EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / health / గోరు వెచ్చటి నీరు తాగటం వల్ల శరీరానికి జరిగే ప్రయోజనాలు.

గోరు వెచ్చటి నీరు తాగటం వల్ల శరీరానికి జరిగే ప్రయోజనాలు.

Author:

రోజూ వీలైనంత ఎక్కువ నీరు తాగడం ఆరోగ్యకరమని వైద్యులు చెబుతున్నారు. అలాగని, చల్లని నీరు తాగేద్దాం అనుకుంటున్నారేమో… అలా చల్లని నీరు తాగటం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ కలుగుతుంది. చల్లని నీటికి బదులు వేడి నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.

మధుమేహం, గుండె జబ్బులు, ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి వెచ్చని నీరు ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు, మరే ఇతర రోగాలను దరిచేయకుండా అడ్డుకుంటుందని వైద్యులు సూచిస్తున్నారు. మరి, వేడి నీటి వల్ల ఇంకా ఏయే ప్రయోజనాలు చేకూరుతాయో తెలుకోండి.

 • వేడినీళ్లు తాగడం వల్ల శరీరం శుద్ధి అవుతుంది. వేడినీళ్లు తాగిన వెంటనే మన శరీరంలో ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. కొందరిలో చిరుచెమటలు పడతాయి. అలా చెమట ద్వారా శరీరంలో ఉన్న మలినాలు బయటకు వెళ్లి పోవడం వల్ల శరీర శుద్ధి జరుగుతుంది.
 • నరాలు, కండరాలు కూడా చురుకుగా పనిచేసేందుకు వేడినీళ్లు ఉపయోగపడతాయి. నరాలు చురుకుగా ఉండడం వల్ల మన ఆలోచనలు సానుకూలంగా ఉంటాయి. అంటే వేడినీళ్లు తాగడం వల్ల శరీరం, మనసు రెండూ శుద్ధి అవుతాయాన్నమాట.
 • ఈ సీజన్‌లో ఎక్కడ చూసినా జ్వరాలు, జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్న వారు కనిపిస్తారు. ఇలా జలుబు, దగ్గు బాధిస్తున్నప్పుడు తప్పనిసరిగా గోరువెచ్చని నీళ్లు తాగాలి. తద్వారా శ్వాస సక్రమంగా ఆడుతుంది. ముక్కు దిబ్బడ తగ్గుతుంది. వేడినీళ్లలో ఒక చెంచా తేనె, కాస్త నిమ్మరసం కలుపుకొని తాగితే మరింత ప్రయోజనం ఉంటుంది.
 • బాగా జలుబు చేసినప్పుడు రోజుకు రెండుసార్లు వేడినీళ్లలో కాస్త విక్స్, లేదా పసుపు, వేప ఆకులు వేసి ఆవిరి పట్టండి. ఎంత రిలీఫ్‌గా ఉంటుందో మీరే గమనించండి.
 • దగ్గు, పడిశంతో బాధపడుతున్నవారు గోరు వెచ్చని నీరు తాగితే వెంటనే ఉపశమనం పొందవచ్చు.
 • గొంతు సమస్యలు దరి చేరువు. జలుబు, న్యూమోనియా నుంచి దూరంగా ఉంచుతుంది.
 • మధుమేహం వస్తుందని భయపడేవారికి వేడి నీరు మంచి ఔషదంగా పనిచేస్తుంది.
 • కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఆర్థరైటీస్ సమస్యలు రాకుండా చూస్తుంది.
 • కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు.. ఇతరాత్ర ఉదర సంబంధిత వ్యాధులకు ఇది మంచి మందు.
 • ఊబకాయం, అధిక బరువు సమస్యలనూ వేడి నీళ్లతో అధిగమించవచ్చు.
 • రక్త ప్రసరణ పెంచడంతోపాటు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
 • వేసవిలో సైతం డిహైడ్రేడ్ సమస్య తీర్చేందుకు వేడి నీరు ఉపయోగపడుతుంది.

ఇలా తాగాలి: ఉదయం నిద్రలేచిన తర్వాత, కాలకృత్యాల కంటే ముందుగానే కనీసం రెండు లేదా మూడు గ్లాసుల గోరు వెచ్చని నీటిని తాగాలి. నీటిని ఒక్కసారిగా గొంతులో వేసుకోకుండా నోటిలోనే ఉంచుకుంటూ గుటకలు వేస్తూ తాగాలి. ఇలా రోజూ చేస్తే చాలా కొద్ది రోజుల్లోనే చక్కని ఫలితాలు చూడవచ్చని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి రోజూ స్త్రీలు 2.6 లీటర్లు, పురుషులు 3.7 లీటర్లు చొప్పున తాగడం మంచిది. మరి, మీరూ ప్రయత్నించి చూడండి

(Visited 1 times, 584 visits today)