EDITION English తెలుగు
Home / health / బీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురుంచి తెలుసుకోండి.

బీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురుంచి తెలుసుకోండి.

Author:

వాతావరణం హాట్ హాట్‌గా ఉన్నప్పుడు ఒక చ‌ల్ల‌ని బీర్ కొడితే ఎలా ఉంటుంది? ఆ మ‌జాయే వేరు క‌దా! అవును, మ‌రి. మ‌జాగానే ఉంటుంది. అయితే దాని టేస్ట్ తెలిసిన వారికే ఆ మ‌జా అందుతుంది. లేదంటే అంద‌దు. అంటే డ్రింకింగ్‌ అల‌వాటు ఉన్న‌వారైతేనే బీర్ టేస్ట్‌ను ఎంజాయ్ చేయ‌గ‌లుగుతార‌ని అర్థం. కానీ మోతాదుకు మించి తాగితే బీర్‌తోనూ అన‌ర్థాలు త‌ప్ప‌వు, బీర్ తాగడం అనేది ఇప్పుడు చాలా మాములు విషయం అయిపోయింది, ఒకప్పుడు మందు తాగాలంటే అది చాలా పెద్ద తప్పుగా భావించేవారు, కాని ఇప్పుడు ఫ్రెండ్స్ కలిసిన, క్రికెట్ మ్యాచ్ ఉన్న, పండగలకి చుట్టాలు వచ్చిన, వీకెండ్ అయిన ఖచ్చితంగా బీరు పొంగాల్సిందే అన్నట్టుగా మారిపోయింది కాలం.

health-benefits-of-drinking-beer

ఏదైనా సరే మోతాదుగా తీసుకుంటే ఎటువంటి అనర్దాలు ఉండవు, మోతాదు మించితేనే అనారోగ్యం పాలు కావాల్సివస్తుంది, కాని బీరుని మితంగా తీసుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయని పరిశోధనలో తేలింది,ఆరోగ్యంగా ఉన్న మ‌గ లేదా ఆడ మ‌నిషి రోజుకు 12 ఔన్సుల (దాదాపు 350 ఎంఎల్‌) మోతాదులో బీర్ తాగితే దాంతో ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ట‌. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

గుండె జ‌బ్బులు:

హార్వ‌ర్డ్ స్కూల్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ వారు చేసిన పరిశోధనల ప్రకారం, బీరులో పాలీఫినాల్స్ అన‌బ‌డే ప‌వ‌ర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి గుండె సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతాయి.బీర్‌ను త‌గిన మోతాదులో సేవిస్తే చెడు కొలెస్ట్రాల్ త‌గ్గ‌డంతోపాటు మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.బీరు రక్త నాళాలని గట్టి పడకుండా చూసి, ర‌క్తం గడ్డ‌క‌ట్ట‌కుండా కాపాడుతుంది,దీని వ‌ల్ల హార్ట్ ఎటాక్స్ వంటివి వ‌చ్చేందుకు అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంది.

కిడ్నీల్లో రాళ్లు:

బీర్‌ను త‌ర‌చూ తాగడం వల్ల కిడ్నీల‌లో రాళ్లు ఏర్ప‌డే అవ‌కాశం కూడా త‌గ్గుతుంద‌ట‌. ఫిన్‌లాండ్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు చేసిన ప్ర‌యోగాల్లో ఈ విష‌యం వెల్ల‌డైంది. అంతేకాకుండా శ‌రీరంలోని విష ప‌దార్థాలు కూడా బ‌య‌టికి వెళ్లిపోతాయ‌ట‌. ప్ర‌ధానంగా కాల్షియం పేరుకుపోవ‌డం వ‌ల్ల ఏర్ప‌డే కిడ్నీ రాళ్ల‌ను అడ్డుకోవ‌డంలో బీర్ ముఖ్య పాత్ర పోషిస్తుంద‌ట‌.

