EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / health / తాటికల్లు తో కాన్సర్ దూరం

తాటికల్లు తో కాన్సర్ దూరం

Author:

స్వర్గలోకంలో అమృతభాండం ఒలికి జారిన అమృతపు చుక్క భూమి మీద పడి తాళ వృక్షమై మొలిచిందట. ఈ మాటలో ఎంత నిజముందో తెలియదు కానీ.. తాటిచెట్టు కల్పవృక్షమని.. తాటికల్లు దివ్యౌషధమని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. తాటికల్లుతో క్యాన్సర్ కు చెక్ పెట్టవచ్చని ఉస్మానియా పరిశోధనా విభాగం తేల్చింది. చెట్టునుంచి అప్పుడే తీసిన తాటికల్లులో మనిషికి మేలు చేసే 18 రకాల సూక్ష్మజీవులున్నాయని ఓయూ పరిశోధనా విభాగం వెల్లడించింది. ఈ విషయాన్ని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కూడా ధృవీకరించింది. ఖమ్మం, వరంగల్‌ జిల్లాలో ఉస్మానియా బయలాజికల్ సైన్స్ ప్రొఫెసర్ భూక్యా భీమా 53 రకాల తాటికల్లు నమూనాలను సేకరించి టెస్టులు చేయగా తాటికల్లులో ఔషధగుణాలు మెండు అని రుజువు అయింది.

Health Benefits of Tatikallu

ఓయూ బయాలజీ ల్యాబ్ లో సూక్ష్మజీవులను వృద్ధి చేసే రసాయనంలో తాటికల్లు చుక్కలు వేసి పరిశీలించి, 48 గంటలపాటు ఇంక్యుబేటర్‌లో పెట్టగా.. ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయన్నారు ప్రొఫెసర్ భూక్యా భీమా. 53 రకాల సూక్ష్మజీవులను తాటికల్లులో గుర్తించారు. వీటిలో 18 రకాల సూక్ష్మజీవులు, మనిషిలోని వ్యాధికారక సూక్ష్మజీవులను చంపుతున్నట్లు ఐఐసీటీ సైంటిస్టులు (అంజనదేవి, వంశీకృష్ణ) గుర్తించారు. తాటికల్లులో చఖరోమైసెస్‌ అనే సూక్ష్మజీవి మనిషి కడుపులో క్యాన్సర్‌ వ్యాధికి కారణమయ్యే వోబీఎస్‌2 అనే క్యాన్సర్‌ కారక కణాలను సైతం నిరోధించే గుణం ఉందన్నారు. డయేరియా, టైఫాయిడ్‌ వ్యాధులకు కారణమయ్యే వైరస్ ను తాటికల్లులోని యాంటిబయోటిక్ గా పనిచేస్తుందని తేలింది. మసాలా, మాంసాహారాలు, జంక్ ఫుడ్ వంటి ఆహారపు అలవాట్లతో అస్థవ్యవస్థమైన మానవుడి జీర్ణవ్యవస్థని బాగుచేస్తుందని వెల్లడించారు పరిశోధకులు. పరిగడుపున ఫ్రెష్ తాటి లేదా ఈత కల్లు తాగటం ఆరోగ్యానికి ఎంతో మేలని మన పూర్వీకులు ఏనాడో చెప్పడం జరిగింది. ఇప్పుడు వారి మాట నిజంగా రుజువైందన్నారు పరిశోధకులు.

కాకపోతే, పులిసిన లేదా పుల్లగా మారిన కల్లు తాగితే మాత్రం అనారోగ్యం అన్నారు పరిశోధకులు. ఎందుకంటే చెట్టు నుంచి తాటి లేదా ఈతకల్లును గంటలోగా తాగేయాలన్నారు. లేదంటే అది ఆల్కహాల్ గా మారి అనారోగ్యానికి కారణమయ్యే బ్యాక్టీరియా అందులో వృద్ధి చెందుతుందని తెలియజేసారు ఓయూ పరిశోధనా విభాగం శాస్త్రవేత్తలు.

Comments

comments