EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / Inspiring Stories / అమెజాన్‌ లో జాబ్.. ఏడాదికి 22 ల‌క్ష‌ల జీతం ..అయినా వద్దన్నాడు

అమెజాన్‌ లో జాబ్.. ఏడాదికి 22 ల‌క్ష‌ల జీతం ..అయినా వద్దన్నాడు

Author:

అమెజాన్‌ లో జాబ్.. జీతం ఏడాదికి 22 ల‌క్ష‌లు.. అయినా వద్దన్నాడు ఒక యువకుడు. అవును, మీరు చదువుతున్నది నిజమే… ఇంత పెద్ద జాబ్ ని  నిజంగానే వద్దన్న ఆ మహానుభావుడే హర్యానా కు చెందిన హిమాన్షు జైన్‌. ప్రపంచంలోనే ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్‌లో ఉద్యోగం రావడం అంటే ఆషామాషీ కాదు. అలాంటిది అంట పెద్ద కంపెనీ పిలిచి జాబ్ ఇస్తానంటే వద్దన్నాడు. ఏడాదికి 22 ల‌క్ష‌ల‌ రూపాయల ప్రారంభ జీతంతో ఆఫ‌ర్ లెట‌ర్ కూడా ఇచ్చింది. కానీ సింపుల్ గా వద్దన్నాడు. తన లక్షం తన ఆశయం వేరన్నాడు. అతనే మొన్నటి సివిల్స్ ప‌రీక్షల్లో దేశ వ్యాప్తంగా 44వ ర్యాంకును సాధించిన హిమాన్షు జైన్‌. ఇతనికి చిన్న‌ప్ప‌టి నుంచే క‌లెక్ట‌ర్ అయ్యి ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌న్న ఆశ. అందుకే ట్రిపుల్ ఐటీలో చదువుకున్నప్పటికీ, మంచి మంచి కంపెనీలు ఉద్యోగాల ఆఫర్లు ఇచ్చినప్పటికీ అత‌ను సివిల్స్ వైపే మొగ్గాడు.  హైద‌రాబాద్‌లోని International Institute of Information Technology (IIIT) లో చదివిన హిమాన్షు తన మూడో ప్రయత్నం లోనే 44 వ ర్యాంకు సాధించాడు.

himanshu-jain-who-cracked-upsc-exam-rejected-22lakh-amazon-offer

అయితే IIIT, హైదరాబాద్ లో చదువుతున్నపుడే, అమెజాన్ లో 3 నెల‌ల పాటు ఇంటర్న్ గా పని చేశాడు. ఇక్కడే అత‌ని ప్ర‌తిభ గమనించింది అమెజాన్. అందుకే ట్రిపుల్ ఐటీ కోర్సు పూర్తి కాక‌ముందే హిమాన్షుకు ఏడాదికి రూ.22 ల‌క్ష‌ల వేత‌నాన్ని ఆఫ‌ర్ చేసింది. కానీ అప్పటికే సివిల్స్ లక్షంగా పెట్టుకున్న హిమాన్షు అమెజాన్ కు నో చెప్పేశాడు. త‌న‌కు దేశ సేవ‌, ముఖ్యంగా ప్ర‌జ‌ల సేవే ముఖ్య‌మని తెలిపాడు. జాబ్ వద్దనుకున్న హిమాన్షు వెంటనే ఢిల్లీ వెళ్లిపోయాడు. రెండేళ్ల పాటు సివిల్స్ కోసం క‌ష్ట‌ప‌డ్డాడు. ఈ ఏడాది అంటే తన మూడో ప్రయత్నం లో అతని లక్షం నెరవేరింది. ఆల్ ఇండియా 44వ ర్యాంక్ తో తన కల నెరవేర్చుకున్నాడు. అబ్దుల్ కలాం చెప్పినట్టు కలలు కనండి, వాటిని నెరవేర్చుకొండి అన్న దాన్ని చేసి చూపించాడు. తను కన్న కలల కోసం ఎంత మంచి ఉద్యోగమైనా… ఎన్ని లక్షలు ఆఫర్ ఇచ్చినా వద్దన్నాడు, కష్టపడి అనుకున్నది సాధించాడు.  అత‌ను కల కన్నట్టుగానే క‌లెక్ట‌ర్ అయ్యి ప్ర‌జ‌ల‌కు సేవ చేయాలని అలజడి ఆశిస్తోంది. అతని పట్టుదలకు, కార్య దీక్షతకు హాట్స్ ఆఫ్ చెబుతోంది. గుడ్ లక్ మిస్టర్ హిమాన్షు.

Comments

comments