Home / Devotional / హేవళంబి నామ సంవత్సరం లో మీ రాశి ఆదాయ, వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

హేవళంబి నామ సంవత్సరం లో మీ రాశి ఆదాయ, వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Author:

తెలుగు సంవత్సరాది ఉగాది.. ఈ సంవత్సరం పేరు హేవళంబి నామ సంవత్సరం. తెలుగు సంవత్సరాలు అరవై అని మీకు తెలుసుకదా… తెలుగు సంవ‌త్స‌రాల వెనుక ఓ కథ ఉంది. నారద మహాముని ఓసారి విష్ణు మాయ వల్ల స్త్రీగా మారి, ఓ రాజును పెళ్లాడతాడు. వారికి 60 మంది సంతానం జన్మిస్తారు. ఓసారి ఆ రాజు తన సంతానంతో యుద్ధానికి వెళితే అంతా చనిపోతారు. అప్పుడు ప్రార్థించిన నారదుడిని విష్ణువు కరుణిస్తాడు. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి…. అయితే చరిత్ర ప్రకారం శాలివాహన శకం ఆరంభమైన రోజే ఉగాది అని కూడా అంటారు.

మనకు అసలైన నూతన సంవత్సరం ఉగాదే. ఇప్పటి నుండే మన వాతావరణంలో మార్పు మొదలవుతుంది. పంచాగం మొదలవుతుంది. సృష్టి మొదలవుతుంది. అందుకే ఈరోజు యుగానికి ఆది కాబట్టి అదే ఉగాది అయింది.ఈ రోజున పంచాంగ శ్రవణం అనేది ఆచారంగా వస్తున్నది… అయితే మారిన జీవితాల్లో అంత తీరిక లేకపోవటం వల్ల మన సాంప్రదాయాలకు దూరం జరిగాం…. అయితే పంచాంగ శ్రవణాన్ని పంచాంగ పఠనం గా మారిస్తే? అన్న ఆలోచనతో మీ కోసం ఈ హేవళంబి నామ సంవత్సర రాశిఫలాలను ఇక్కడ అందిస్తున్నాం… ఉగాది పచ్చడి తినేసాక… ఈ సంవత్సరం మీ రాశి ఫలం ఏమిటో, ఈ హేవళంబి నామ సంవత్సరంలో మీ ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి… ఉగాది శుభాకంక్షలతో అలజడి.కాం.

హేవళంబి నామ సంవత్సర రాశి ఫలాలు :

మేషరాశి:

ఆదాయం: 5 వ్యయం: 5 రాజపూజ్యం: 3 అవమానం: 1

వృషభరాశి:

ఆదాయం: 14 వ్యయం: 11 రాజపూజ్యం: 6 అవమానం: 3

మిథునరాశి:

ఆదాయం: 11 వ్యయం: 14 రాజపూజ్యం: 3 అవమానం: 7

కర్కాటకరాశి:

ఆదాయం: 11 వ్యయం: 8 రాజపూజ్యం: 5 అవమానం: 4

సింహరాశి:

ఆదాయం: 14 వ్యయం: 2 రాజపూజ్యం: 1 అవమానం: 7

కన్యారాశి:

ఆదాయం: 2 వ్యయం: 11 రాజపూజ్యం: 4 అవమానం: 2

తులారాశి:

ఆదాయం: 14 వ్యయం: 11 రాజపూజ్యం: 7 అవమానం: 3

వృశ్చిక రాశి:

ఆదాయం: 5 వ్యయం: 5 రాజపూజ్యం: 3 అవమానం: 3

ధనూరాశి:

ఆదాయం: 8 వ్యయం: 11 రాజపూజ్యం: 4 అవమానం: 3

మకరరాశి:

ఆదాయం: 11 వ్యయం: 8 రాజపూజ్యం: 4 అవమానం: 5

కుంభరాశి:

ఆదాయం: 14 వ్యయం: 14 రాజపూజ్యం: 6 అవమానం: 1

మీనరాశి:

ఆదాయం: 8 వ్యయం: 11 రాజపూజ్యం: 6 అవమానం: 3

Comments

comments