Home / Entertainment / హ్యాపీ బర్త్ డే నయన్

హ్యాపీ బర్త్ డే నయన్

Author:

Nayan

డయానా మారియమ్ కురియెన్ ఉరఫ్ నయనతార అలియాస్ సౌతిండియన్ వీనస్. 1984 లో ఇదేరోజు స్వర్గం నుంచి దిగిన ఒక దేవకన్య ఆఫ్రోడైట్ దారితప్పి భూమ్మీదకొచ్చింది. కేరళ అందాలను చూసి వెళ్లలేక ఇక్కడే కొన్నాళ్ళుండాలనుకుందేమో ఇక్క డే ఒక పాపగా పుట్టేసింది అందమైన కళ్ళ ఆదేవకణ్య కి నయన అని అని పేరు పేట్టారు…. కొన్నాళ్ళ క్రితం కేరళలొ ఒక అభిమాని నయన తారకోసం అల్లిన కథ ఇది. కానీ అది కథేనా ఏమో నయనతారని చూస్తే అలా అనిపించదు బహుశా ఆ కథ నిజమే నేమో… నయన్ నిజంగా దేవకన్యేనేమో అందుకే నయన తార ని చూస్తే కళ్ళు తిప్పుకోలేం ఆ అద్బుతమైన సౌందర్యం లో పడి మునిగిపోతాం….. నయన తార నిజంగా దక్షిన భారత సినిమాకు దొరికిన ఒక తార అనే అనుకోవచ్చు…

డిల్లీ లో ఒక హైస్కూల్ లో చదువు పూర్తి అయ్యే సరికే మోడలింగ్ ఆఫర్లు కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ చేసే నయన్‌ను చూసిన మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ “మనసినక్కరే” అనుకున్నాడు నయన్ ను అడిగాడు “నా సినిమాలో నటిస్తావా?” ఓకే చెప్పింది నయన్. సినిమా పేరు కూడా ‘మనస్సినక్కరే’ హీరోయిన్ గా తొలిచాన్స్. కానీ సినిమా ఆడలేదు కానీ నయన్ చూసిన ప్రేక్షకుల కళ్ళలో మెరుపులు చూసిన మళయాలీ ఇండస్ట్రీ నయన్ లో ఉన్న స్పార్క్ ని కోల్పోవటానికి సిద్దంగా లేదు. వరుస అవకాశాలు ‘విస్మయతుంబట్టు’, ‘తస్కర వీరన్’, ‘రాప్పకల్’ వంటి సినిమాల్లో మోహన్‌లాల్, మమ్ముట్టి వంటి పెద్ద హీరోలతో చేసింది.

రజినీ చంద్రముఖి చేస్తున్నాడు నయన్ కి పిలుపొచ్చింది ఎక్కువ నిడివిలేదు.జ్యోతిక మైన్ రోల్ అయినా రజినీ పక్కన హీరోయిన్ అంటే మాటలా ఒప్పేసుకుంది. అమాయకంగానే కనిపించింది. సినిమా సూపర్ హిత్ నయన్ అమాయకమైన మొహం ఎవరూ మర్చిపోలేదు మోహం అలాంటిది… గజిని సినిమాకీ పిలుపొచ్చింది అప్పటికి నయన్ కొంచం పాపులర్ అయిపోయింది కూడా అయినా రెండో హీరోయిన సంకోచినచలేదు ఒప్పేసుకుంది “ఎక్స్ మచ్చీ వోయ్ మచ్చీ…” ఒక్కొక్కరికీ మతులుపోయాయ్. నయన్ విస్వరూపం చూసి అందం లో మునిగి మునకలేసీ వెర్రెక్కిపోయారు కుర్రాళ్ళు. ఇక నయన్ ప్రథాణం స్టార్ట్..అందరూ ఆ అందానికి దాసోహం అన్నవారే దక్షిణ భారత దేశం లో అందరు పాపులర్ అగ్ర,కుర్ర హీరోలతోనూ నటించేసింది. అందం తప్ప నటన్ రాదు అన్నవాళ్లకి సిమ్హ,శ్రీరామ రాజ్యం లతో సమాధానం చెప్పింది.

ఇప్పుడు నయన్ కి 30 పూర్తయ్యాయట నటిగా పదేళ్ళ పైనే ఔతోంది ఈ పదేళ్ళలోనూ నయన్ జీవితం లోకి ఎందరో వచ్చారూ వెళ్ళారు నయన్ ఏడ్చిందీ, నవ్విందీ, వివాదాలకు బాదపడిందీ మళ్ళీ నిలబడింది… ఔను నయన్ మామూలు ఆడపిల్ల కాదు మరి దేవకన్య తను మెరుస్తూనే ఉంటుంది మోహపు మత్తులో ముంచేస్తూనే ఉంటుంది.. ఇంతకీ ఆఫ్రోడైట్ అంటే ఎవరో తెలుసా గ్రీకుల అందాల దేవత.. నయనతార కి అలజడి తరఫున కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ…

(Visited 145 times, 41 visits today)