Home / Inspiring Stories / 19990 రూపాయలకే హీరో ఫ్లాష్ ఎలక్ట్రిక్ స్కూటర్.

19990 రూపాయలకే హీరో ఫ్లాష్ ఎలక్ట్రిక్ స్కూటర్.

Author:

టూ వీలర్ రంగంలో ఉన్న అగ్రగామి సంస్థల్లో హీరో సంస్థ ఒకటి, ఇప్పుడు ఆ సంస్థ నుండి 19990 రూపాయలకే ఫ్లాష్ ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్ లోకి రానున్నాయి. కేవలం బ్యాటరీతో నడిచే ఈ స్కూటర్ ని కొనుకున్న తరువాత రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరంలేదు అంతే కాకుండా దీనిని నడపడానికి లైసెన్స్ కూడా అవసరం లేదు, చిన్నవారిని నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ నడపవచ్చు. ఈ సులభ నిభందనలే ఈ బండి అమ్మకాలు పెరగడానికి తోడ్పడతాయని హీరో ఎలక్ట్రిక్ గ్లోబల్, సిఈఓ సోహిందర్ గిల్ తెలిపారు.

Hero Flash Electric Scooter

కేవలం 87 కిలోల బరువున్న ఈ హీరో ఫ్లాష్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఒక సారి ఫుల్ గా చార్జింగ్ చేస్తే దాదాపు 65 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. 250 వాట్ విద్యుత్ మోటారు శక్తితో నడిచే ఈ బండి పూర్తి షార్ట్ సర్క్యూట్ రక్షణ కలిగి ఉంటుంది. తక్కువ దూరం ప్రయాణించడానికి సౌకర్యవంతంగా ఈ బండికి మెగ్నీషియం అలాయ్ వీల్స్, టెలీస్కోపిక్ సస్పెన్షన్ మరియు మిగాతా హంగులు ప్లస్ అవనున్నాయి. తక్కువ ధరలో బండి కోనాలనుకునేవారు ఒకసారి ఈ బండిని కూడా చూసిరండి.

Must Read: రిలయన్స్ కొత్త ఆఫర్: రూ.158లకే గ్యాస్ సిలిండర్లు.

(Visited 12,621 times, 40 visits today)