Home / General / జుట్టుకి రంగేస్తే… ఆస్తమా, కాన్సర్ వస్తుందా ?

జుట్టుకి రంగేస్తే… ఆస్తమా, కాన్సర్ వస్తుందా ?

Author:

ఒక వైపు కాలుష్యం.. మరో వైపు ఓ పద్ధతీ.. పాడూ లేని ఆహారపు అలవాట్లు. వీటికి తోడూ హార్మోన్ లోపం కురులకు శాపంగా మారి యుక్త వయస్సులోనే వయస్సు మళ్ళిన వారిగా మారిపోతున్నారు యువత. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటంతో.. ఏం చేయాలో తెలియక సెలూన్‌కి వెళ్లి నచ్చిన రంగును జుట్టుకు పట్టించడం అలవాటైపోయింది. ఇంకొంత మంది కుర్రకారు ఉన్న నల్ల జుట్టుని కూడా కాపడుకోకుండా స్టైలు, ఫ్యాషన్‌ కోసమని రకరకాల రంగుల్లో ముంచేస్తున్నారు తమ జుట్టుని. అయితే ట్రెండీ లుక్కుల కోసం జట్టుకు రంగులేస్తే కొన్ని రకాల జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.

color to hair

ఈ హెయిర్ డై లలో వాడే రసాయనాల వల్ల చర్మసంబంధమైన వ్యాధులు త్వరగా వచ్చే అవకాశముందని తాజా పరిశోధనలో తేలింది. వాడే రంగు వల్ల జుట్టు నిగనిగలాడినప్పటికీ, తర్వాత ఉన్న జుట్టు ఊడిపోవడమే కాకుండా, జుట్టు పొడిబారి బలహీనంగా తయారవుతుంది. ఈ హెయిర్ డై ఎక్కువగా వాడడం వల్ల అస్తమా వ్యాధి బారిన పడుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. అస్తమా ఉన్న వారు ఈ రసాయన రంగుల జోలికి పోవడమే ఉత్తమమనీ, ఇప్పటికే వాడుతున్నవారు వెంటనే మానేయడమే మంచిదంటున్నారు డాక్టర్లు. అంతేకాదు, ఈ హెయిర్ డై ఎక్కువగా వాడితే కాన్సర్ ముప్పు కూడా పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇక తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నవారు తప్పని పరిస్తితుల్లో జుట్టుకు రంగు వేయాలనుకుంటే మాత్రం, సంబంధిత వైద్యులని కలిసాకే వాడటం మంచిది. జుట్టుకి వేసే రంగులు కూడా రసాయనాలతో కూడినవి కాకుండా నేచురల్‌ ప్రొడక్ట్స్ నే వాడాలి. ప్రకృతి సిద్ధమైన రంగులు వాడితే రెండు మూడు నెలల వరకూ తెల్ల జుట్టు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఈ సహజ రంగుల వల్ల జుట్టు రంగు మారడంతో పాటు.. కుదుళ్లు బలంగా తయారౌతాయి. గోరింటాకు, అలోవెరా, ఉసిరి, మందార ఆకులు, మందార పువ్వులు, గుంటగలగర ఆకుల వంటి సహజ సిద్ధమైన ప్రకృతి వనరులను నేరుగా గానీ నూనె ద్వారా గానీ జుట్టుకు పట్టించడం మంచిదని సూచిస్తున్నారు డాక్టర్లు.

(Visited 1,076 times, 45 visits today)