపించారు, కమర్షియల్ హంగుల, హీరో ఇమేజ్ కోసం అనవసరపు సన్నివేశాలు లేకపోవడం ఈ సినిమాకి ఉన్న పెద్ద సానుకూలత.

హిందీలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అయిన ‘సాలా ఖడూస్‌’ సినిమాకి ఇది రీమేక్, వెంకటేష్ తప్ప మిగిలిన వాళ్ళు అంత సాలా ఖడుస్ లో ఉన్నవాళ్లే, స్పోర్ట్ ఆధారంగా తెరకెక్కిన సినిమాలలో ఎమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎమోషన్ వర్క్ అవుట్ అయితేనే సినిమా నిలబడుతుంది, గురు సినిమాలో ఉన్న ఎమోషన్ కి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు, వెంకటేష్ , రితిక సింగ్ మధ్యలో వచ్చే కొన్ని సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, కూరగాయలు అమ్ముకునే అమ్మాయిని బాక్సర్ గా చేయడం కోసం వెంకటేష్ చేసే ప్రయత్నాలు ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి, అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్ , క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలిచాయి, కానీ అక్కడక్కడా తెలుగు నేటివిటీ మిస్ అవ్వడం ఒక మైనస్ పాయింట్.

మొత్తానికి హిందీ, తమిళంలో ముందే ఈ సినిమా చుసినవాళ్ళకి ఓ మాదిరిగా ఉంటుంది, కొత్తగా చూసేవాళ్ళకి అద్భుతంగా ఉంటుంది.

నటీనటుల పనితీరు:

వెంకటేష్ : ఈ సినిమాలో మనం ఒక కొత్త వెంకటేష్ ని చూస్తాం, ఎమోషనల్ సన్నివేశాలలో వెంకటేష్ ని మించిన వాళ్ళు లేరని మరోసారి నిరూపించాడు, సినిమా మొత్తం అద్భుతంగా నటించాడు.
రితిక సింగ్ : స్వతహాగా బాక్సర్ అయిన రితిక యాక్టింగ్ కూడా అదరగొట్టింది,

నాజర్, రఘుబాబు..మిగిలిన నటులంతా తమ పాత్రల మేరకు నటించారు.

ప్లస్ పాయింట్స్ :

  • కథ , స్క్రీన్ ప్లే
  • వెంకటేష్ , రితిక సింగ్ ల నటన
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
  • ఎమోషనల్ సీన్లు

మైనస్ పాయింట్స్ :

  • తెలుగు నేటివిటీ మిస్ అవ్వడం

పంచ్ లైన్: ఓయ్ గురు మంచి సినిమా తీశావయ్యా…! 

(Visited 2,649 times, 43 visits today)