Home / Latest Alajadi / గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?

గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?

Author:

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఓటు గల్లంతు అయ్యింది. తన ఓటుతోపాటు తన తండ్రి, సోదరి ఓటు కూడా గల్లంతైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌లో చెక్ చేసుకుని పోలింగ్ బూత్‌కు వెళ్లి చూసుకుంటే ఓటు గల్లంతయినట్లు పోలింగ్ సిబ్బంది చెప్పారని జ్వాలా తెలిపారు. తమ కుటుంబంలో మూడు ఓట్లు గల్లంతయ్యాయన్నారు. రెండు వారాల క్రితం తాము ఆన్‌లైన్‌లో చెక్ చేసుకున్నామని.. మరి ఎలా ఓట్లు మిస్సయ్యాయో అర్థం కావట్లేదని ఉందని గుత్తాజ్వాల పేర్కొన్నారు.

‘ఓటు వేయాలని వస్తే లిస్ట్‌లో పేరు లేదని చెబుతారా? పేర్లెందుకు లేవు? వాటినేమైనా కాకులు ఎత్తుకెళ్లాయా?’ అని పలువురు ఎన్నికల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబితాలో తన పేరు కన్పించకపోవడంతో ట్విటర్‌ వేదికగా అసహనాన్ని వెళ్లగక్కారు. ‘ఆన్‌లైన్‌లో చెక్‌ చేసినప్పుడు నా పేరు ఉంది. ఓటర్ల జాబితాలో పేరు కన్పించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇలా జాబితాలో ఓటర్ల పేర్లు లేనప్పుడు ఎన్నికలు ఎలా పారదర్శకంగా జరుగుతాయి’ అని జ్వాలా ప్రశ్నించారు.

(Visited 1 times, 9 visits today)