ఎముక‌ల‌కు:

బీర్ల‌లో సిలికాన్ ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. ఇది ఎముక‌ల పోష‌ణకు ఎంత‌గానో అవ‌స‌ర‌మ‌వుతుంద‌ట‌. కాబ‌ట్టి బీర్‌ను తాగితే అందులోని సిలికాన్ వ‌ల్ల ఎముక‌ల‌కు బ‌లం చేకూరుతుంది. 2009లో టఫ్ట్స్ యూనివ‌ర్సిటీ చేసిన ప‌రిశోధ‌న‌ల్లో ఈ విష‌యం తెలిసింది.

వెంట్రుక‌ల సంర‌క్ష‌ణ‌కు:

బీర్‌లో విట‌మిన్ బి, ఈస్ట్ వంటివి పుష్క‌లంగా ఉంటాయి. దీని వల్ల బీర్ వెంట్రుక‌ల‌కు ఆరోగ్యాన్నిస్తుంది. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెర‌గ‌డంలో బీర్ ఉపయోగ‌ప‌డుతుంది.

జ్ఞాప‌క‌శక్తికి:

రష్ యూనివ‌ర్సిటీ మెడిక‌ల్ సెంట‌ర్ వారు చేసిన ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం త‌ర‌చూ బీర్ తాగుతుంటే జ్ఞాప‌క‌శ‌క్తి సంబంధిత స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు 23 శాతం వ‌రకు తగ్గుతాయ‌ట‌. అంతేకాదు బీర్ తాగ‌డం వ‌ల్ల మెద‌డులో కొత్త క‌ణాలు వృద్ధి చెందుతూ జ్ఞాప‌క‌శ‌క్తి, ఏకాగ్ర‌త, రీజ‌నింగ్ ప‌వ‌ర్ వంటివి పెరుగుతాయ‌ట‌. వృద్ధాప్యంలో అల్జీమ‌ర్స్‌, దెమెంతియా వంటి వ్యాధులను రాకుండా చూసుకోవ‌చ్చ‌ట‌.

ప్రోస్టేట్ క్యాన్స‌ర్‌కు:

బీర్‌లో క్యాన్స‌ర్‌ల‌కు వ్య‌తిరేకంగా పోరాడే ఔష‌ధ గుణాలు ఉన్నాయి. త‌గిన మోతాదులో బీర్‌ను తీసుకుంటే ప్రోస్టేట్ క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశం కూడా త‌క్కువ‌గా ఉంటుంద‌ట‌.

డ‌యాబెటిస్‌:

బీర్ల‌లో ఉండే ఆల్క‌హాల్ ఇన్సులిన్ సెన్సిటీవిటీని అధికం చేస్తుంద‌ట‌. దీని వ‌ల్ల డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయ‌ట‌. 2011లో హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు చేసిన ఓ రీసెర్చి ప్ర‌కారం త‌ర‌చూ త‌గిన మోతాదులో బీర్ల‌ను తాగుతున్న వారిలో టైప్ 2 డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు 25 శాతం వ‌ర‌కు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ట‌. బీర్ల‌లో ఉండే సాల్యుబుల్ ఫైబ‌ర్ డ‌యాబెటిస్ ఉన్న‌వారికి మేలు చేస్తుంద‌ట‌.

ఎన్ని బెనిఫిట్స్ ఉన్న తక్కువ మోతాదులో తాగితేనే అవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి, అదే పనిగా ఎక్కువ మోతాదులో బీర్లు తాగితే హార్ట్ సమస్యలతో పాటు, కిడ్నీ సమస్యలు వచ్చే ఆవకాశం ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు, సూపర్ స్టార్ రజినికాంత్ చెప్పిన్నట్టుగా భోజనం అయిన బీరు అయిన మితంగా తీసుకుంటేనే ఔషదం,  అమితంగా తీసుకుంటే విషం అని గుర్తుపెట్టుకోండి.

Source: Ap2tg.com

Must Read: ఆధార్ కార్డుతో 7 రోజుల్లో పాస్ పోర్ట్ పొందొచ్చు.

(Visited 23,021 times, 395 visits today)