EDITION English తెలుగు
మూవీ రివ్యూ: 'పేట'   మూవీ రివ్యూ:వినయ విధేయ రామ   మూవీ రివ్యూ:యన్.టి.ఆర్‌ -కథానాయకుడు   హైదరాబాద్ లో రోబో కిచెన్   ఈ క్యాబ్ డ్రైవ‌ర్ రాత్రి పూట అవ‌స‌రం ఉన్న వారిని ఉచితంగా క్యాబ్‌లో ఇంటి దగ్గ‌ర దింపుతాడు. ఎందుకో తెలుసా..?   మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాటకు కరెక్ట్ అర్థం ఈ జంటే... వీరి కథ వింటే ఆశ్చర్యపోవాల్సిందే. రియల్ స్టోరీ..!   మూవీ రివ్యూ: పడి పడి లేచె మనసు   పొరిగింటి రెండేళ్ల చిన్నారి కోసం...చనిపోతూ ఈ తాత ఇచ్చిన విలువైన బహుమతి ఏంటో తెలుసా..?   కేంద్రం సంచలన నిర్ణయం...! ఇకపై ఆధార్ అడిగితే కోటి జరిమానా...జైలు శిక్ష! వివరాలు ఇవే!   ఎంతపెద్ద జ్వరమైనా ఈ ట్రిక్ పాటిస్తే సింపుల్ గా తగ్గిపోద్ది.! కావాల్సింది పెసరపప్పు ఒక్కటే.!
Home / General / జీఎస్టీ ఎఫెక్ట్ : లేటు చేసారో రేట్ పెరుగుద్ది…!

జీఎస్టీ ఎఫెక్ట్ : లేటు చేసారో రేట్ పెరుగుద్ది…!

Author:

ఇంకో 4 రోజుల్లో దేశవ్యాప్తంగా GST అమలు కానుంది. అంటే ఇంకా జస్ట్ 4 రోజులే. ఆ తర్వాత కొన్నివస్తువులు ఇంకా కాస్ల్టీ కానున్నాయి. ఇప్పట్లో అంటే..ఇంకో నెల, రెండు నెలల్లో ఈ వస్తువులు కొoదాo అనుకునేవాళ్ళకి ఇదే రైట్ టైం అంటున్నారు వ్యాపారులు. జూలై ఒకటి నుంచి అమల్లోకి రాబోతున్న GST తో ఈ వస్తువుల ధరలు పెరగనున్నాయి… కాబట్టి ఈ వారం రోజుల్లో కొంటేనే మంచి ఆఫర్స్తో కొనవచ్చని సూచిస్తున్నారు వ్యాపార నిపుణులు.ఇప్పట్లో ఏ పండగ సీజన్ లోనూ ఇంత కంటే తక్కువ ధరకు దొరకవని కూడా చెబుతున్నారు.

జీఎస్టీ

GST తో ధర పెరగనున్న వస్తువులు..  కొందాం అనుకుంటే ఈ వారంలో కొoటేనే బెటర్ అనే వస్తువుల లిస్టు

బంగారం, ఆభరణాలు :

రానున్న నెల, రెండు నెలల్లో బంగారం లేదా ఆభరణాలు కొoదాo అనుకునే వారికి ఇదే సరైన సమయం. ఎందుకంటే బంగారం బిస్కెట్లపైనే కాదు,ఆభవరణాలపైనా GST పన్నుభారం పడనుంది.

మొబైల్ ఫోన్లు :

GST అమలుతో స్మార్ట్ ఫోన్ల ధర 4శాతం పెరగనున్నాయి. ఇప్పుడు 12శాతంగా ఉన్న టాక్స్, జూలై ఒకటి నుంచి 18శాతం అవనుంది.అంటే 10వేల రూపాయల మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తే 1800 ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది.

చిన్నకార్లు, బైకులు :

చిన్నకార్లు, బైక్స్ GST పరిధిలోకి రాగానే 8-10శాతం రేట్లు పెరగనున్నాయి. దీంతో చిన్నకార్లు, బైక్స్ కొనుగోలుకి ఇదే మంచి టైం అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా ప్రస్తుతం 10శాతం డిస్కౌంట్ కూడా వస్తుంది. ఓవరాల్ గా చూస్తె జూన్ 30లోపు కొనే వాహనాలు 15శాతం తక్కువ ధరకి లభించే అవకాశం ఉంది.

ల్యాప్ ట్యాప్స్, డెస్క్ టాప్స్ :

ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ కు ప్రస్తుతం 15శాతo ట్యాక్స్ ఉంది. GSTతో 18శాతం అవనుంది. జూలై ఒకటి తర్వాత బ్రాండెడ్ ల్యాప్ ట్యాప్ లు, కంప్యూటర్స్ కనీసంగా 2-5శాతం రేట్లు పెరగనున్నాయి. ఈ వీక్ లో కొంటె, డిస్కౌంట్స్ ప్లస్ ఆఫర్స్ కింద 10శాతం తక్కువ రేటుకే లభించనున్నాయి.

రెడీమేడ్ దుస్తులు :

రూ.2వేల రెడీమేడ్ దుస్తులు కొనుగోలు చేస్తే ప్రస్తుతం మీరు చెల్లిస్తున్నది రూ.130 ట్యాక్స్. GST పరిధిలోకి రావటం వల్ల మీరు రూ.240 పన్ను కట్టాలి. అంటే అదనంగా మీపై పడి భారం రూ.110.

టీవీలు – రిఫ్రిజరేటర్లు :

వీటిపై ప్రస్తుతం 23 నుంచి 28శాతం టాక్స్ ఉంది. GSTతో 28శాతం అవనుంది. అంటే జూలై ఒకటి తర్వాత టీవీలు, ఫ్రిడ్జిలపై 5శాతం ధరలు పెరగనున్నాయి. సో ఈ వారం ఐతే ఏంటో కొంత మిగిలినట్టే.

సో ఇంకేం ఆలోచించకండి.ఈ వస్తువులు కొనుక్కోవాలనే ఆలోచన ఉంటే మాత్రం ఈ వారంలో కొనడమే కరెక్టు. డిస్కౌంట్స్, ఆఫర్స్, పైగ్గా తక్కువ రేటు.. లేటు చేసారో రేటు పెరుగుద్ది అని కూడా ముందే గుర్తు చేస్తున్నారు వ్యాపారులు, నిపుణులు.

 

(Visited 2,420 times, 34 visits today)